deadline extension
-
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తాజా సవరణ మేరకు 2024–25 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.500 లేట్ ఫీజుతో వచ్చేనెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.ఫీజును www.bse.ap.gov.in లో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో నామినల్ రోల్స్ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్‌టికెట్ జారీకి ముందు ఎడిట్ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్ దేవానందరెడ్డి వివరించారు. ఫీజు వివరాలు ఇలా..⇒ అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి రూ.125 ⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110⇒ వొకేషనల్ విద్యార్థులు అదనంగా మరో రూ.60⇒ నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300⇒ మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు రూ.80 -
అవాంఛిత కాల్స్ నిబంధనలపై అభిప్రాయాలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అవాంఛిత మార్కెటింగ్ కాల్స్, మెసేజీల కట్టడి కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును కేంద్రం ఆగస్టు 8 వరకు పెంచింది. వివిధ ఫెడరేషన్లు, అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్ధనలు వచ్చిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే వచ్చిన సలహాలు, అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. వాస్తవానికి ఈ డెడ్‌లైన్ జూలై 21తో ముగిసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అన్‌రిజిస్టర్డ్ మార్కెటర్లు ప్రైవేట్ నంబర్ల నుంచి చేసే ప్రమోషనల్ కాల్స్, మెసేజీలను కట్టడి చేయడం ఈ మార్గదర్శకాల లక్ష్యం. టెల్కోలు, నియంత్రణ సంస్థలు తదితర వర్గాలతో సంప్రదింపుల మేరకు వీటిని రూపొందించారు. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించామని తెలిపారు. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాçÜం అంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. WWW.cse.ap.gov.in/apms.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగింపు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్హెచ్ఏఐ మరోసారి పొడిగించింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ పనిచేయకుండాపోవచ్చు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్‌తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం. -
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి గడువు పొడిగించింది. వాస్తవానికి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్ 30తో గడువు ముగిసింది. అయితే, ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో 15 వరకు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ఇంటర్ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1100, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. ఇప్పటికే ఇంటర్ పాసై ఇంప్రూవ్మెంట్ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్ కోర్సులకు రూ.1240, సైన్స్ కోర్సులకు రూ.1440 ఆయా కళాశాలల్లో చెల్లించాలి. -
చారిటబుల్ ట్రస్ట్‌లకు ఐటీఆర్ గడువు పెంపు
న్యూఢిల్లీ: చారిటబుల్ ట్రస్ట్‌లు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంస్థలకు సంబంధించి, ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగించనుంది. ఈ సంస్థలు ఐటీఆర్–7 దాఖలు చేసేందుకు అక్టోబర్ 31 గడువు కాగా, ఒక నెల అదనంగా నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ రిపోర్టులు సమర్పించేందుకు ఫండ్, ట్రస్ట్, ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ లేదా విద్యా సంస్థలు, మెడికల్ ఇన్స్టిట్యూషన్లకు నవంబర్ 30 వరకు గడవును పొడిగించారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. -
ఎడతెగని వర్షాలు: ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు మరో నెల పొడిగింపు?
ITR filing 2023: ఆదాయపన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలుకు గడువు సమీపిస్తోంది. మరో తొమ్మిది రోజుల్లో అంటే జూలై 31 నాటికి ఈ గడువు ముగియనుంది. అలాగే డెడ్‌లైన్ ముగిసేలోపు, రిటర్న్స్ దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా ఇప్పటికే సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని ఇటీవల స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఏడాది గడువు పెంపు ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు. గతంలో, ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలను పొడిగించింది. అలాగే ప్రస్తుత వరదలు, అనిశ్చిత వాతారణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పొడిగింపు ఉంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) మరోవైపు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ గడువును ఒక నెల పెంచాలంటూ సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసింది. ముఖ్యంగా రాజధాని న్యూఢిల్లీలో వరదల కారణంగా ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ సహా చాలా ఆఫీసులు పనిచేయ లేదని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆదాయపన్ను శాఖ అధికారిక ప్రకటన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) కాగా ఐటీఆర్ ఫైలింగ్ పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్‌లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపిన సంగతి తెలిసిందే. -
అలర్ట్: పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ద్వారా అర్హులైన కోట్లాదిమంది రైతులకు 12వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలోనే విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 1న ఈ నగదును రైతుల ఖాతాల్లో జమచేయనుందని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.(వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్) మరోవైపు ఈ-కేవైసీ అప్డేట్ చేసుకొని రైతన్నలకు మరో అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువును ఆగస్టు 31వ తేదీ దాకా పొడిగించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12వ విడత నగదు పొందాలంటే ఈ-కేవైసీ అప్డేట్ తప్పనిసరి. అప్డేట్ చేయకపోతే తదుపరి విడత నగదు రైతులకు రాదు. ఈనేపథ్యంలో ఈ ఈ-కేవైసీ అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) పీఎం కిసాన్ నమోదిత అన్నదాతలు ఓటీపీ ఆధారంగా కూడా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో బయోమెట్రిక్ ఆధారంగా కూడా సమీపంలోని సీఎస్సీ కేంద్రాలల్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ-కేవైసీ అప్డేట్ ఇంట్లోనే మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి ఆ తర్వాత కుడి వైపు ఉండే e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇక్కడ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ స్టెప్-4పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. సంబంధిత నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఎలా లబ్దిదారుడైన అన్నదాత సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లాలి. పీఎం కిసాన్ ఖాతా కోసం ఆధార్ అప్డేట్ సమర్పించాలి. పీఎం కిసాన్ ఖాతాకు లాగిన్ అయ్యేందుకు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ కార్డ్ నంబర్ అప్డేట్ చేసి, సబ్మిట్ చేసిన తర్వాత ఫోన్‌కు వచ్చే ఎస్ఎంఎస్ ద్వారి నిర్ధారించుకోవాలి. అంతేకాదు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు. అధికారిక ఇ-మెయిల్ ఐడీని సంప్రదించి పరిష్కారం పొందవచ్చు. దేశంలో అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు ఈ పథకంలో ఆర్థికఆసరా కల్పిస్తోంది కేంద్రం.తద్వారా రైతులకు వ్యవసాయ,సంబంధిత సామాగ్రి కొనుగోలు ఖర్చులకు సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున అందిస్తుంది. ఈ మొత్తాన్ని విడతకు రూ. 2000 చొప్పున ఏడాదిలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అంటే ప్రతి నాలుగు నెలలకోసారన్నమాట. దీనికి సంబంధించి నమోదు గడువు ఇప్పటిదాకా జూలై 31. అయితే ఇప్పటికే ఈ డెడ్‌లైన్‌ను వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ గడువును 3 సార్లు ( జూలై 31, మే 31, మార్చి 31) పొడిగించింది. -
Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020 –21) సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు అదనంగా రెండు నెలల గడువు ఇస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. అదే విధంగా కంపెనీలకు సైతం అదనంగా ఒక నెల గడువు ఇస్తూ నవంబర్ 30 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం.. వ్యక్తులు (ఖాతా లకు ఆడిటింగ్ అవసరం లేని వారు) తమ రిటర్నులను జూలై 31 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఖాతాలకు ఆడిటింగ్ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్ 31. ఇవి సాధారణ గడువులు. అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అదనపు సమయాన్ని ఆదాయపన్ను శాఖ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. కరోనా మహమ్మారి కారణం గా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది. గడువు పొడిగిం చడం వల్ల నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కినట్టేనని నాంజియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. ► సంస్థలు తమ ఉద్యోగులకు ఫామ్ 16 మంజూరుకు సైతం గడువును జూలై 15కు సీబీడీటీ పొడిగించింది. ► ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ దాఖలుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ► ఆలస్యపు, సవరించిన రిటర్నుల దాఖలుకు నూతన గడువు 2022 జనవరి 31. ► ఆర్థిక సంస్థలు ‘ఆర్థిక లావాదేవీల నివేదిక’ (ఎస్ఎఫ్టీ) సమర్పించేందుకు మే 31వరకు ఉన్న గడువు జూన్ 30కు పెరిగింది. ► 2020–21 ఏడాదికి సంబంధించి నూతన పన్ను విధానాన్ని (తక్కువ రేట్లతో, పెద్దగా మినహాయింపుల్లేని) ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కల్పించిన విషయం విదితమే. ఈ మేరకు ఐటీ రిట ర్నుల పత్రాల్లో సీబీడీటీ మార్పులు కూడా చేసింది. 7 నుంచి ఆదాయపన్ను కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వకమైన నూతన పోర్టల్‌ను జూన్ 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. www. incometaxindiaefiling.gov.in ప్రస్తుత ఈ పోర్టల్ స్థానంలో జూన్ 7 నుంచి www. incometaxgov.in పోర్టల్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఏవైనా సమర్పించాల్సినవి ఉంటే, అప్లోడ్, డౌన్లోడ్ పనులను జూన్ 1లోపు పూర్తి చేసుకోవాలని సూచించింది. జూన్ 1–6 మధ్య ప్రస్తుత పోర్టల్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎటువంటి గడువులు నిర్దేశించలేదని పేర్కొంది. వేగంతోపాటు కొత్త సదుపాయాలు కొత్త పోర్టల్ ఎన్నో సదుపాయాలతో ఉంటుందని, వేగంగా రిటర్నుల దాఖలు, పన్ను రిఫండ్లకు అనుకూలంగా ఉంటుందని సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి అన్ని రకాల స్పందనలు, అప్లోడ్లు, అపరిష్కృత అంశాలన్నీ ఒకే డాష్‌బోర్డులో దర్శనమిస్తాయని వివరించింది. వెబ్సైట్లో ఉండే అన్ని ముఖ్య సదుపాయాలు మొబైల్ యాప్‌పైనా లభిస్తాయని పేర్కొంది. -
పాన్–ఆధార్ గడువు మరో 3 నెలలు
న్యూఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాన్)తో ఆధార్‌ను అనుసంధానించేందుకు నిర్దేశించిన డెడ్‌లైన్‌ను కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. జూన్ 30 దాకా దీన్ని పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. మరోవైపు, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ స్కీమ్’ గడువు మార్చి 31తో ముగిసింది. వాస్తవానికి డిక్లరేషన్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28, చెల్లింపులు జరిపేందుకు మార్చి 31 ఆఖరు తేదీలు. అయితే, ఆదాయ పన్ను శాఖ ఈ డెడ్లైన్లను గతంలో పొడిగించింది. దీని ప్రకారం డిక్లరేషన్ల దాఖలుకు మార్చి 31తో గడువు ముగిసింది. ఏప్రిల్ 30లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద ఫిబ్రవరి 22 దాకా సుమారు రూ. 98,328 కోట్ల విలువ చేసే పన్ను వివాదాలకు సంబంధించి 1.28 లక్షల డిక్లరేషన్లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గత నెలలో లోక్‌సభకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 53,346 కోట్లు ఖజానాకు వచ్చాయి. గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. -
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం సెక్షన్ 100 (2)ను సవరిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగరపాలక సంస్థల్లో పొడిగించిన గడువుకు అదనంగా ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను, ఇతర బకాయిల చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. చదవండి : ఆపరేషన్ ‘ఢిల్లీ రిటర్న్’ -
