డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పొడిగింపు
Published Sat, Sep 24 2016 11:41 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
విద్యారణ్యపురి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపె¯ŒS యూనివర్సిటీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ అడ్మిషన్లకు రూ. 200 అపరాధ రుసుముతో అక్టోబర్ 6 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకట నలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారికి ప్రవేశ పరీక్ష లేకుండానే పీజీ కోర్సుల్లో అడ్మిష న్లు కల్పిస్తామన్నారు. ఎమ్మెస్సీ సై¯Œ్స విభాగాల్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంట్‌లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. బీ ఎస్సీ, బీటెక్, బీ ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు ఎం ఏలో ఏదైనా కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. బీఆర్‌ఏఓయూ ఆ¯ŒSలై¯ŒS.ఇ¯ŒS పీజీ ఫస్టియర్ వెబ్‌సైట్‌లో రిజిసే్ట్రష¯ŒS దరఖాస్తులను డౌన్Sలోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కు 0870–2511862లో, హన్మకొండయూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సై¯Œ్స కాలేజీలోని ఓపె¯ŒSవర్సిటీ రీజినల్ సెంటర్‌లో సంప్రదించవచ్చన్నారు.
ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్‌లో...
ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్‌లో ప్రవేశాలకు రూ. 200 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ రాజీవ్, ఓపె¯ŒS స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ శంకర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తర గతిలో అడ్మిషన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ఫీజు రూ. 700 ఉండగా.. రూ 100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఓసీ అభ్యర్థులకు రూ. 800 అడ్మిష¯ŒS ఫీజు ఉండగా.. రూ.100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని వివరించారు. ఇంటర్‌లో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ లకు అడ్మిష¯ŒS ఫీజు రూ.1000, అపరాధ రుసు ము రూ. 200, ఓసీ అభ్యర్థులకు రూ. 1300, అపరాధ రుసుము రూ. 200 చెల్లించిప్రవేశాలు పొందాలని సూచించారు. ఏపీ ఆ¯ŒSలై¯ŒS, టీఎస్ ఆ¯ŒSలై¯ŒS, మీ సేవ ద్వా రా అడ్మిషన్లు పొందవచ్చని వారు చెప్పారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత స్టడీ సెంటర్లను సంప్రదించి అడ్మిషన్లు పొందాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Advertisement
Advertisement