ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి నియమించిన సుధీర్ కమిషన్
సాక్షి, హైదరాబాద్: ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి నియమించిన సుధీర్ కమిషన్‌కు మరో ఏడాదిపాటు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న గడువును పొడిగించడంతో సుధీర్ కమిషన్ 2018 జనవరి నెలాఖరు వరకు కొనసాగనుంది.