పేద కళాకారులకు అండగా జీవిత–రాజశేఖర్‌ | Jeevitha Rajasekhar About Corona Virus At Telugu Film Industry | Sakshi
Sakshi News home page

పేద కళాకారులకు అండగా జీవిత–రాజశేఖర్‌

Published Mon, Mar 23 2020 3:45 AM | Last Updated on Mon, Mar 23 2020 3:45 AM

Jeevitha Rajasekhar About Corona Virus At Telugu Film Industry - Sakshi

కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏరోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’లో (మా) కొందరు ఉన్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అందించనున్నట్లు హీరో డా.రాజశేఖర్‌– జీవితా రాజశేఖర్‌ ప్రకటించారు. నిరుపేద కళాకారులు 90108 10140 నంబర్‌కి కాల్‌ చేసి పూర్తి వివరాలు అందించి తగు సహాయం పొందాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement