అవాంఛిత కాల్స్‌ నిబంధనలపై అభిప్రాయాలకు గడువు పెంపు | deadline extend for public comments on draft guidelines to curb spam calls | Sakshi
Sakshi News home page

అవాంఛిత కాల్స్‌ నిబంధనలపై అభిప్రాయాలకు గడువు పెంపు

Published Fri, Jul 26 2024 9:10 AM | Last Updated on Fri, Jul 26 2024 11:41 AM

deadline extend for public comments on draft guidelines to curb spam calls

న్యూఢిల్లీ: అవాంఛిత మార్కెటింగ్‌ కాల్స్, మెసేజీల కట్టడి కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును కేంద్రం ఆగస్టు 8 వరకు పెంచింది. వివిధ ఫెడరేషన్లు, అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్ధనలు వచ్చిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే వచ్చిన సలహాలు, అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. వాస్తవానికి ఈ డెడ్‌లైన్‌ జూలై 21తో ముగిసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిబంధనలకు విరుద్ధంగా అన్‌రిజిస్టర్డ్‌ మార్కెటర్లు ప్రైవేట్‌ నంబర్ల నుంచి చేసే ప్రమోషనల్‌ కాల్స్, మెసేజీలను కట్టడి చేయడం ఈ మార్గదర్శకాల లక్ష్యం. టెల్కోలు, నియంత్రణ సంస్థలు తదితర వర్గాలతో సంప్రదింపుల మేరకు వీటిని రూపొందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement