
న్యూఢిల్లీ: చారిటబుల్ ట్రస్ట్‌లు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంస్థలకు సంబంధించి, ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగించనుంది. ఈ సంస్థలు ఐటీఆర్–7 దాఖలు చేసేందుకు అక్టోబర్ 31 గడువు కాగా, ఒక నెల అదనంగా నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ రిపోర్టులు సమర్పించేందుకు ఫండ్, ట్రస్ట్, ఇన్‌స్టిట్యూషన్, యూనివర్సిటీ లేదా విద్యా సంస్థలు, మెడికల్ ఇన్‌స్టిట్యూషన్లకు నవంబర్ 30 వరకు గడవును పొడిగించారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది.