
సాక్షి, అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించామని తెలిపారు. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాçÜం అంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. WWW.cse.ap.gov.in/apms.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.