post graduate
-
డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు
కేరళలో తొలిసారిగా మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. అందవుల్ల వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువును కొనసాగించవచ్చునని పేర్కొంది. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రసూతి సెలవులు ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చునని తెలిపింది. అది కూడా మొదటి లేదా రెండవ గర్భధారణకు.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని పేర్కొంది. అలాగే సెలవుల వ్యవధిలో ఒక్కొసారి పబ్లిక్ సెలవులు, సాధారణ సెలవులను ఉంటాయని, ఐతే ఆ సెలవులతో దానితో కలపమని తెలిపింది. అంతేగాదు అబార్షన్, ట్యూబెక్టమీ తదితర సందర్భాల్లో సుమారు 14 రోజుల సెలవు మంజూరు చేయబడుతుందని పేర్కొంది. పైగా ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడకుండా...ఒక సెమిస్టర్లో ప్రసూతి సెలవులు తీసుకుంటున్నవారు ఆ సెమిస్టర్లో పరీక్షల కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే తదుపరి సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థుల తోపాటు దానిని సప్లిమెంటరీగా రాయవచ్చు. అందువల్ల వారు సెమిస్టర్ కోల్పోరు. ఎందుకంటే వారి ప్రసూతి సెలవు ముగిసిన తర్వాత తమ బ్యాచ్వారి తోపాటు తర్వాత సెమిస్టర్లను కొనసాగించవచ్చు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రసూతి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్, ల్యాబ్, వైవా పరీక్షలు ఉన్నట్లయితే సంస్థ లేదా విభాగాధిపతి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిండికేట్ కమిటీ నిర్ణయించింది. ఈ సెలవులు పొందేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తుతోపాటు మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని పేర్కొంది. (చదవండి: అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు) -
పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య ప్రవే శాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖా స్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్)– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. యూనివర్సిటీ పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ప్రకటి స్తుంది. దరఖాస్తులను https://tspgmed. tsche.in దరఖాస్తు ఫారం నింపే సమయంలో సాంకేతిక సమస్యలకు 93926 85856, 78425 42216, 90596 72216 నంబర్లకు, నిబంధనల కోసం 94905 85796, 85006 46769 నంబర్లకు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం www. knruhs.telangana.gov.inను సంప్రదించాలని తెలిపింది. -
డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త..!
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందువరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలోని 100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ సైన్సెస్, గణితం & కంప్యూటింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారత దేశంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా అవసరం లేదు. రేపటి ప్రపంచ నాయకులుగా మారే అవకాశం ఉన్న భారత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం కోసం స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు గ్రాంట్ అందనుండగా, 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే పరీక్షలో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ అందించనున్నారు. మొదట 80 శాతం ఫండ్స్ ను కోర్సు ప్రారంభంలో అందిస్తే, మిగతా 20 శాతం మొత్తాన్ని విద్యార్థులు భవిష్యత్ అకాడమిక్ అవసరాల కోసం అందించనున్నారు. 2021లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కంప్యూటర్ సైన్సెస్ కోర్సులో మొదటి సంవత్సరం చదువుతున్న 76 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ఇచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్స్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో ఉన్న టాప్ సైన్స్ & ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అన్ని రకాల సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుంచి దరఖాస్తు దారులను ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ లింకు మీద క్లిక్ చేయండి. (చదవండి: ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..!) -