వాహన పర్మిట్ల వ్యాలిడిటీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు విఘాతం కలగకుండా వాహన పర్మిట్ల వ్యాలిడిటీ గడువును జూన్ 30 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, రిజిస్ర్టేషన్ పత్రాల చెల్లుబాటు వ్యవధిని ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకూ పొడిగించినట్టు కేంద్రం పేర్కొంది. ఈ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని జూన్ 30గా పరిగణించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ రవాణా కార్యాలయాలు మూతపడటంతో మోటార్ వాహనాల చట్టం, కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలకు అనుగుణంగా ఆయా డాక్యుమెంట్ల రెన్యువల్లో ఎదురువుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. దేశమంతటా నిత్యావసర సరుకులు, వస్తువులు నిరాటంకంగా సరఫరా అయ్యేందుకు ఈ మార్గదర్శకాలను విధిగా అమలుపరచాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. చదవండి : మందుబాబులకు గుడ్‌న్యూస్.. డోర్‌డెలివరీ -
పాన్ - ఆధార్ లింకింగ్ : మరోసారి ఊరట
సాక్షి, ముంబై: ఆధార్‌తో పాన్ వివరాలను లింక్ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో( డిసెంబర్ 31, 2019) గడువును దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏఏ లోని ఉప-సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సీబీడీటీ తాజాగా గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి. పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది. -
ఫాస్టాగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించింది. డిసెంబరు 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని ప్రకటించిన కేంద్రం.. తాజాగా గడువు పొడిగించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల వాహనాలు చెల్లింపుల నిమిత్తం నిలిచి ఉండాల్సిన పనిలేకుండా హైబ్రిడ్ లైన్లో వెళ్లిపోవచ్చు. నవంబర్ 21 నుంచి ట్యాగ్ వ్యయంలో వెసులుబాటు ఇచ్చిన దగ్గర నుంచి వీటి వినియోగం గణనీయంగా పెరిగినట్లు ప్రకటించింది. -
బ్రెగ్జిట్ గడువు జనవరి 31
లండన్/బ్రసెల్స్: బ్రిటన్ పార్లమెంట్లో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో మరో కీలక పరిణామం సంభవించింది. బ్రిటన్‌కు మరింత వెసులుబాటు ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంగీకరించింది. బ్రెగ్జిట్‌పై ఈనెలాఖరు వరకు ఉన్న గడువును మరో మూడు నెలలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఈయూ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యూనియన్‌లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తాజాగా ట్విట్టర్లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో సాధ్యమైనంత త్వరగా..తాజాగా ప్రకటించిన గడువులోగానే ఈయూతో తెగదెంపులు చేసుకునే అవకాశం బ్రిటన్‌కు ఉందన్నారు. బ్రెగ్జిట్ గడువు పొడిగింపుపై ఈయూ పార్లమెంట్ చర్చించి, ఆమోదం తెలపాలంటే సత్వరమే దీనిపై బ్రిటన్ లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. బ్రెగ్జిట్ పొడిగింపుపై ఈయూ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈయూ పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చించి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువరించనుంది. దీని ప్రకారం.. జాన్సన్ ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పార్లమెంట్ నవంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 31వ తేదీల్లో ఎప్పుడు ఆమోదించినా.. ఆ వెంటనే బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయనుంది. డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రవేశపెట్టనున్న తీర్మానంపై వచ్చే సోమవారం పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. -
పాన్, ఆధార్ లింక్ : మరోసారి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు డెడ్‌లైన్‌ను ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్ధేశించగా తాజాగా ఆ గడువును డిసెంబర్ 31 వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా పాన్ కార్డును ఇంకా ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట ఇస్తోంది. నిర్ధేశిత డెడ్‌లైన్‌లోగా పాన్‌తో ఆధార్ లింక్ కాకుంటే పాన్ కార్డు పనిచేయదు. ఈ క్రమంలో పాన్‌ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. -
బ్రెగ్జిట్ గడువు అక్టోబర్ 31 వరకు పెంపు
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ గడువు మరోసారి పెరిగింది. బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది. ఈ గడువులోగా బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంటు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని థెరెసా మేకు సూచించింది. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో గురువారం సమావేశమైన 28 ఈయూ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనల మేరకు వచ్చే నెల 23న జరిగే ఈయూ ఎన్నికల్లో బ్రిటన్ పాల్గొనాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్క్లౌడే జంకర్ తెలిపారు. -
మూడు కోట్ల మంది ముందుకొచ్చారు..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐటీ) రిటన్స్ దాఖలు చేసిన వారి సంఖ్య రెట్టింపై దాదాపు 3 కోట్లకు పెరిగింది. పరిష్కరించిన రిఫండ్ కేసుల సంఖ్య కూడా 81 శాతం పెరిగి 65 లక్షలకు చేరుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది 60 శాతం వరకూ ఆన్లైన్లో రిటన్స్ దాఖలు కాగా వాటి ప్రాసెసింగ్ కూడా ఇప్పటికే చేపట్టినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మరోవైపు సామాన్య ప్రజలకు ఊరటగా ఆదాయ పన్ను శాఖ పన్ను రిటన్స్ దాఖలు చేసే తుది గడువును నెల రోజులు పొడిగించింది. ఆగస్టు 31 వరకూ ఐటీ రిటన్స్ దాఖలు చేసేందుకు డెడ్‌లైన్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఐటీ రిటన్స్ దాఖలు చేసేందుకు తుది గడువును జులై 31 నుంచి ఆగస్ట్ 31 వరకూ పొడిగించిన నేపథ్యంలో పన్ను చెల్లింపులో జాప్యం చేయకుండా చట్టాన్ని గౌరవించే పౌరులుగా సకాలంలో పన్నులు చెల్లించి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. -
మార్చి 31 వరకూ ‘పాన్–ఆధార్’ గడువు
న్యూఢిల్లీ: పాన్‌కార్డు–ఆధార్ అనుసంధానానికి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పొడిగించింది. శనివారంతో గడువు ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 119 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌తో వ్యక్తుల పాన్ నెంబర్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం ఇది ఐదోసారి కాగా.. ఈ ఏడాది మార్చి 27న చివరిసారి పొడిగించారు. ఆధార్‌తో ఇతర సేవల అనుసంధానం కోసం ఇచ్చిన గడువును మార్చి 31, 2018 నుంచి పొడిగించాలని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీడీటీ తాజా నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకూ గడువును పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఐటీ రిటరŠన్స్ దాఖలుకు, అలాగే కొత్త పాన్ కార్డు కోసం ఆధార్ నెంబరును గతేడాది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
పథకాలకు ఆధార్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి చివరి తేదీని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. సంచిత నిధి నుంచి నిధులు అందే ప్రజా పంపిణీ వ్యవస్థ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పెన్షన్లు, ఉపకార వేతనాలు, గ్యాస్, ఎరువుల సబ్సిడీలు తదితర పథకాలకు ఇది వర్తిస్తుంది. తొలుత నిర్ణయించిన దాని ప్రకారం ఆ గడువు ఈ నెల 31న ముగియాల్సి ఉంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఈ మేరకు గడువును పొడిగిస్తూ ప్రకటన జారీచేసింది. మూడు నెలల గడువు ఇచ్చినా, సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే మాత్రం మార్చి 31 తరువాత ప్రజలు ఆధార్ సంఖ్య లేదా ఆధార్‌కు నమోదు చేసుకున్నట్లు చూపే ఎన్రోల్మెంట్ రశీదును సమర్పించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆధార్ లేని కారణంగా నిజమైన లబ్ధిదారులెవరూ నష్టపోకూడదనే తాజాగా గడువు పెంచినట్లు పేర్కొన్నాయి. బ్యాంకు ఖాతాలు–ఆధార్ అనుసంధానాన్ని బ్యాంకులు కొనసాగించొచ్చని, ఆధార్ లేనంత మాత్రాన బ్యాంకు ఖాతాలను రద్దుచేయొద్దని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ సూచించారు. -
12 వరకూ నీట్ దరఖాస్తుల గడువు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)కు దరఖాస్తులు సమర్పించేందుకు తుదిగడువును మార్చి 12 వరకూ పొడిగించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కాకుండా మిగతా గుర్తింపుకార్డులనూ అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు నీట్ పరీక్ష దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు మార్చి 8గా ఉండేది. తాజా నిర్ణయం ప్రకారం విద్యార్థులు తమ దరఖాస్తుల్ని మార్చి 12 సాయంత్రం 5.30 వరకూ సమర్పించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ఫీజును మార్చి 13, రాత్రి 11.50 వరకూ చెల్లించవచ్చన్నారు. -
జీఎస్టీ స్టిక్కర్ల గడువు పెంపు
న్యూఢిల్లీ: పాత పన్ను వ్యవస్థ కాలంలో తయారై, అమ్ముడుపోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కూడిన ఎమ్మార్పీ స్టిక్కర్లను అతికించేందుకు కంపెనీలకు వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం గడువిచ్చింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్‌తో ముగియాల్సి ఉంది. కానీ, నవంబరు 15 నుంచి 150కిపైగా వస్తువులపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం తెలిసిందే. దీంతో కొత్త స్టిక్కర్లను అతికించేందుకు గడువును మార్చి వరకు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. రెస్టారెంట్లు, హోటళ్లు నీళ్ల సీసాలను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చంటూ కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. ఆ తీర్పును సమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టులో త్వరలోనే రివ్యూ పిటిషన్ వేస్తామని పాశ్వాన్ చెప్పారు. -
సుధీర్ కమిషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి నియమించిన సుధీర్ కమిషన్‌కు మరో ఏడాదిపాటు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న గడువును పొడిగించడంతో సుధీర్ కమిషన్ 2018 జనవరి నెలాఖరు వరకు కొనసాగనుంది. -
డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పొడిగింపు
విద్యారణ్యపురి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపె¯ŒS యూనివర్సిటీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ అడ్మిషన్లకు రూ. 200 అపరాధ రుసుముతో అక్టోబర్ 6 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకట నలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారికి ప్రవేశ పరీక్ష లేకుండానే పీజీ కోర్సుల్లో అడ్మిష న్లు కల్పిస్తామన్నారు. ఎమ్మెస్సీ సై¯Œ్స విభాగాల్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంట్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. బీ ఎస్సీ, బీటెక్, బీ ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు ఎం ఏలో ఏదైనా కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. బీఆర్ఏఓయూ ఆ¯ŒSలై¯ŒS.ఇ¯ŒS పీజీ ఫస్టియర్ వెబ్సైట్లో రిజిసే్ట్రష¯ŒS దరఖాస్తులను డౌన్Sలోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కు 0870–2511862లో, హన్మకొండయూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సై¯Œ్స కాలేజీలోని ఓపె¯ŒSవర్సిటీ రీజినల్ సెంటర్లో సంప్రదించవచ్చన్నారు. ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్లో... ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్లో ప్రవేశాలకు రూ. 200 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ రాజీవ్, ఓపె¯ŒS స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ శంకర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తర గతిలో అడ్మిషన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ఫీజు రూ. 700 ఉండగా.. రూ 100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఓసీ అభ్యర్థులకు రూ. 800 అడ్మిష¯ŒS ఫీజు ఉండగా.. రూ.100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని వివరించారు. ఇంటర్లో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ లకు అడ్మిష¯ŒS ఫీజు రూ.1000, అపరాధ రుసు ము రూ. 200, ఓసీ అభ్యర్థులకు రూ. 1300, అపరాధ రుసుము రూ. 200 చెల్లించిప్రవేశాలు పొందాలని సూచించారు. ఏపీ ఆ¯ŒSలై¯ŒS, టీఎస్ ఆ¯ŒSలై¯ŒS, మీ సేవ ద్వా రా అడ్మిషన్లు పొందవచ్చని వారు చెప్పారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత స్టడీ సెంటర్లను సంప్రదించి అడ్మిషన్లు పొందాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
కేయూ పీజీ సెట్ వెబ్ ఆప్షన్ గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు గడువును పొడిగించామని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. కొత్తగా కొన్ని కాలేజీలలో కోర్సులకు అనుమతి రావడం వల్ల వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈనెల 7వ తేదీన గడువు ముగియ గా, మళ్లీ పెంచామన్నారు. ఏదేని కారణాలతో కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోలేకపోయిన వారికి కూడా అవకాశం ఉందన్నారు. ఈనెల 10,11, 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చామన్నారు. వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న విద్యార్థులకు ఈనెల 16వ తేదీన మొదటి దశలో సీట్ల కేటాయింపు జరగుతుందని తెలి పారు. సీట్లు పొందిన విద్యార్థులు వారికి కేటాయిం చిన కళాశాలల్లో ఈనెల 20వ తేదీలోపు ప్రవేశాలు పొందాలన్నారు. ఏ కోర్సులో సీటు పొందారో విద్యార్థుల సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ ద్వారా సమాచారం వస్తుందన్నారు. కేయూ వెబ్సైట్లో చూసుకోవాలన్నారు.