
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెళకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్
తెలంగాణ ప్రభుత్వ రాజీవ్ యువ వికాస పథకానికి ఏప్రిల్ 14 ఆఖరు : తెలంగాణ యువతను ఆంట్రప్రెన్యూర్‌షిప్ వైపు నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించింది. దీనికింద రూ. నాలుగు లక్షల వరకు రుణసహాయాన్ని అందిస్తోంది. రాయితీ సౌకర్యమూ ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 14.. ఆఖరు తేదీ. ఆ గడువులోపే అప్లై చేసుకోవాలి.
ప్రధాన మంత్రి మత్స్యకార అభివృద్ధి పథకం కింద పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) స్కీమ్. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కింద రైతులు పాడి, పశువులు, చేపల పెంపకం వంటివి ప్రారంభించడానికి కేసీసీతో దరఖాస్తు చేసుకొని రుణాన్ని పొందవచ్చు. కొన్ని రాష్ట్రాలు మత్స్య సంపద అభివృద్ధి కోసం వడ్డీలేని ప్రత్యేక రుణాలు, గ్రాంట్లు, బీమా పథకాలు వంటివీ అందిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా చేపల పెంపకం యూనిట్లకు రుణాలు మంజూరు చేస్తున్నాయి.
చదవండి : మొన్ననే ఎంగేజ్‌మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
చేపలు, రొయ్యల పెంపకంలో అధిక దిగుబడి, లాభాల కోసం ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను పొందడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని పెంపొందిచుకోవడం ముఖ్యం. పరిశుభ్ర వాతావరణంలో చేపల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఈ శాఖ చేపల మార్కెట్‌ల నిర్మాణాలనూ చేపడుతోంది.
చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
ఇప్పటివరకు రూ.760.89 లక్షల ఆర్థిక వ్యయంతో 84 చేపల మార్కెట్లను మంజూరు చేసింది. అలాగే మత్స్యకారుల సహకార, పొదుపు సంఘాలనూ ఏర్పాటు చేసింది. మత్స్యకారులు, చేపల పెంపకందారుల (ఫిష్ ఫార్మర్స్) మూలపెట్టుబడి అవసరాలకు (విత్తనాలు, దాణా, సేంద్రియ ఎరువులు, చార్జీలు, ఇంధనం, విద్యుత్ చార్జీలు, బీమా, శ్రమ, లీజు, అద్దె, నిర్వహణ ఖర్చులు మొదలైనవి) సరళీకృత విధానంలో ఒకే విండో కింద సకాలంలో తగినంత రుణ సహాయాన్ని అందించడం కిసాన్ క్రెడిట్ పథకం ముఖ్య లక్ష్యం. అంతేకాక కొన్ని ప్రత్యేక స్కీమ్‌ల కింద పడవలు, వినియోగ వస్తువులు, వలలు, గాలాలు వంటి వాటికీ సబ్సిడీ అందుతోంది.
-బి.ఎన్. రత్న బిజినెస్ కన్సల్టెంట్, దలీప్
మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.com
నిర్వహణ : సరస్వతి రమ