University of Hyderabad: పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ..యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంటున్న విశ్వవిద్యాలయం. అనేక విభాగాల్లో విద్య, పరిశోధనలు కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా.. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. హెచ్‌సీయూ అందిస్తున్న కోర్సుల వివరాలు.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ, హెల్త్ సైకాలజీ స్పెషలైజేషన్స్‌తో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ అందుబాటులో ఉంది. అలాగే ఆరేళ్ల వ్యవధితో మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రి కోర్సును సైతం ఈ యూనివర్సిటీ అందిస్తోంది. అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు అన్ని గ్రూపుల విద్యార్థులు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్: హిందీ, తెలుగు, లాంగ్వేజ్ సైన్సెస్, ఉర్దూ. సోషల్ సైన్సెస్: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు అందుబాటులో ఉంది. అర్హత: ఏదైనా గ్రూపులో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. పరీక్ష విధానం ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–మ్యాథ్స్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఎమ్మెస్సీ హెల్త్ సైకాలజీ కోర్సు ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్ స్థాయి సైకాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉండే ప్రశ్నపత్రంలో అభ్యర్థి ఎంచుకున్న లాంగ్వేజ్‌పై 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 35 ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్‌పై 25 ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సోషల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పీజీ స్థాయి కోర్సులు మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎమ్మెస్సీ) మ్యాథ్స్/అప్లయిడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలను ఆర్సీబీ ఫరీదాబాద్ నిర్వహించే గాట్–బి ద్వారా ఖరారు చేస్తారు. ఎంసీఏ: నిమ్‌సెట్–2021 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ: హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్,ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. క్యాట్ ర్యాంకు ఆధారంగా ఎంబీఏలో ప్రవేశాలను ఖరారు చేస్తారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎంఏ) ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, కమ్యూనికేషన్(మీడియా ప్రాక్టీస్) తదితరాలు. ఎంఈడీ, ఎంపీఏ(డ్యాన్స్), ఎంపీఏ(థియేటర్ ఆర్ట్స్), ఎంపీఏ మ్యూజిక్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ అండ్ స్కల్పచర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్). ఎంపిక విధానం: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్) కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బయోఇన్ఫర్మాటిక్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి గేట్ స్కోర్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్:ఎంటెక్ కంప్యూటర్ సైన్స్‌లో జేఈఈ సీఎస్ఏబీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్డీ అప్లయిడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్ స్టడీస్, కంపారిటివ్ లిటరేచర్, సంస్కృతం, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, ఫోక్ కల్చర్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ సైన్సెస్, ఫిజియాలజీ, మెటీరియల్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్డీ: బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20,2021 వెబ్సైట్: https://uohyd.ac.in -
పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అవుతారా?
న్యూఢిల్లీ: మెడిసిన్ పోస్టు గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలని మెడికల్ యూనివర్సిటీలను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పరీక్షలకు హాజరు కావాల్సిన వైద్య విద్యార్థులు కోవిడ్–19 విధుల్లో నిమగ్నమై ఉన్నందున పరీక్షలను రద్దు చేయడమో లేదా వాయిదా వేయడమో చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ విషయంలో మెడికల్ యూనివర్సిటీలకు ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. పరీక్షలు రాయకుండానే వైద్యులు ప్రమోట్ అయ్యేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. పీజీ ఆఖరి ఏడాది పరీక్షల తేదీలను ప్రకటించేటప్పుడు కరోనా పరిస్థితిని సైతం పరిగణనలోకి తీసుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఏప్రిల్‌లోనే అన్ని వర్సిటీలకు ఆదేశాలిచ్చిందని తెలిపింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగినంత సమయం ఇచ్చేలా ఎన్ఎంసీని ఆదేశించాలంటూ న్యాయవాది సంజయ్ హెగ్డే వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. చదవండి: కర్ణాటకలో లాక్డౌన్ సడలింపు.. ఎప్పటివరకంటే! -
‘‘పీజీ పూర్తి చేశాను.. కూలి పని చేయడానికి సిద్ధం’’
ఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఉపాధి కోల్పోయి ఎందరో రోడ్డున పడ్డారు. విద్యా సంస్థలు మూత పడ్డాయి. చదువులు ఆగిపోయాయి. పూర్తయిన వారికి ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో పీజీ పూర్తి చేసి.. రోజు కూలీగా మారిన ఓ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. వికాశ్ అనే వ్యక్తి ఢిల్లీలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన సదరు యువకుడు లాక్డౌన్ వల్ల ఉపాధి లేక రోజు కూలీగా మారినట్లు వెల్లడించాడు. తనకు ఏదైనా ఉద్యోగం చూడాల్సిందిగా అభ్యర్థించాడు. ‘‘దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. లాక్డౌన్లో రోజులు వెల్లదీయడం చాలా కష్టంగా మారింది. కొద్ది రోజులు డ్రైవర్‌గా చేశాను. కూలీ పని చేయడానికి కూడా నేను సిద్ధమే. కానీ ఆ పని కూడా దొరకడం లేదు. దయచేసి నాకు సాయం చేయండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా అభ్యర్థించాడు. తన రెజ్యూమ్ కూడా షేర్ చేశాడు. Please help me to get any work. It's so hard to survive due to lockdown. Since lockdown, I have not been able to even get any labour work in the unorganised sector. Merely sustenance seems too hard in this time. I'm ready to work as daily wage labour also. Please amplify 🙏 pic.twitter.com/ptk280LS5D — Vikash (@VikashSanchi) May 30, 2021 ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. వందల మంది వికాశ్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నీ బాధ అర్థం అవుతుంది.. త్వరలోనే నీకు మంచి ఉద్యోగం దొరకాలని ఆశీస్తున్నాను.. నిజంగా ఇది హృదయవిదారకం.. నాకు తెలిసిన కొందరి కాంటాక్ట్ నంబర్లు ఇక్కడ షేర్ చేస్తున్నాను. త్వరలోనే నీకు మంచి ఉద్యోగం దొరకాలని ఆశీస్తున్నాను. నీవు ఒంటరిగా లేవు.. నీకు మా అందరి మద్దతు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నాను నెటిజనులు. చదవండి: కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి. ఇందుకోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద మెడిసిన్)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్ నోటిఫికేషన్‌పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వైద్యజయంత్ దేవ్‌పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్‌తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు. అది తిరోగమన చర్య: ఐఎంఏ సీసీఐఎం అనుమతిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు
జైపూర్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ ఏడాది అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న కాలేజీల్లో జరగవల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం ప్రభుత్వం ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలతోపాటు టెక్నికల్ ఇన్స్టిట్యూట్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు. (ఏడాది పాటు మాస్క్‌లు తప్పవు) ఇక విద్యార్థులందరూ పరీక్షలు లేకుండా వచ్చే సంవత్సరానికి ప్రమోట్ అవుతారని అన్నారు. విద్యార్థుల మార్కులకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరి కొద్ది రోజుల్లో జారీ చేయాల్సిన మార్గదర్శకాలను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల రాజస్థాన్ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ పరీక్షలను జూలై 15 నుంచి ఆగస్టు 18 వరకు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. (వెంటిలేటర్ల ఎగుమతికి సిద్ధం : డీఆర్డీఓ) -
పీజీ వైద్య ఫీజులపై కసరత్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు దాదాపు పూర్తయింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు కలిసి ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపి ఫీజులు ఎంతమేరకు నిర్ణయించాలి అన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ కోటాలో ఇచ్చే 50 శాతం సీట్లకు, యాజమాన్య, ఇన్స్టిట్యూషనల్, ఎన్ఆర్ఐకి ఉన్న 50 శాతం సీట్లకు ఎంత నిర్ణయించాలి అన్నదానిపై చర్చించారు. అలాగే.. వివిధ రాష్ట్రాల్లో ఫీజులు ఎలా ఉన్నాయి.. మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎన్ఆర్ఐ, యాజమాన్య కోటా సీట్లకు ఇక్కడే ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న విషయం అధికారులు గమనించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు, తమకు ప్రభుత్వ కోటాలో ఇస్తున్న సీట్లకు ఫీజులు పెంచాలని లేఖలు రాశాయి. దీంతో వీలైనంత త్వరలో ఫీజులు నిర్ణయిస్తామని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫీజులపై అధికారులిచ్చిన నివేదికలో ఇలా.. ► ఏపీలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 50 శాతం (స్పెషాలిటీల వారీగా) ప్రభుత్వ కోటా కింద భర్తీచేస్తున్నారు. ► మిగతా 50 శాతం సీట్లలో 25 శాతం నీట్ మెరిట్‌లోనూ, మిగతా 10 శాతం సీట్లు ఇన్స్టిట్యూషన్ కోటా కింద (కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు), 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటా కింద ఉన్నాయి. ► ఉత్తరప్రదేశ్‌లో కాలేజీ గ్రేడింగ్‌ను బట్టి ఫీజులు వసూలుచేస్తున్నారు. ► ఏపీతో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో ఫీజులు తక్కువగా ఉన్నట్లు తేలింది. ► డీమ్డ్ వైద్య కళాశాలల్లోనూ ఫీజులు పరిశీలించారు. ► చాలా రాష్ట్రాల్లో జనరల్ మెడిసిన్ సీటుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ కోటా కింద సీట్లు లేవు. ► దీంతో సీట్ల కేటాయింపులు, ఫీజుల నిర్ణయంలో మార్పులు జరగాల్సి ఉందని అధికారులు తేల్చారు. -
మెడికో ఆత్మహత్య
ఇండోర్: నగరంలోని ఇండెక్స్ ప్రైవేటు మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్న మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో మత్తుమందును తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు భోపాల్‌కు చెందిన స్మృతి లాహర్పూరె(32)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ అందులోని విషయాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సోమవారం వేకువజామున ఒకటిన్నర గంటలకు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ హకం సింగ్ పవార్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధారాల కోసం చనిపోయిన స్మృతి లాహర్పూరె స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. -
మేయర్ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి
-
‘నాకు నీతులు చెప్పకు’
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్, కమిషనర్ మధ్య జరిగిన మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఇద్దరూ మహిళలు కావడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ మమతా పాండే, కమిషనర్ ప్రతిభా పాల్ పాల్గొన్నారు. ఈ సమయంలో మేయర్ మమతా పాండే ఇతరులతో మాట్లాడుతున్నారు. దీనిపై ఆగ్రహించిన కమిషనర్ ప్రతిభా పాల్.. ‘మేయర్ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి’ అంటూ చురకలు అంటించారు. కమిషనర్ తనను మందలించడంతో కోపం తెచ్చుకున్న మేయర్ మమతా పండే.. అంతే ఘాటుగా బదులిచ్చారు. నేను పోస్ట్ గ్యాడ్యుయేట్‌ని, ఎల్ఎల్బీ చదువుకున్నా.. నాకు నువ్వు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మమతా పాండే స్పష్టం చేశారు. అంతేకాక.. నీ హద్దుల్లో నువ్వు ఉండు.. అంటూ కమిషనర్ ప్రతిభకు చెప్పారు. వారిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
50 శాతం చాలు
గురుకుల’ నియామకాల అర్హతలను సవరించిన సర్కారు సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ నియామకాల నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరిం చింది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులు ఉంటే చాలని స్పష్టం చేసింది. పీజీటీ అభ్యర్థులకు మూడేళ్ల బోధన అనుభవం లేకున్నా అవకాశమివ్వాలని నిర్ణ యించింది. మొత్తంగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ట్రెయినీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టు లకు డిగ్రీలో 60 శాతం మార్కులు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులతోపాటు మూడేళ్ల బోధన అనుభవం ఉండాలంటూ సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. దీనిపై ఉపాధ్యాయ అభ్యర్థులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులుంటే చాలన్న ఎన్సీటీఈ నిబంధనలను ఉటంకిస్తూ ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. ఎక్కువమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు వెంటనే కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనలను, గతంలో అనుసరించిన విధా నాలు, న్యాయస్థానాల తీర్పులను పాటించా లని సూచించారు. గురుకుల విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన జరగడంతో పాటు నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడమే లక్ష్యంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేశారు. ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిం చాలని, 60 శాతం మార్కులుండాలనే నిబం ధన తొలగించాలని ఆదేశించారు. మూడేళ్ల బోధన అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించాలని సూచించారు. డిగ్రీ, బీఎడ్, టెట్ అర్హత ఉన్న వారందరికీ ఎలాంటి బోధన అనుభవం లేకపోయినా అవకాశం ఇవ్వాలన్నారు. ఇక తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తినీ సీఎం పరిగణన లోకి తీసుకున్నారు. ఇందుకోసం ఎన్సీటీఈ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులను పరిశీలించారు. అయితే ఏ మీడియం విద్యార్థులకు, ఏ మీడియంలో బోధించేందుకు నియామకాలు జరుగు తున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహిం చాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో గురుకుల నియామకాలకు తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున.. అభ్యర్థులు ఇంగిష్ మీడియం లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వీటికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. -
డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పొడిగింపు
విద్యారణ్యపురి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపె¯ŒS యూనివర్సిటీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ అడ్మిషన్లకు రూ. 200 అపరాధ రుసుముతో అక్టోబర్ 6 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకట నలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారికి ప్రవేశ పరీక్ష లేకుండానే పీజీ కోర్సుల్లో అడ్మిష న్లు కల్పిస్తామన్నారు. ఎమ్మెస్సీ సై¯Œ్స విభాగాల్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంట్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. బీ ఎస్సీ, బీటెక్, బీ ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు ఎం ఏలో ఏదైనా కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. బీఆర్ఏఓయూ ఆ¯ŒSలై¯ŒS.ఇ¯ŒS పీజీ ఫస్టియర్ వెబ్సైట్లో రిజిసే్ట్రష¯ŒS దరఖాస్తులను డౌన్Sలోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కు 0870–2511862లో, హన్మకొండయూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సై¯Œ్స కాలేజీలోని ఓపె¯ŒSవర్సిటీ రీజినల్ సెంటర్లో సంప్రదించవచ్చన్నారు. ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్లో... ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్లో ప్రవేశాలకు రూ. 200 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ రాజీవ్, ఓపె¯ŒS స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ శంకర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తర గతిలో అడ్మిషన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ఫీజు రూ. 700 ఉండగా.. రూ 100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఓసీ అభ్యర్థులకు రూ. 800 అడ్మిష¯ŒS ఫీజు ఉండగా.. రూ.100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని వివరించారు. ఇంటర్లో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ లకు అడ్మిష¯ŒS ఫీజు రూ.1000, అపరాధ రుసు ము రూ. 200, ఓసీ అభ్యర్థులకు రూ. 1300, అపరాధ రుసుము రూ. 200 చెల్లించిప్రవేశాలు పొందాలని సూచించారు. ఏపీ ఆ¯ŒSలై¯ŒS, టీఎస్ ఆ¯ŒSలై¯ŒS, మీ సేవ ద్వా రా అడ్మిషన్లు పొందవచ్చని వారు చెప్పారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత స్టడీ సెంటర్లను సంప్రదించి అడ్మిషన్లు పొందాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు ఈనెల 17 నుంచి జరగాల్సిండగా కృష్ణా పుష్కరాల నేపథ్యంలో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం సోమవారం వెల్లడించారు. ఇదిలా ఉండగా పరీక్షలు వాయిదా వేయటంపై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే పరీక్షల కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసిన అధికారులు ఇటీవలే టైంటేబుల్ ప్రకటించారు. తీరా పరీక్షల సమయం సమీపించాక పుష్కరాలపేరుతో వాయిదా వేయటం సరికాదని అంటున్నారు. కృష్ణా పుష్కరాల తేదీలను ప్రభుత్వం ముందే ప్రకటించినా పరీక్షల నిర్వాహకులు ఎగ్జామ్స్ టైంటేబుల్ ఎలా ప్రకటిస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాలను సాకుగా చూపిస్తున్నప్పటికీ అబ్జర్వర్లకు డ్యూటీల వేసే విషయంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అబ్జర్వర్ల డ్యూటీల కోసం పార్ట్‌టైం, కాంట్రాక్టు లెక్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు పోటీ æపడుతున్నారు. అంతర్గతంగా అనేకరకాలు ఉన్న ఒత్తిళ్ల కారణంగానే పరీక్షల నిర్వహణలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. పరీక్షలు సమీపించాక కూడా హాల్‌టికెట్లు వెబ్సైట్లో పెట్టకపోవటం సమస్యగానే మారినట్లు సమాచారం. -
తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని..
