లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ గడువు మరోసారి పెరిగింది. బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది. ఈ గడువులోగా బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంటు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని థెరెసా మేకు సూచించింది. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో గురువారం సమావేశమైన 28 ఈయూ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనల మేరకు వచ్చే నెల 23న జరిగే ఈయూ ఎన్నికల్లో బ్రిటన్ పాల్గొనాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్‌క్లౌడే జంకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment