kisan credit cards
-
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
AP: కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల్లో ఏపీ ఐదో స్థానం
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసీసీ) ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటం, మద్దతు ధర కల్పిస్తుండటంతో రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. దీంతో కేసీసీ ద్వారా స్వల్పకాలిక రుణాలు తీసుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ఈ రుణాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని నాబార్డు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నివేదికలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నట్లు నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 45.52 లక్షల రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు. ఈ రైతుల్లో చాలా మందికి కేసీపీ కవరేజ్ అయిందని ఎస్ఎల్బీసీ నివేదిక పేర్కొంది. పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య కార్యకలాపాల రైతులకు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కోసం కేసీసీలను సంతృప్త స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎస్ఎల్బీసీ పేర్కొంది. ఈ రైతులకు కేసీసీల మంజూరుకు మార్చి నెలాఖరు వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ శిబిరాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అక్కడికక్కడే పరిశీలిస్తారని తెలిపింది. అర్హులైన వారికి కేసీసీ జారీ చేస్తారంది. ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు పశు సంవర్ధక, డైరీ కార్యకలాపాలకు కేసీసీ కోసం 82,366 ధరఖాస్తులు రాగా 68,948 దరఖాస్తులకు కేసీసీ మంజూరు చేశారు. మత్స్య కార్యకలాపాల కోసం 36,076 దరఖాస్తులు రాగా 22,856 మందికి కేసీసీ మంజూరు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పశుసంవర్ధక రంగంలో 95,445 ఖాతాలకు రూ.1079.26 కోట్లు, మత్స్య రంగంలో 5,112 ఖాతాలకు రూ.285.95 కోట్లు మంజూరు చేశారు. అయితే సంతృప్త స్థాయిలో కేసీసీల మంజూరుకు బ్యాంకులు మరింతగా దృష్టి సారించాలని ఎస్ఎల్బీసీ సూచించింది. -
కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణాల పేరిట భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: కిసాన్ క్రెడిట్ కార్డ్(కేసీసీ)లపై చేపల చెరువుల నిర్మాణానికి రుణాలు ఇచ్చినట్టు లెక్కల్లో చూపి కోట్ల రూపాయలు దారిమళ్లించిన కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. సీబీఐ విశాఖపట్నం బ్రాంచ్ ఏసీబీ విభాగం నమోదు చేసిన ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 29న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ సోదాలు ఏ ప్రాంతాల్లో చేశారన్న విషయాలు ఈడీ అధికారులు వెల్లడించలేదు. రాజమండ్రిలోని ఐడీబీఐ బ్యాంక్‌లో కిసాన్ క్రెడిట్కార్డులపై రుణాల పేరిట మొత్తం రూ. 311.05 కోట్లు దారిమళ్లించినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. నిందితులు వారి సంస్థలో పనిచేసే ఉద్యోగులు పలువురి నుంచి కేవైసీ డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కులు, మరికొందరు రైతుల నుంచి వారికి సంబంధించినపత్రాలను సేకరించి వారి పేరిట రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును తర్వాత నిందితులు తమ కంపెనీల్లో పెట్టుబడులకు, కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తుల కొనుగోలుకు వాడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కొన్ని కీలకపత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. -
రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట
చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని కేంద్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాలా అన్నారు. తొమ్మిదేళ్ల మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014లో దేశంలో అవినీతి రాజ్యమేలిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేకుండా చేశారని అన్నారు. రైతులకు ఏటా రూ.18 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. మత్స్యశాఖ వారి కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం అనేక నిధులు మంజూరు చేసిందని, ఇక్కడ మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నేటికీ ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ఆలయానికి ప్రత్యేకత ఉందని, కాళేశ్వరం పేరుతో ప్రజలకు అన్యాయం చేయడాన్ని దేవుడు క్షమించడని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పా లన సాగుతోందని విమర్శించారు. గోదావరి పరిరక్షణ కోసం చెన్నూర్ గోదావరి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం మండలంలోని గంగారం, అస్నాద్ గ్రామాలకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులతోపాటు పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరబెల్లి రఘునాథ్‌రావు, బెల్లంపల్లి ఇన్చార్జి ఏమాజీ, ప్రభాకర్, జిల్లా నాయకులు వెంకటేశ్వర్‌గౌడ్, సుశీల్‌కుమార్, చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. గడప గడపకు బీజేపీ ప్రచారం ప్రారంభం తాండూర్: మండల కేంద్రంలో గురువారం గడపగడపకు బీజేపీ ప్రచారాన్ని కేంద్రమంత్రి పరుషోత్తం రూపాల ప్రారంభించారు. విద్యాభారతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్‌సీఐ సభ్యుడు పుల్గం తిరుపతి, నాయకులు కృష్ణదేవరాయలు, శ్రీవాణి, చిరంజీవి, సంతోష్, విష్ణు, ప్రవీణ్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం బెల్లంపల్లిరూరల్: మండలంంలోని కన్నాల శివారులో ఉన్న బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల వి మర్శించారు. గురువారం సాయంత్రం ఆయ న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు గుట్ట ల నడుమ అటవీ ప్రాంతంలో ఆలయం ఎంతో విశాలంగా ఉందని తెలిపారు. అనంతరం ఆయనను బెల్లంపల్లి బీజేపీ నాయకులు శా లువాతో ఘనంగా సన్మానించారు. బీజేపీ జి ల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, జిల్లా అధి కార ప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, నాయకులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా 11కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