అనంతపురం రూరల్ : ఆర్థికంగా చతికిలబడిపోయినా.. కూలి పనులు చేసుకుంటూ కూతురిని పై చదువులు చదివించిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేస్తూ ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఇప్పటికే పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు తన పెళ్లికి అప్పు చేయాల్సి వస్తుందని భావించిన యువతి తల్లిదండ్రులకు భారం కాకూడదనుకొని తనువు చాలించింది. అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి(24) ఎమ్మెస్సీ బీఈడీ వరకు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. శుక్రవారం ఇంటికి వచ్చిన మగపెళ్లివారు కట్నం ఎంత ఇస్తారని అడగడంతో.. లక్ష్మి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కూతుర్ని చదివించామని, తమ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి శనివారం అమ్మానాన్నలు కూలిపనులకు వెళ్లిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘కంప్యూటర్లు వద్దు..పాలే ముద్దు’
సాఫ్ట్వేర్ రూపొందించిన చేతులు పేడ పిసుకుతున్నాయి కీబోర్డ్‌ను రఫ్ ఆడించిన వేళ్లు తౌడు కలుపుతున్నాయి మౌస్తో కబుర్లు చెప్పిన హస్తాలు గేదెలను నిమురుతున్నాయి నిన్నటిదాకా సూటూ.. బూటు.. సెంటు ఇప్పుడు దాణ.. గోబర్ గ్యాస్.. పాల సేకరణ మొన్నటి దాకా అమెరికాలో ఏసీ గదుల్లో కొలువు ప్రస్తుతం రేకుల షెడ్డులో.. చల్లని పిల్ల గాలులతో సావాసం ఇంతకీ వీరెవరు? సాఫ్ట్వేర్ రంగం వదిలి డెయిరీ రంగంలోకి ఎందుకు వచ్చారు? ద్రోణాదుల(మార్టూరు),న్యూస్‌లైన్: ‘ఎంఏలు చేశాం.. ఎంబీఏలు చేశాం.. బీటెక్..సీఏలు చేశాం.. బీఈడీలు పూర్తి చేశాం. అయినా మా చదువుకు తగ్గ ఉద్యోగం లభించలేదు. గవర్నమెంటు ఉద్యోగాల సంగతి పక్కన పెడితే, కనీసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకలేదు. కన్నవారికి..నమ్ముకున్నవారికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాం’.. ఇలా నేటి రోజుల్లో చాలామంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నత చదువులు చదివి.. ఆ చట్రం నుంచి బయటపడలేకపోతున్నారు. ఫలితంగా విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ.. పరనిందలతో కాలం గడుపుతున్నారు. ఇలాంటివారు ద్రోణాదులకు చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కథ చదవాల్సిందే.. చదివిన చదువుకు చేస్తున్న పనికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఉపాధి ఎలా కల్పించుకోవచ్చో తెలుసుకోవాల్సిందే.. ... ... ... పెంట్యాల రామారావు ఎంసీఏ పూర్తి చేసి.. 1997లో అమెరికా పయనమయ్యారు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి.. సైబర్సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ప్రారంభించారు. 2008 వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు ప్రారంభించారు. అవసరమైనప్పుడు అమెరికా వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం నిత్యం ఆయనకు గుర్తుకొస్తుండేది. ‘నేను ఎక్కడ పుట్టాను.. ఏం చేస్తున్నాను’ అన్న ఆలోచన వచ్చిన వెంటనే తన స్వగ్రామానికి ఏదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో దానికి సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తమ్ముడు పెంట్యాల ఉమామహ్వేరరావుని పిలిపించారు. తన ఆలోచన చెప్పారు. ఇద్దరూ కలిసి డెయిరీ ఫాం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి వారి తండ్రి మదన్మోహనరావు కూడా అంగీకరించడంతో మూడు నెలల క్రితం ఆ ఏర్పాట్లు ప్రారంభించారు. నిర్మాణం ఇలా.. ఫాం కోసం 4 ఎకరాలు సేకరించారు. రూ. 60 లక్షలతో షెడ్డు నిర్మించారు. హర్యానా, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి 250 గేదలను గ్రామానికి తరలించారు. ఒక్కో గేదకు రూ. 70 వేలు ఖర్చు చేశారు. వాటిలో నలభై పాడి గేదలు కాగా.. మిగిలినవి సూడు గేదెలు. పూటకు 160 లీటర్లు సేకరిస్తూ గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. సాంకేతిక పద్ధతులు పెద్ద సంఖ్యలో ఉన్న పశువులను సంరక్షించేందుకు ఎక్కువమంది కూలీలు కావాలి. పైగా బోలెడంత సమయం వృథా అవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు *12 లక్షలతో మేత మిక్చర్‌ను కొనుగోలు చేశారు. ఈ యంత్రమే మేతను సిద్ధం చేస్తుంది. రకరకాల దాణాలను కూడా తయారు చేస్తుంది. అలాగే పాలు పిండే యంత్రాన్నీ కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి15 మంది కూలీలు డెయిరీ ఫాంలో పనిచేస్తున్నారు. గేదెలన్నీ పాడి దశకు చేరుకుంటే మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది. విద్యుత్ ఉత్పత్తి కూడా.. గేదెల నుంచి వస్తున్న పేడను కూడా ఈ సోదరులు వృథా కానివ్వడంలేదు. గోబర్ గ్యాస్ ప్లాంట్ నిర్మించి.. దాని ద్వారా ఫాంకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. స్వచ్ఛమైన పాలు అందించటమే లక్ష్యం : రామారావు గ్రామీణులకు స్వచ్ఛమైన పాలు అందించడమే మా లక్ష్యం. సాఫ్ట్వేర్ రంగంలో దొరకని తృప్తి ఇక్కడ లభిస్తోంది. 1000 గేదలతో ఫాం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇండస్‌ఫ్రెష్ అనే పేరుతో పాలను ప్యాకింగ్ చేసి ఎలాంటి రసాయనాలు కలపని, నిల్వలేని పాలను త్వరలో అందిస్తాం. వ్యవసాయ రంగమే ఇష్టం : ఉమామహేశ్వరరావు మాది వ్యవసాయాధారిత కుటుంబం. సొంత గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేయడం తప్పు ఎలా అవుతుంది? కొడుకుల నిర్ణయం భేష్ : మదనమోహనరావు నేలతల్లిని నమ్ముకుని ఇద్దరి కొడుకుల్ని కష్టపడి చదివించా. వారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత సొంత పొలంలో డెయిరీ ఫాం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. చదువంటే పక్కనున్న వాళ్లకీ బువ్వ పెట్టగలగాలి. -
ప్రవేశాలు
బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ డిప్లొమా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) దూర విద్యా కేంద్రం బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులను కోరుతోంది. కోర్సు వివరాలు.. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: సైన్స్/ఇంజనీరింగ్/మెడికల్/ఫార్మసీ/ కంప్యూటర్ సైన్స్‌లో 50 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. ఎంపిక: అకడెమిక్ మెరిట్ ఆధారంగా.. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. చివరి తేది: సెప్టెంబర్ 22 వెబ్సైట్: www.oucde.ac.in, www.osmania.ac.in ఐఆర్‌టీలో డిప్లొమా కోర్సులు న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్పోర్ట్(ఐఆర్టీ) దూరవిద్యా కేంద్రం ద్వారా.. డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు.. డిప్లొమా ఇన్ ట్రాన్స్పోర్ట్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ రైల్ ట్రాన్స్పోర్ట్ అండ్ మేనేజ్మెంట్ కాలపరిమితి: ఏడాది డిప్లొమా ఇన్ పోర్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: డిప్లొమా/బీఎస్సీతోపాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.irt-india.com