ముంబై: ‘సూద్ చారిటీ ఫౌండేషన్’లో ఉన్న ప్రతి రూపాయిని ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఆపన్నులను ఆదుకోవడానికే ఖర్చు చేస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను పోస్టు చేశారు. ఓ వార్తా సంస్థతోనూ మాట్లాడారు. సోనూసూద్‌తోపాటు ఆయన అనుచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గతవారం సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయన తొలిసారిగా ప్రకటన విడుదల చేశారు. ‘కొందరు అతిథుల’ సేవలో తీరిక లేకుండా ఉన్నానని, అందుకే గత నాలుగు రోజులుగా ప్రజలకు సేవ చేయలేకపోయానని వివరించారు.
(చదవండి: Bheemla Nayak: డానియల్ శేఖర్‌గా రానా.. పంచెకట్టులో పవర్‌ఫుల్‌గా)
నా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఇంకా చదవని మెసేజ్‌లు 54,000 ఉన్నాయి. సాయం కోసం ఎంతోమంది అర్థిస్తున్నారు. రూ.18 కోట్లు ఖర్చు చేయాలనుకుంటే 18 గంటలు కూడా పట్టదు. కానీ, ప్రతి పైసా సరైన విధంగా, అర్హులైన వారి కోసమే ఖర్చు పెట్టాలన్నదే నా ఆలోచన. రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతామంటూ రెండు వేర్వేరు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి. రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధం కాకపోవడంతో తిరస్కరించా. ఇప్పుడున్న హోదాతో సంతోషంగా ఉన్నా. మానసికంగా సిద్ధమైనప్పుడు చెబుతా. నా సేవా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఆపడానికి కాదు ప్రారంభించింది. ఇది ఆరంభం మాత్రమే’’ అని సోనీ సూద్ స్పష్టం చేశారు. సోనూ సూద్ రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సోదాల్లో గుర్తించామని సీబీడీటీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
చట్టానికి కట్టుబడి ఉంటా..
‘అన్నివేళలా మన వాదనను మనం వినిపించలేకపోవచ్చు. కానీ, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ప్రజల సేవ కోసం, వారి ప్రాణాలను రక్షించడం కోసం ఎదురు చూస్తోంది. సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు కోసం బ్రాండ్ల తరపున ప్రచారం చేశా. ఫౌండేషన్‌కు ఎవరైనా ఒక్క రూపాయి విరాళం ఇచ్చినా దానికి లెక్క చెబుతా. నేను సేకరించిన సొమ్ము కేవలం ప్రజల విరాళాలే కాదు అందులో బ్రాండ్లకు ప్రచారకర్తగా నేను సంపాదించిన డబ్బు కూడా ఉంది.
(చదవండి: Bigg Boss Telugu 5: మూడో వారం నామినేట్ అయింది వీళ్లేనా?)
Comments
Please login to add a commentAdd a comment