-
పాడి రైతులకు పశుకిసాన్ క్రెడిట్ కార్డులు
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా పాడిరైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆక్వారైతులు, మత్స్యకారులకు కేసీసీల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నారు. అదేబాటలో పశుకిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడిరైతులకు పాడిసంరక్షణ, నిర్వహణ కోసం హామీలేకుండా గరిష్టంగా రూ.1.60 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలివ్వాలని సంకల్పించారు. కార్డుల జారీకోసం ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో స్పెషల్ డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 45,652 మందికి పశుకిసాన్ క్రెడిట్ కార్డులు పశుకిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మత్స్యకారులు, ఆక్వారైతుల తరహాలోనే పాడిరైతులు స్థానిక ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కార్డులు జారీచేస్తారు. ఇందుకోసం మే 1వ తేదీ నుంచి ఆర్బీకే స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్‌లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసే పాడిరైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు. ఎంత పాడి ఉంది. ఎంత పాల ఉత్పత్తి చేస్తున్నారు వంటి వివరాలను పశువైద్యాధికారితో ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 45,652 మందికి పశుకిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేశారు. వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడిపశువులు, సన్నజీవాలు కొనుగోలు చేసిన ప్రతి పాడిరైతుకు పశుకిసాన్ క్రెడిక్ కార్డు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. నాలుగేళ్లలో 2.67 లక్షల మంది పాడిరైతులకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద మూగ, సన్నజీవాలను అందించారు. వీరందరికి ఈ కార్డులు జారీచేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నారు. షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం ఈ కార్డు ఆధారంగా ఎలాంటి హామీలేకుండా రూ.1.60 లక్షల వరకు రుణం ఇస్తారు. పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలకు ఈ రుణాలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రుణాలను కొత్త పశువుల కొనుగోలుకు ఉపయోగించకూడదు. కార్డు పొందే పాడిరైతుకు బీమా సదుపాయం కూడా ఉంటుంది. నాలుగేళ్లలో మత్స్యకారులు, ఆక్వారైతులకు 20 వేల కార్డులు జారీచేయగా, రూ.2,800 కోట్ల రుణ పరపతి కలి్పంచారు. ప్రతి సీజన్లో ఆక్వారైతులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంలో మొదటి రూ.రెండు లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తారు. కార్డుల జారీ, రుణపరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ (ఆటోమేషన్)ను కూడా అభివృద్ధి చేశారు. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు కేసీసీల జారీ, రుణాల మంజూరు వివరాలను ఆర్బీకేల్లోని పశుసంవర్ధక సహాయకుల ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. ఈ డ్రైవ్ వచ్చే మార్చి నెలాఖరు వరకు కొనసాగనుంది. చదవండి: చింపేస్తాం.. పీకేస్తాం.. నారా లోకేష్ ఓవర్ యాక్షన్ -
డిజిటల్‌గా కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
న్యూఢిల్లీ: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) జారీని సులభతరం చేసే ప్రక్రియకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. కేసీసీ తీసుకునేందుకు పేపర్ రూపంలో స్థల రికార్డుల పత్రాలను దాఖలు చేయడం, భౌతికంగా బ్యాంకు శాఖను సందర్శించడం వంటి బాదరబందీ లేకుండా డిజిటల్‌గానే ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపాయి. ఇందుకోసం రెండు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్)తో జట్టు కట్టాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో, ఫెడరల్ బ్యాంక్.. చెన్నైలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించాయి. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్ హ్యాండ్సెట్ ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే పొలం వెరిఫికేషన్ కూడా జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడీ ఎ మణిమేఖలై తెలిపారు. -
కేసీసీ హోల్డర్లకు రుణాలివ్వండి
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయాలకు ఊతమిచ్చే దిశగా కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) హోల్డర్లకు రుణాల లభ్యతలో ఇబ్బందులు లేకుండా, సజావుగా ఉండేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు కూడా అందించాలని పేర్కొన్నారు. గురువారం పీఎస్‌బీల సీఈవోలతో భేటీలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేసీసీ స్కీమును సమీక్షించడంతో పాటు మత్స్య, పాడి పరిశ్రమకు సంస్థాగత రుణాల లభ్యత తదితర అంశాలపై చర్చించినట్లు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా తెలిపారు. మరోవైపు, డిజిటలీకరణలో ఆర్ఆర్బీలకు స్పాన్సర్ బ్యాంక్ తగు సహకారం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాడ్ వివరించారు. -
రైతు కిసాన్ క్రెడిట్ ఖాతాలోకి రూ.60 కోట్లు! 3 నెలలుగా విత్ డ్రా తతంగం
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు కిసాన్ క్రెడిట్ ఖాతాలోకి ఏకంగా రూ. 60 కోట్ల డబ్బులు జమయ్యాయి. మరో ఇద్దరి ఖాతాల్లో రూ. లక్షల్లో డబ్బు వచ్చి చేరింది. ఈ మొత్తం సొమ్ములోంచి ఓ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు, రైతులు దాదాపు రూ. 1.28 కోట్లు విత్‌డ్రా చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు విత్‌డ్రా చేసిన డబ్బులను రివకరీ చేయడం.. దీంతో రైతులు, సంఘాలు శనివారం ఆందోళన చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతిక సమస్య వల్ల.. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న సల్పలగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ కోలాం రైతులైన కొడప భీంరావు, రమాబాయి, గంగాదేవిలకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆదిలాబాద్ బ్రాంచ్‌లో కిసాన్ క్రెడిట్ ఖాతాలున్నాయి. ఇందులో భీంరావు ఖాతాలో రూ. 60 కోట్లు, మరో ఇద్దరి ఖాతాల్లో రూ. లక్షల్లో డబ్బులు జమయ్యాయి. వీళ్లు ఓసారి డబ్బులు తీసుకునేందుకని పక్కనే ఉన్న మామిడిగూడ గ్రామంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)కు వెళ్లగా చాలా డబ్బులు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ 3 ఖాతాల నుంచి కలిపి ఏకంగా రూ.కోటీ 28 లక్షలను సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు రమేశ్ విత్ డ్రా చేశాడు. భీంరావుకు రూ.5.20 లక్షలు, గంగాదేవికి రూ.1.50 లక్షలు, రమాబాయికి రూ.9.50 లక్షలు ఇచ్చి మిగతా సొమ్మంతా తన దగ్గర పెట్టుకున్నాడు. 3 నెలల నుంచి ఈ తతంగం జరుగుతున్నా బ్యాంకు అధికారులు గుర్తించలేదు. తాజాగా గ్రామీణ బ్యాంకు హైదరాబాద్ అధికారులు విషయం తెలుసుకొని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ఖాతాలెవరివి, డబ్బు ఎక్కడి నుంచి డ్రా అవుతోందని గుర్తించారు. సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు, రైతుల గ్రామాలకు వెళ్లి నిర్వాహకుడి నుంచి రూ.80 లక్షలు, రైతుల నుంచి బంగారం తదితర వస్తువులను పట్టుకొచ్చారు. దీంతో రైతులు, ఆదివాసీ కోలాం సంఘం నాయకులు ఆదిలాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మెయిన్ శాఖ ముందు ఆందోళనకు దిగారు. దీనిపై మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వివేక్‌ను వివరణ కోరగా సాంకేతిక సమస్యల వల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రికవరీ చేస్తున్నామని చెప్పారు. -
రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు శుభవార్త తెలిపింది. రైతులకు గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షలు వరకు రుణం అందించనున్నట్లు పేర్కొంది. ఈ రుణం కోసం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు సహాయం చేయడం కోసం ఎస్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తుంది. రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం ఈ కార్డు సహాయంతో రుణం సులభంగా తీసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా వారి అవసరాన్ని బట్టి రుణం అందిస్తుంది. ఈ కార్డు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ తరహాలోనే ఇది ఉంటుంది. ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటును అందిస్తుంది. ఈ కార్డు వ్యవది 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్షకు లోబడి మీ కార్డు పరిమితి 10% పెరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలకు రూ.3 లక్షల వరకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి పంట కాలం(స్వల్ప/దీర్ఘం), పంట మార్కెటింగ్ పీరియడ్ పై ఆధారపడి ఉంటుంది. 45 రోజులకు ఒకసారి కార్డు యాక్టివేట్ చేసినట్లయితే, బ్యాంకు రూపే కార్డుల మాదిరిగా మీకు రూ. 1 లక్ష బీమా లభిస్తుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? రైతులు/వ్యక్తులు/ఉమ్మడి రుణగ్రహీతలు, యజమాని సాగుదారులు, కౌలు రైతులు, నోటి లెస్సీలు, షేర్ క్రాపర్లు అందరూ కూడా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులు, షేర్ క్రాపర్లు మొదలైన వాటితో సహా రైతుల స్వయం సహాయక గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా వర్తిస్తాయి. రూ.3 లక్షల వరకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంటుంది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం(పీఎఐఎస్) కింద కవర్ చేయబడతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎమ్ఎఫ్ బివై) కింద కవర్ అవుతాయి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!) కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎస్బీఐ పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి రైతులు నేరుగా ఎస్బీఐ శాఖను సందర్శించి కేసీసీ దరఖాస్తు ఫారమ్ కోసం అడగవచ్చు. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను నింపి, బ్యాంకులో సమర్పించాలి బ్యాంకు దరఖాస్తును పరిశీలించి, దరఖాస్తుదారుడి వివరాలను ధృవీకరించి, కార్డును కేటాయిస్తుంది. యోనో ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? యోనో ఎస్బీఐ లాగిన్ అవ్వండి యోనో కృషి ఆప్షన్ పై క్లిక్ చేసి ఖాతాపై క్లిక్ చేయండి. మళ్లీ కిసాన్ క్రెడిట్ కార్డుపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, పంట వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి. మీరు గనుక అర్హులు అయితే, కిసాన్ క్రెడిట్ కార్డు మీ ఇంటికి వస్తుంది. కావాల్సిన పత్రాలు ఇంటి చిరునామా, గుర్తింపు రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి. వ్యవసాయ భూమి పత్రాలు దరఖాస్తుదారుడి ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అందించాలి. కార్డ్ జారీ చేసే బ్యాంక్ సెక్యూరిటీ పోస్ట్ డేటెడ్ చెక్‌ను సమర్పించమని కూడా అడగవచ్చు. (చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..!) -
కిసాన్ క్రెడిట్.. రూ.7,362 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద.. కిసాన్ క్రెడిట్ కార్డులపై రాష్ట్రంలో పంట రుణాలు, మత్స్య, పశు సంవర్ధక రంగాలకు కలిపి బ్యాంకులు ఇప్పటివరకు రూ.7,362.38 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. లాక్డౌన్ నేపథ్యంలో మందగించిన ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు, అలాగే రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డులపై పంట రుణాలను మంజూరు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై 2.50 కోట్ల మంది రైతులకు పంట రుణాలను మంజూరు చేయించాలని లక్ష్యంగా నిర్ధారించింది. అలాగే దేశ వ్యాప్తంగా 1.50 కోట్ల మంది డెయిరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. దీంతో గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీ కింద 7,66,827 దరఖాస్తులు అందాయి. ఇందులో అర్హత గల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు పంపించి రుణాలు మంజూరు చేయించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్యాకేజీ కింద వీలైనంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టగా బ్యాంకులు సైతం సానుకూలంగా స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో బ్యాంకులు కూడా ఆయా రంగాలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. -
ప్యాకేజీలో రైతులకు ఒరిగిందేమిటీ?
