సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్, కమిషనర్ మధ్య జరిగిన మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఇద్దరూ మహిళలు కావడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ మమతా పాండే, కమిషనర్ ప్రతిభా పాల్ పాల్గొన్నారు. ఈ సమయంలో మేయర్ మమతా పాండే ఇతరులతో మాట్లాడుతున్నారు. దీనిపై ఆగ్రహించిన కమిషనర్ ప్రతిభా పాల్.. ‘మేయర్ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి’ అంటూ చురకలు అంటించారు.
కమిషనర్ తనను మందలించడంతో కోపం తెచ్చుకున్న మేయర్ మమతా పండే.. అంతే ఘాటుగా బదులిచ్చారు. నేను పోస్ట్ గ్యాడ్యుయేట్‌ని, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నా.. నాకు నువ్వు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మమతా పాండే స్పష్టం చేశారు. అంతేకాక.. నీ హద్దుల్లో నువ్వు ఉండు.. అంటూ కమిషనర్ ప్రతిభకు చెప్పారు. వారిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment