ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట | Property Tax Payment Deadline Extended To Three Months In Telangana | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను చెల్లింపు గడువు పొడిగింపు..

Published Wed, Apr 1 2020 7:08 PM | Last Updated on Wed, Apr 1 2020 7:09 PM

Property Tax Payment Deadline Extended To Three Months In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం​ సెక్షన్‌ 100 (2)ను సవరిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్‌ 30 వరకూ పొడిగిస్తున్నట్టు మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌, పట్టణాభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగరపాలక సంస్థల్లో పొడిగించిన గడువుకు అదనంగా ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను, ఇతర బకాయిల చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్‌ 30 వరకూ పొడిగిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ వెల్లడించారు.

చదవండి : ఆపరేషన్‌ ‘ఢిల్లీ రిటర్న్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement