former players
-
మాజీ క్రీడాకారులకు గావస్కర్ చేయూత
ముంబై: ఆరి్థక కష్టాలతో సతమతమవుతున్న భారత మాజీ క్రీడాకారుల కోసం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ‘ది చాంప్స్ ఫౌండేషన్’ ద్వారా చేయూత అందిస్తున్నారు. సన్నీ 1999 నుంచి ఈ వితరణ చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన మాజీ క్రీడాకారులు, బతుకు భారంగా వెళ్లదీస్తున్న అలనాటి ఆటగాళ్లకు తనవంతు సాయం చేస్తున్నారు. ఇన్నాళ్లు మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచి్చన వారికే సన్నీ సేవలందాయి. ఇప్పుడు ఆయన తన సేవా నిరతిని పెంచాలని, స్వయంగా సాదకబాధకాలు తెలియజేసిన వారికీ ఆరి్థక సాయం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన ఫౌండేషన్‌ను వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. కష్టాల్లో ఉన్న మాజీలు ఎవరైనా సరే ఛిజ్చిఝpటజీnఛీజ్చీ.ౌటజ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే చేయూత అందిస్తామని సన్నీ చెప్పారు. తమ కార్యకలాపాలు క్రీయాశీలం చేసేందు కు వెబ్‌సైట్‌ను తీసుకొచ్చామని, ఇది తమ ఫౌండేషన్ విస్తృతికి దోహదం చేస్తుందని గావస్కర్ తెలిపారు. -
విషాదం: ఒకేరోజు అటు రవీందర్ పాల్... ఇటు కౌశిక్
న్యూఢిల్లీ: భారత హాకీలో విషాదం. కరోనా కారణంగా శనివారం ఒకే రోజు ఇద్దరు మాజీ స్టార్ క్రీడాకారులు తుది శ్వాస విడిచారు. కోవిడ్–19కు చికిత్స పొందుతూ కోలుకోలేకపోయిన రవీందర్ పాల్ సింగ్ (61) లక్నోలో... ఎంకే కౌశిక్ (66) ఢిల్లీలో కన్ను మూశారు. కౌశిక్‌కు భార్య, ఒక కుమారుడు ఉండగా... రవీందర్ పాల్ అవివాహితుడు. 1980 మాస్కో ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణపతకం గెలిచింది. రవీందర్ పాల్, కౌశిక్‌లు ఈ జట్టులో సభ్యులు కావడం విశేషం. ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి పట్ల హాకీ ఇండియా (హెచ్ఐ) సంతాపం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ స్వర్ణ పతకం సాధించిన ఆటగాళ్లుగా వారిద్దరూ భారత హాకీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారని హెచ్ఐ అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోంబామ్ శ్రద్ధాంజలి ఘటించారు. కౌశిక్: ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా కౌశిక్ భారత హాకీపై తనదైన ముద్ర వేశాడు. ఆయన శిక్షణలో భారత పురుషుల జట్టు 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకోగా... భారత మహిళల జట్టు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. కౌశిక్ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా అర్జున, ఆపై ‘ద్రోణాచార్య’ పురస్కారాలతో సత్కరించింది. రవీందర్ పాల్: 1979 జూనియర్ ప్రపంచకప్‌లో సభ్యుడి నుంచి సీనియర్ టీమ్‌కు వెళ్లిన రవీందర్ పాల్ 1984 వరకు సెంటర్ హాఫ్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న అతను 1982 ఆసియా కప్‌లో, రెండు చాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. -
అలాంటి వారు గౌరవాన్ని కోల్పోతారు
మాజీలపై టెస్టు కెప్టెన్ కోహ్లి విమర్శ న్యూఢిల్లీ: జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని మాజీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెటర్లను విమర్శించడంపై భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ధ్వజమెత్తాడు. టెస్టు ఫార్మాట్లో నంబర్‌వన్‌గా ఉన్న దక్షిణాఫ్రికాపై 3-0తో సిరీస్ గెలిచినా ఇంకా విమర్శించడం శోచనీయమని అన్నాడు. తాము ఎలా ఆడి గెలిచామో కాకుండా పిచ్‌ల గురించి ఎక్కువగా చర్చ జరిగిందని తప్పుబట్టాడు. ‘సొంత ప్రయోజనాల కోసం ఆడిన కొందరు మాజీలు మా ఆటను విమర్శించడం గాయపరిచింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడిన వారికి అంతర్జాతీయ క్రికెటర్లను విమర్శించే హక్కు లేదు. ఇంట్లో కూర్చుని ఎలా ఆడాలో చెప్పడమేమిటి? మైదానంలో ఉన్న ఆటగాడికే ఆ పరిస్థితిపై అవగాహన ఉంటుంది. కొందరు మా మైండ్‌సెట్‌ను అర్థం చేసుకుని మాట్లాడారు. విలువైన సలహాలతో ఉపయోగపడ్డారు. కానీ కొందరు మాత్రం నెగెటివ్స్పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నిజానికి వారిని చూస్తూ పెరిగిన నేను అలాంటి కామెంట్స్ చేసినపుడు గౌరవించాలని ఎలా అనిపిస్తుంది’ అని కోహ్లి ప్రశ్నించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-0తో నెగ్గినా కొందరు తమకు క్రెడిట్ ఇవ్వడం లేదని ఆరోపించాడు. సొంత గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తామెంత మంచి క్రికెట్ ఆడామో గుర్తు చేయకుండా లోపాలపై, పిచ్‌లపై దృష్టి పెట్టారని అన్నాడు. మాజీలతో పాటు మీడియా కూడా జట్టు ఆటగాళ్లపై విమర్శలు చేసిందని గుర్తు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కాగానే ఎందుకూ పనికిరానివాడిగా కథనాలు ప్రచురించడం సరికాదని హితవు పలికాడు. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా వాటిని చూసి నమ్ముతారని అన్నాడు. ఆసీస్, ఇతర దేశాల్లో పరిస్థితి ఇలా వుండదని, ఆటగాడు ఫామ్ కోల్పోయినా గతంలో ఎలా ఆడేవాడో.. ఎంత మంచి ఆటగాడో చర్చిస్తారని తెలిపాడు. -
వైభవంగా అవార్డుల ప్రదానం
ముంబై: బీసీసీఐ అవార్డుల కార్యక్రమం శుక్రవారం రాత్రి కన్నులపండుగగా జరిగింది. అవార్డులు అందుకున్న వారిలో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అందుకున్నారు. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివ్లాల్ యాదవ్ ఈ అవార్డును అందించారు. 58 ఏళ్ల వెంగ్‌సర్కార్ 116 టెస్టులు, 129 వన్డేలు ఆడారు. ఈ అవార్డుతో దిగ్గజాల సరసన తనను చేర్చినందుకు బీసీసీఐకి వెంగీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియం పేసర్ భువనేశ్వర్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు (రూ.5 లక్షల నగదు బహుమతి), వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డును ఇచ్చారు. రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ఇచ్చే లాలా అమర్నాథ్ అవార్డు (రూ.2.5 లక్షలు) పర్వేజ్ రసూల్, రంజీల్లో అత్యధిక పరుగులు సాధించినందుకు మాధవ్‌రావ్ సింధియా అవార్డు (రూ.2.5 లక్షలు) కేదార్ జాదవ్ (1223 పరుగులు)కు అందించారు. హైదరాబాద్‌కు చెందిన అండర్-19 క్రికెటర్ బి.అనిరుధ్‌కు ఎంఏ చిదంబరం ట్రోఫీ (రూ. 50 వేలు) అందించారు.