దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రైతులకు శుభవార్త తెలిపింది. రైతులకు గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షలు వరకు రుణం అందించనున్నట్లు పేర్కొంది. ఈ రుణం కోసం ఎస్‌బీఐ బ్యాంక్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు సహాయం చేయడం కోసం ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తుంది. రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం ఈ కార్డు సహాయంతో రుణం సులభంగా తీసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా వారి అవసరాన్ని బట్టి రుణం అందిస్తుంది. ఈ కార్డు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు
- కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ తరహాలోనే ఇది ఉంటుంది.
- ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటును అందిస్తుంది.
- ఈ కార్డు వ్యవది 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్షకు లోబడి మీ కార్డు పరిమితి 10% పెరుగుతుంది.
- కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలకు రూ.3 లక్షల వరకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
- తిరిగి చెల్లించే వ్యవధి పంట కాలం(స్వల్ప/దీర్ఘం), పంట మార్కెటింగ్ పీరియడ్ పై ఆధారపడి ఉంటుంది.
- 45 రోజులకు ఒకసారి కార్డు యాక్టివేట్ చేసినట్లయితే, బ్యాంకు రూపే కార్డుల మాదిరిగా మీకు రూ. 1 లక్ష బీమా లభిస్తుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
రైతులు/వ్యక్తులు/ఉమ్మడి రుణగ్రహీతలు, యజమాని సాగుదారులు, కౌలు రైతులు, నోటి లెస్సీలు, షేర్ క్రాపర్లు అందరూ కూడా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులు, షేర్ క్రాపర్లు మొదలైన వాటితో సహా రైతుల స్వయం సహాయక గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా వర్తిస్తాయి. రూ.3 లక్షల వరకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంటుంది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం(పీఎఐఎస్) కింద కవర్ చేయబడతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎమ్ఎఫ్ బివై) కింద కవర్ అవుతాయి.
(చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!)
కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
- ఎస్‌బీఐ పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
- రైతులు నేరుగా ఎస్‌బీఐ శాఖను సందర్శించి కేసీసీ దరఖాస్తు ఫారమ్ కోసం అడగవచ్చు.
- ఆ తర్వాత మీ పూర్తి వివరాలను నింపి, బ్యాంకులో సమర్పించాలి
- బ్యాంకు దరఖాస్తును పరిశీలించి, దరఖాస్తుదారుడి వివరాలను ధృవీకరించి, కార్డును కేటాయిస్తుంది.
యోనో ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
- యోనో ఎస్‌బీఐ లాగిన్ అవ్వండి
- యోనో కృషి ఆప్షన్ పై క్లిక్ చేసి ఖాతాపై క్లిక్ చేయండి.
- మళ్లీ కిసాన్ క్రెడిట్ కార్డుపై క్లిక్ చేయండి
- ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, పంట వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి.
- మీరు గనుక అర్హులు అయితే, కిసాన్ క్రెడిట్ కార్డు మీ ఇంటికి వస్తుంది.
కావాల్సిన పత్రాలు
- ఇంటి చిరునామా, గుర్తింపు రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.
- వ్యవసాయ భూమి పత్రాలు
- దరఖాస్తుదారుడి ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అందించాలి.
- కార్డ్ జారీ చేసే బ్యాంక్ సెక్యూరిటీ పోస్ట్ డేటెడ్ చెక్‌ను సమర్పించమని కూడా అడగవచ్చు.
(చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..!)
Comments
Please login to add a commentAdd a comment