సాక్షి,హైదరాబాద్: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు ఒరిగిందేమిటో చెప్పాలని రైతుసంఘాల పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యంతో పాటు రైతు వ్యతిరేక చర్యలకు కేంద్రం ఒడిగట్టిందని విమర్శించారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో్ల భాగంగా బుధవారం మఖ్దూంభవన్ ఆవరణలో నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ..వ్యవసాయం, దాని అనుబంధ, మత్స్యరంగాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయించిన రూ.1.63 లక్షల కోట్ల మొత్తాన్నే మళ్లీ ప్యాకేజీలో ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా చెప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. లాక్డౌన్ పొడిగింపు కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేకపోయారని, మద్దతు ధరలు లభించకపోగా 30% తక్కువ ధరలకు రైతులు తమ దిగుబడులను విక్రయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం రుణమాఫీ చేయాలి రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలు మాఫీ చేయాలని, పాత కిసాన్ క్రెడిట్ కార్డులను రద్దుచేసి కొత్త ఖరీఫ్ కేసీపీ కార్డులివ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు మద్దతు ధర వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. పాలు, పండ్లు, కూరగాయలు కూడా ప్రభుత్వమే కొనాలని విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహా రక మందుల ధరలను ఈ సీజన్లో 50% తగ్గించాలని సూచించాయి. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, రుణమాఫీ, పంటబీమా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ నిరసనల్లో సారంపల్లి మల్లారెడ్డి, వేములపల్లి వెంకట్రామయ్య, పశ్యపద్మ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రక్షాళన
-
‘కిసాన్’ కార్డుల వ్యవస్థ ప్రక్షాళన
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో కేసీసీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తూతూమంత్రంగా సాగుతున్న ఈ కార్డుల పంపిణీ తీరును సమీక్షించి నిజమైన సాగుదారులకు ఉపయుక్తంగా ఉండేలా వీటినిచ్చే పనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 3 లక్షల మందికి ఈ కార్డులివ్వాలని భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డులంటే.. బ్యాంకింగ్ రంగ నిపుణులు ఆర్వీ గుప్తా కమిటీ సిఫార్సు మేరకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ఈ విధానాన్ని 1988 ఆగస్టు నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థల వలలో చిక్కి రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం ఈ కార్డుల లక్ష్యం. స్వల్పకాలంలోనే కిసాన్ క్రెడిట్ కార్డులకు బహుళ ప్రచారం వచ్చినా అమలులో మాత్రం పెద్దగా పురోగతి లేదన్నది వ్యవసాయాధికారుల భావన. ఇక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించిన ప్రకారం రైతులకు పంట ఆధారిత రుణ పరిమితి ఉంటుంది. నిజానికి ఆ మొత్తాన్ని రైతు ఖాతాకు జమచేస్తూ కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలి. రైతు తనకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇతరత్రా వ్యవసాయ ఉత్పాదకాల కోసం ఈ కార్డును వినియోగించుకోవాలి. ఇదీ క్రెడిట్ కార్డుల ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉందంటే.. రాష్ట్రంలో బ్యాంకులు పంట రుణాలైతే ఇస్తున్నాయిగానీ కార్డులు ఇవ్వడంలేదు. అలాగే, రైతులూ అడగడంలేదు. పంట కాలానికి ముందు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడమో లేదా రెన్యువల్ చేయించుకోవ డమో జరుగుతుంది. రెన్యువల్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్ తప్ప (ఖాతా సర్దుబాట్లే) మరొకటి కాదు. ఒకవేళ కిందటి ఏడాది కన్నా పంట రుణ పరిమితి పెరిగితే ఆ వ్యత్యాస మొత్తాన్ని రైతుకు ఇస్తున్నారు. ఇలా రుణాలు తీసుకున్న వారందరికీ కార్డులు ఇచ్చినట్లేనని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఇప్పటికి సుమారు 46 లక్షల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులున్నట్లు అంచనా. ఎలా మార్చాలనుకుంటున్నారంటే.. లోపభూయిష్టంగా ఉన్న ఈ పద్ధతిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ తలపెట్టి బ్యాంకర్లకు కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి.. - ఎవరికైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (ఆయా పంటలకు ఇచ్చే రుణ పరిమితి) వర్తిస్తుందో వారందరికీ కార్డులు ఇవ్వాలని బ్యాంకర్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. - డీ–ఫారం పట్టాలున్న వారు, కౌలు రైతులు సహా వాస్తవ సాగుదార్లందరికీ పంట రుణాలు ఇచ్చేలా ఈ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయాలి. - వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసేటప్పుడు నగదు రహిత లావాదేవీలు జరిపేలా చూడాలి. - ఏ ప్రయోజనం కోసమైతే రుణం ఇస్తున్నారో దాని కోసమే ఈ కార్డులను ఉపయోగించాలి. ఇది పక్కాగా అమలుకావాలంటే వాస్తవ సాగుదారులు ఎవరో గుర్తిం చాలి. ఏయే బ్యాంకు ఎంతెంత మందికి పంట రుణాలిచ్చిందో వారి జాబితాను వ్యవసాయ శాఖకు ఇచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ నేపథ్యంలో.. ఈ జాబితాను ఆయా గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయాధికారులతో పరిశీలన చేయించి రైతులను నిర్ధారించి అర్హులెవరో తేలుస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇలా చేయడంవల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సున్నా వడ్డీకి ఎవరు అర్హులో లెక్కతేలుతుంది. అలా గుర్తించిన వారికి కిసాన్ క్రెడిట్ కార్డులిస్తే రీ పేమెంట్స్‌కు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే, వ్యవసాయ ఉత్పాదకాలు ఎక్కడ కొనుగోలు చేశారో కనిపెట్టడంతో పాటు బ్యాంకులిచ్చే రుణాలకూ సార్ధకత ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. -
మాంద్యం వేళ వ్యవ‘సాయం’ చేయండి
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించాలి. ఈ కార్డులను రైతు భరోసా కేంద్రాలకు లింక్ చేసేలా చూడాలి. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఆర్థిక తోడ్పాటు అందుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం వైపు నుంచి కట్టాల్సిన వడ్డీలు కడతాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 5 వేల మందికి క్రెడిట్ కార్డులు ఇచ్చి, రూ.10 వేల చొప్పున రుణాలు అందిస్తే వారి జీవితాలు మెరుగు పడతాయి. వీరిని గ్రామ సచివాలయాలకు లేదా స్వయం సహాయక సంఘాలకు లింక్ చేయొచ్చు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో దాని ప్రభావం మొదట ప్రాథమిక రంగాలపైనే.. అంటే వ్యవసాయంపైనే ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయని, ఇక ముందు కూడా మరింత సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందని చెప్పారు. మరిన్ని కార్యక్రమాలకు నాబార్డు సహకారం అందించాలని కోరారు. గురువారం ఆయన సచివాలయంలో 2020–2021కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల చేశారు. (2020–21లో ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలు ఇవ్వాలనేది నాబార్డు లక్ష్యం. చదవండి: రైతులకు అన్ని విధాలా భరోసా ఇందులో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణాలు) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని, 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అపారమైన అవకాశాలున్నాయని, ఆక్వా, ఫిషరీస్ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు గతంలో ఎక్కడా అమలు చేయలేదని సీఎం పేర్కొన్నారు. రైతు భరోసా కింద 46 లక్షల మంది రైతులను ఆదుకున్నామని, 69 శాతం మంది రైతులకు ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉందని, సగం హెక్టార్ కన్నా తక్కువ ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని, వీరికి ఏటా రూ.13,500 రైతు భరోసా కింద అందిస్తున్నామని చెప్పారు. వారికి 80 శాతం వ్యవసాయ పెట్టుబడులు సమకూరుస్తున్నామని వివరించారు. ఇది వారికెంతో ఊరటనిచ్చే అంశమని, అలాగే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే కడుతోందని, ఆ భారం రైతుల మీద లేకుండా చేశామని చెప్పారు. ఏ రైతు కూడా నష్టపోకుండా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకునేందుకు విపత్తు నిధి పెట్టామన్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు ప్రకటించామని, ఈ ధరల కన్నాతక్కువకు అమ్ముకునే పరిస్థితి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని సీఎం తెలిపారు. చదవండి: ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం రైతు భరోసా కేంద్రాలకు నాబార్డు సహకారం కావాలి ప్రతి 2 వేల జనాభాకు 10 మంది ఉద్యోగులతో ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశామని, వీటి పక్కనే వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలను పెడుతున్నామని, వీటికి నాబార్డు సహకారం అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఆక్వా అసిస్టెంట్లను గ్రామ సచివాలయాల్లో పెట్టామని, వీరు ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్, ఇంటర్నెట్ ఉంటుందని, నాణ్యమైన, ప్రభుత్వం పరీక్షించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్ముతారని సీఎం వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ కంపెనీలు మండలాల వారీగా హబ్‌లను ఏర్పాటు చేస్తాయని, ఆర్డర్ ఇచ్చిన 24 నుంచి 48 గంటల్లోగా రైతులకు కావాల్సినవి అందుతాయని సీఎం పేర్కొన్నారు. సేకరణ కేంద్రాలుగా కూడా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయని, ఏ పంట వేసుకోవాలన్న దానిపై సలహాలు కూడా ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమాలకు నాబార్డు సహకారం కావాలని కోరారు. కోల్డ్ స్టోరేజీల సంఖ్య పెరగాలి నాబార్డు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు సహకారం అందిస్తోందని, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న అగ్రిల్యాబ్స్‌కు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో సరిపడా గోదాములు అందుబాటులో లేవని, కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఉంచడానికి సరైన స్థలం లేదని, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామని, తర్వాత నెమ్మదిగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. పోలవరంపై దృష్టి సారించాలి పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణాలో నీళ్లు రావడం లేదని, మరోవైపు గోదావరిలో నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని చెప్పారు. రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తే.. దానిపై వడ్డీ సుమారుగా రూ.500 కోట్లకుపైగా కడుతున్నామని, సకాలానికి డబ్బులు రావడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఇచ్చిన సుమారు 1,800 కోట్లకుపైగా డబ్బులు నాబార్డు నుంచి పీపీఏకు వెళ్లాయని, అవి ఇంకా రాలేదన్నారు. ఈ సమస్య తీర్చడానికి నాబార్డు పూర్తి స్థాయి సహకారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలంటే శరవేగంగా పనులు పూర్తి చేయాలని, కనీసం ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున ఆర్ అండ్ ఆర్ కింద కావాల్సి వస్తుందన్నారు. సివిల్ పనుల కోసం ఈ ఏడాదే రూ.6 వేల కోట్లు కావాల్సి ఉన్నందున, ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మానస పుత్రికలైన రైతు భరోసా కేంద్రాలకు నాబార్డు సహకారం అందించాలని కోరారు. బలమైన గ్రామ సచివాలయ వ్యవస్థను నాబార్డు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, నాబార్డ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ బెహరా, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. పూర్తి సహకారం అందిస్తాం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. నవరత్నాల కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రైతు భరోసా, వడ్డీలేని రుణాలు ఇతరత్రా కార్యక్రమాలను రైతుల కోసం అమలు చేస్తోంది. ఇవన్నీ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే కార్యక్రమాలే. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధితో రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచింది. ప్రాథమిక రంగం బలోపేతానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. – సెల్వరాజ్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ -
మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
సాక్షి, మచిలీపట్నం: కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులకు మంచిరోజులొచ్చాయి. గంగమ్మ తల్లినే నమ్ముకున్న వారి బతుకులు బాగుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సముద్రంలో వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు వేటనిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాకుండా డీజిల్ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9లకు పెంచింది. తాజాగా మైదాన ప్రాంతాల్లో చెరువుల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకు కిసాన్ క్రిడెట్ కార్డులివ్వాలని నిర్ణయించింది. జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకార సంఘాలు 211, మెరైన్ మత్స్యకార సంఘాలు 43, మహిళా మత్స్య కార సంఘాలు 81 ఉన్నాయి. వీటి పరిధిలో 38,914 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. మత్స్య కారులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో ఉంటూ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టే మత్స్యకారులు తగిన ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు చెరువులు సాగు చేసే మత్స్యకారులైతే దాణా, మందులు కొనుగోలు చేయడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సౌకర్యం గతంలో ఉండేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతకాలం నిలుపుదల చేశారు. కాగా కేంద్రం మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరింపజేసింది. ప్రస్తుతం సొసైటీల పరిధిలో యాక్టివ్‌గా ఉన్న మత్స్యకారులకు ఈ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. చేప రైతుల(వ్యక్తిగతంగా, గ్రూపులు, భాగస్వాములు, కౌలుకు సాగు చేసే వారు)తో పాటు సెల్ఫ్‌హెల్ప్, జాయింట్ లైబలిటీ, మహిళా మత్స్యకార గ్రూపులు ఈ కార్డులు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే వర్కింగ్ కాపిటల్ కాంపొనెంట్‌తో సాగు చేసే మత్స్యకారులకు కూడా ఈ కార్డులు పొందేందుకు అర్హులు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం సీడ్, ఫీడ్, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, హార్వస్టింగ్స్, మార్కెటింగ్ చార్జీలు, ఆయిల్, విద్యుత్ చార్జీలు, ఐస్, ల్యాండింగ్ చార్జీలు లేబర్, లీజ్‌ల కోసం ఈ కార్డుల ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు.ఈ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. చేపల పెంపకం, వేట, విక్రయాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించవచ్చు. అర్హులైన వారిని గుర్తిస్తున్నామని, జనవరి 1వ తేదీ నుంచి వారికి మత్స్యశాఖ తరఫున కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు మత్స్యశాఖ డీడీ రాఘవరెడ్డి తెలిపారు. -
అన్నదాతకు ‘క్రెడిట్’
సాక్షి, హైదరాబాద్ : విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, సాగు ఖర్చులు.. ఇలా పెట్టుబడికి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే అధిక మొత్తానికి అప్పు తెస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. సాధారణంగా ప్రజలు వినియోగించే క్రెడిట్ కార్డు లాంటి వాటిని రైతులకు ఇవ్వాలని భావిస్తోంది. బ్యాంకులతో మాట్లాడి కార్డు ఇప్పించడం ద్వారా అధిక వడ్డీల నుంచి అన్నదాతను ఆదుకోవాలన్న దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ‘కిసాన్ క్రెడిట్ కార్డు’. అనేక రాష్ట్రాల్లో ఈ కార్డులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నా, తెలంగాణలో పెద్దగా ప్రచారంలేదు. అసలేంటి ఈ క్రెడిట్ కార్డు వివరాల్లోకి వెళితే... రుణాలిచ్చేందుకు బ్యాంకుల పేచీ రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తాత్సారం చేస్తున్నాయి. గత నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏడాదికేడాదికి లక్ష్యాలను ఘనంగా పేర్కొంటున్నా, రైతులకు ఇచ్చే సరికి బ్యాంకులు అనాసక్తి చూపిస్తున్నాయి. దీంతో రైతులు పెట్టుబడి సొమ్ము పుట్టక ప్రైవేటు అప్పుల వైపు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 29 వేల కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు అందులో సగం కూడా ఇవ్వలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డులు : 5,00,000 వ్యవసాయ శాఖ లక్ష్యం : 25,00,000 ప్రయోజనాలు ఇవీ.. విత్తనాలు, పురుగుమందులు, ఎరు వులు, సాగు ఖర్చులు వంటి వ్యవసాయ అవసరాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారు. రోజువారీ వ్యవ సాయ సంబంధిత ఖర్చులకూ వినియోగించుకోవచ్చు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతు కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి అర్హుడే. కొన్ని పరిమితుల మేరకు కౌలు రైతులకు ఇస్తారు. భూమి ఉన్న రైతు తన పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకెళ్లి సాధారణ డాక్యుమెంటేషన్ ద్వారా బ్యాంకులో పొందవచ్చు. రైతుకు బీమా కవరేజీ కూడా ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకున్న రైతులకు కేంద్రం రూపే కార్డులు ఇస్తుంది. వాటిని సాధారణ క్రెడిట్ కార్డు మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. కార్డు పొందండి ఇలా... వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు లేదా ఇతర వ్యవసాయేతర కార్యకలాపాల్లో నిమగ్నమైన ఎవరికైనా కిసాన్ క్రెడిట్ కార్డు రుణం ఇస్తారు. రైతు వయస్సు 18 నుంచి 75 ఏళ్ల వరకు ఉండాలి. కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసేటప్పుడు గుర్తింపు కార్డుండాలి. ఓటరు ఐడి, పాన్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవాటిలో ఏదో ఒకటి ఉండాలి. పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి. కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డును రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అందిస్తున్నాయి. -
మరో 7 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా రాజ్యసభకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది రైతులకు ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశామని, మిగతా 7 కోట్ల మందికి కూడా వీటిని అందజేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. రైతులందరికీ సంస్థాగత రుణ సదుపాయం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ముఖ్యమైందిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతు సమస్యలపై ప్రవేశపెట్టిన ఓప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. చిన్న కమతాల పెరుగుదల, దిగుబడులు తగ్గడంపై ఆయన మాట్లాడుతూ.. దీనికి విరుగుడుగా ఉమ్మడి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. జన్యు పంటలు ప్రమాదకరమనేందుకు ఆధారాల్లేవు: కేంద్రం జన్యు పంటలు ప్రమాదకరమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పర్యావరణ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లోక్‌సభకు తెలిపారు. మనుషులకు ప్రమాదకరంగా పరిణమించే జన్యు పంటలను చట్ట విరుద్ధంగా పండించే వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలలకు సూచించామన్నారు. ఆగస్టు 2 వరకు పార్లమెంట్! పార్లమెంట్ సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీతో సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం అన్ని బిల్లులను ప్రవేశపెట్టేందుకు వీలుగా సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేనప్పటికీ అధికార పక్షం నిర్ణయమే అంతిమం కానుంది. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ట్రిపుల్ తలాక్ సహా మరో 13 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. జూన్ 17వ తేదీ నుంచి కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు గత 20 ఏళ్లలోనే అత్యంత ఫలప్రదంగా సాగాయని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది. -
2022 లోపు రైతు ఆదాయం రెట్టింపు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: దేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 లోగా రెట్టింపు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు బహుముఖ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) ప్రాంతీయ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకు కార్యకలాపాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మందికిగాను 7.5 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో నాబార్డు 2015–16లో రూ.7,700 కోట్లు, 2016–17లో రూ. 9,200 కోట్ల రుణ సహాయం చేసిందని చెప్పా రు. ఆర్ఐడీఎఫ్ కింద 9.75 శాతం వడ్డీతో రుణ సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నాబార్డు తెలంగాణ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్, ఏపీ శాఖ సీజీఎం సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా తీసుకోవాలి
► రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ మునుగోడు : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతాను పొందాలని రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ సూచించారు. ఆర్థిక అక్ష్యరాస్యత వారోత్సవాల సందర్భంగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కొరటికల్ గ్రామంలో రైతులకు, ప్రజలకు బ్యాంక్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే రాయితీలను, ఆర్థిక ఫలాలను పొందాలంటే విధిగా బ్యాంక్ ఖాతా ఉండాలన్నారు.ఖాతాలు లేకపోతే ప్రభుత్వం అందించే ఏ ఒక్క రాయితీ పొందలేరన్నారు. అదే విధంగా రైతులు, వ్యాపారులు, ఇతరులు తమ అవసరాలకు బ్యాంక్‌ల్లో రుణాలు తీసుకొని తిరిగి వాటిని సకాలంలో చెల్లించాలన్నారు. ఖాతాలు, ఏటీఎం కార్డులు ఉన్నవారు ఎవరైనా మోసగాళ్లు మీ ఏటీఎం పిన్ నంబర్ మార్చుతున్నాం, మీ పాత పిన్ నంబర్ చెప్పమని కోరినా, మరే ఇతర విషయాలు చెప్పి పిన్ అడిగినా చెప్పకూడదన్నారు. అందరు కనీసం తమ పేరును రా యగలిగే వరకు చదువు నేర్చుకోవాలన్నారు. రైతులు రు ణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూ ర్యం, సర్పంచ్ ఐతగోని బుచ్చయ్యగౌడ్, వైఎస్ ఎంపీపీ సిరగమళ్ల నర్సింహ, మేనేజర్లు జేమ్స్, కె మహేష్‌బాబు, మా జీ సర్పంచ్ ఐతగోని లాల్‌బహదూర్‌గౌడ్, యాదయ్యగౌడ్, మురారిశెట్టి యాదయ్య తదితరులు పాల్గొ్గన్నారు. -
