కేయూ పీజీ సెట్ వెబ్ ఆప్షన్ గడువు పొడిగింపు
Published Tue, Aug 9 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు గడువును పొడిగించామని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు.
కొత్తగా కొన్ని కాలేజీలలో కోర్సులకు అనుమతి రావడం వల్ల వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈనెల 7వ తేదీన గడువు ముగియ గా, మళ్లీ పెంచామన్నారు. ఏదేని కారణాలతో కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోలేకపోయిన వారికి కూడా అవకాశం ఉందన్నారు. ఈనెల 10,11, 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చామన్నారు. వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న విద్యార్థులకు ఈనెల 16వ తేదీన మొదటి దశలో సీట్ల కేటాయింపు జరగుతుందని తెలి పారు. సీట్లు పొందిన విద్యార్థులు వారికి కేటాయిం చిన కళాశాలల్లో ఈనెల 20వ తేదీలోపు ప్రవేశాలు పొందాలన్నారు. ఏ కోర్సులో సీటు పొందారో విద్యార్థుల సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ ద్వారా సమాచారం వస్తుందన్నారు. కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు.
Advertisement
Advertisement