ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా తీసుకోవాలి
► రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్
మునుగోడు : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతాను పొందాలని రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ సూచించారు. ఆర్థిక అక్ష్యరాస్యత వారోత్సవాల సందర్భంగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కొరటికల్ గ్రామంలో రైతులకు, ప్రజలకు బ్యాంక్ సేవలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే రాయితీలను, ఆర్థిక ఫలాలను పొందాలంటే విధిగా బ్యాంక్ ఖాతా ఉండాలన్నారు.ఖాతాలు లేకపోతే ప్రభుత్వం అందించే ఏ ఒక్క రాయితీ పొందలేరన్నారు. అదే విధంగా రైతులు, వ్యాపారులు, ఇతరులు తమ అవసరాలకు బ్యాంక్‌ల్లో రుణాలు తీసుకొని తిరిగి వాటిని సకాలంలో చెల్లించాలన్నారు.
ఖాతాలు, ఏటీఎం కార్డులు ఉన్నవారు ఎవరైనా మోసగాళ్లు మీ ఏటీఎం పిన్ నంబర్ మార్చుతున్నాం, మీ పాత పిన్ నంబర్ చెప్పమని కోరినా, మరే ఇతర విషయాలు చెప్పి పిన్ అడిగినా చెప్పకూడదన్నారు. అందరు కనీసం తమ పేరును రా యగలిగే వరకు చదువు నేర్చుకోవాలన్నారు. రైతులు రు ణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూ ర్యం, సర్పంచ్ ఐతగోని బుచ్చయ్యగౌడ్, వైఎస్ ఎంపీపీ సిరగమళ్ల నర్సింహ, మేనేజర్లు జేమ్స్, కె మహేష్‌బాబు, మా జీ సర్పంచ్ ఐతగోని లాల్‌బహదూర్‌గౌడ్, యాదయ్యగౌడ్, మురారిశెట్టి యాదయ్య తదితరులు పాల్గొ్గన్నారు.