సవా లక్షన్నర షరతులు
కడప అగ్రికల్చర్/వేంపల్లె : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కిరికిరిగా మారుతోంది. ఈ పథకం దాదాపు అందరికీ వర్తిస్తుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 14వ తేదీన జీవో నంబరు 164 పేరుతో ఫైనాన్స్ శాఖ 26 అంశాలను రూపొందించి విడుదల చేసింది. దీని ప్రకారం రుణమాఫీలోకి వచ్చే రైతులందరూ బ్యాంకులకు పత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు. రుణమాఫీ నెల రోజుల్లో చేస్తామని చెప్పిన ప్రభుత్వం అనేక షరతులు విధిస్తుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేసుకుని మళ్లీ రుణాలు పొందాలని రైతులు ముందుకు వచ్చారు. రుణాలు రెన్యూవల్ చేస్తే ఆర్బీఐ ప్రకటించే రీ షెడ్యూల్ ఆ వర్తించకపోవచ్చని, దానికి రుణమాఫీ కూడా వర్తించదనే విషయాన్ని కొందరు బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. జిల్లాలో 2011వ సంవత్సరంలో వర్షాభావం కారణంగా రబీలో పంటలుదెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్పుట్ సబ్సిడీ విడుదలైంది. ఈ మొత్తాలను తీసుకోవడానికి రైతన్నలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మొత్తాలను బకాలయిలకు జమ చేసుకునే ప్రయత్నాల్లో బ్యాంకులు ఉన్నాయి. అలాగే 2013కు ఇన్పుట్ సబ్సీడీ, పంటల బీమా మంజూరు అయినా జీఓ ప్రకారం రుణమాఫీకి అర్హత ఉన్న రైతులు ఆ మొత్తాలను వెనక్కి ఇవ్వాలనే నిబంధన ఉండటంతో ఏటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 2013 ఖరీఫ్‌లో పంట రుణాలను 5,59,493 మంది రైతులు రూ. 4427.09 కోట్లు తీసుకున్నారు. అలాగే బంగారం తాకట్టు పెట్టి 1,20,325 మంది రూ. 2124.43 కోట్ల రుణం పొందారు.137 రూరల్ బ్రాంచ్‌లు, 78 అర్బన్ బ్రాంచ్‌లు, 88 సెమీ అర్బన్ బ్రాంచ్‌లలో రైతులు ఈ రుణాలను పొందారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ అనుబంధ రంగాలకు తీసుకున్న రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణమాఫీ వర్తించదని జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా బ్యాంకులకు అప్పు కోసం చేసుకున్న దరఖాస్తులో వ్యవసాయ అవసరాల కోసం రుణం తీసుకుంటున్నట్లు ఒక కాలమ్‌ను నింపి బ్యాంకులకు ఇచ్చారేగానీ, అందులో ఫలానా పంట, ఇన్ని ఎకరాలలో సాగు చేస్తున్నట్లు రాయకపోవడంతో అటువంటి రైతులందరికీ ఈ మాఫీ వర్తించదని మౌఖికంగా ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. పంట రుణమాఫీకి అర్హత పొందిన రైతులు అదే సందర్భంలో పంటల బీమా, వరద నష్టపరిహారం వంటివి పొంది ఉంటే వాటిని తిరిగి చెల్లించాలని జీఓలో పేర్కొన్నారు. * వ్యవసాయ పంటల సాగుకు తీసుకున్న రుణం, పక్కాగా ఫలానా పంటకు తీసుకున్న బంగారు తాకట్టు రుణం మాత్రమే మాఫీ అవుతాయి. * 2013 మార్చి 1 నుంచి 2013 డిసెంబరు 31 వరకు ఖరీఫ్, రబీ పంట రుణాలలో వడ్డీ సహా లక్ష లోపు ఉంటే మాఫీ వర్తిస్తుంది. * ఉద్యాన, చేపల పెంపకం, కోళ్లు, పాడి పరిశ్రమలపై తీసుకున్న రుణాలకు వర్తింపు లేదు. * కిసాన్ క్రెడిట్‌కార్డు ద్వారా మంజూరైన రుణాలకు మాఫీ వర్తిస్తుంది. * ఒకేసర్వే నంబరులో పట్టాదారు, కౌలుదారు రుణం తీసుకుంటే కౌలుదారునికి మాత్రమే మాఫీ వర్తిస్తుంది. * కుటుంబంలో ఎంతమంది పంటకోసం రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే రూ.1.50లక్షలు మాఫీ అవుతుంది. * రుణమాఫీకి అర్హత పొందిన రైతు ఒక ఫార్మాట్లో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్, బ్యాంకు పాసుబుక్కు ఖాతా నంబర్ ఉన్న జిరాక్స్‌ను బ్యాంకులో అప్పగించాలి. * ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో ఇంతవరకు ఖాతాలు లేకుండా బంగారంపై రుణాలు తీసుకున్న వారు విధిగా సేవింగ్స్ ఖాతాలు తెరవాలి. * మొదటి ప్రాధాన్యతగా పంటరుణంగా తీసుకుని ఆపై మార్జినల్ టర్మ్ లోన్‌గా మార్చుకున్న రుణాలకు, వ్యవసాయ పంటల సాగుకోసం పొందిన బంగారు రుణాలకు ప్రాధాన్యత ఇస్తారు. * ఒక కుటుంబంలో పలురకాల పంట రుణాలు ఉన్నప్పుడు ఒరిజినల్‌గా పట్టాదారు పాసుపుస్తకం ఎవరి పేరున ఉందో వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. * లక్షన్నర రూపాయలు వడ్డీతో సహా మించకుండా ఉంటే మాఫీలోకి వర్తిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రైతు తిరిగి బ్యాంక్‌కు చెల్లించాలి. * ఆధార్‌కార్డు లేనివారికి, భూమి అగ్రిమెంట్లపై బ్యాంకులలో రుణం తీసుకున్న వారికి మాఫీ వర్తించదు. * ఈనెల 28లోపల రుణమాఫీకి అర్హత ఉన్న వారందరూ జీఓలో పేర్కొన్న ప్రకారం పత్రాలను సమర్పిస్తేనే అర్హత పొందుతారు. * రుణం తీసుకున్న వ్యక్తి మృతిచెందితే వారి తాలూకు కుటుంబీకులు మాఫీపోనూ మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. అలా చెల్లించకపోతే రుణం తీసుకున్న వ్యక్తికి పూచీగా సంతకాలు చేసిన వారు చెల్లించాల్సి ఉంటుంది. * ఇలా 26 అంశాలతో కూడిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రైతులు ఎక్కడ మాఫీకి మళ్లీ ఎసరు పెడతారోనని ఆందోళన చెందుతున్నారు. ఆందోళనలో అన్నదాతలు వేంపల్లె : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తిరకాసు పెడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓను చూసి ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఎస్బీఐ వద్ద పెద్ద స్థాయిలో రైతులు గుమిగూడారు. ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా ధర్నా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆరోపిస్తున్నారు.