
ప్రతీకాత్మక చిత్రం
ఇండోర్: నగరంలోని ఇండెక్స్ ప్రైవేటు మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్న మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో మత్తుమందును తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు భోపాల్‌కు చెందిన స్మృతి లాహర్‌పూరె(32)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కానీ అందులోని విషయాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సోమవారం వేకువజామున ఒకటిన్నర గంటలకు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ హకం సింగ్ పవార్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధారాల కోసం చనిపోయిన స్మృతి లాహర్‌పూరె స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు.