కొత్త కెప్టెన్ డి కాక్ సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం మళ్లీ వచ్చింది. దక్షిణాఫ్రికాలో 3–0తో ఆస్ట్రేలియాను చిత్తు చేసి వస్తుండటం వల్ల జట్టులో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉండి ఉంటుంది. డి కాక్ తొలి రెండు వన్డేల్లో విఫలమయ్యాడు. రెండు సార్లు స్టార్క్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తన భార్య అలీసా హీలీ ప్రపంచ కప్ మ్యాచ్ చూసేందుకు స్టార్క్ స్వదేశం వెళ్లిన తర్వాత జరిగిన మూడో వన్డేలోనే అతను పరుగులు చేయగలిగాడు. అయితే దీని వల్ల అతనిపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. ఎందుకంటే భారత్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న డి కాక్ అలవోకగా సెంచరీలు బాదేశాడు.
భారత్‌లో పరాభవంనుంచి కోలుకున్న తర్వాత డు ప్లెసిస్ కూడా ఇప్పుడు కోలుకొని ఉంటాడు. అతనిలోని అసలైన బ్యాట్స్‌మన్ బయటకు వస్తే మంచిది. అతనిపై కెప్టెన్సీ భారం లేదు కాబట్టి కొన్నాళ్ల క్రితం సారథిగా కనిపించిన బేలతనం ఇకపై కనిపించకపోవచ్చు. కొందరు కొత్త ఆటగాళ్లతో జట్టు కూడా కొత్తగా కనిపిస్తోంది. ఆసీస్‌పై సెంచరీ చేసిన మలాన్‌తో పాటు గతంలో భారత్‌లో ఆడినా పెద్దగా అవకాశాలు రాని క్లాసెన్ ఆట కూడా కీలకం కానుంది. రబడ లేకుండా బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... ఇక్కడ టెస్టులు ఆడలేకపోయిన ఇన్‌గిడి ఇటీవల ఆస్ట్రేలియాపై చెలరేగాడు. అతను ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment