మార్కరమ్ తుపాన్ ఇన్నింగ్స్
South Africa Beat Netherlands By 146 Runs: నెదర్లాండ్స్‌తో మూడో వన్డేలో సౌతాఫ్రికా దుమ్ములేపింది. డచ్ జట్టును ఏకంగా 146 పరుగుల భారీ తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఎయిడెన్ మార్కరమ్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు.
ఇక ఈ భారీ గెలుపుతో ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ప్రొటిస్ వెస్టిండీస్‌ను వెనక్కినెట్టింది. దీంతో ఎనిమిదో స్థానానికి చేరి ప్రపంచకప్-2023 బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది.
తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ మార్కరమ్
జోహన్సన్‌బర్గ్ వేదికగా ఆదివారం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆతిథ్య సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(8), తెంబా బవుమా(6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఎయిడెన్ మార్కరమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటిదాకా జోష్‌లో ఉన్న డచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 126 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 175 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్ 61 బంతుల్లో 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
మార్కరమ్, మిల్లర్ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్ చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన నెదర్లాండ్స్ 39.1 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
బ్యాట్‌తోనే కాదు బంతితోనూ మెరిశాడు
డచ్ ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో ముసా అహ్మద్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రొటిస్ బౌలర్లలో సిసాంద మగల 5 వికెట్లతో మెరిశాడు. బ్యాటింగ్‌తో అదరగొట్టిన మార్కరమ్ 2 వికెట్లు కూల్చాడు. లుంగి ఎంగిడి ఒకటి, మార్కో జాన్సెన్ ఒకటి, తబ్రేజ్ షంసీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో 146 పరుగులతో గెలుపొందిన సౌతాఫ్రికా వన్డే సూపర్‌లీగ్‌లో 98 పాయింట్లతో ముందడుగు వేసింది. భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించే క్రమంలో మరో ముందడుగు వేసింది.
బంగ్లాదేశ్- ఐర్లాండ్ వన్డే సిరీస్ ఫలితం తేలితే.. ఐరిష్ జట్టును బంగ్లా చిత్తు చేస్తే ప్రొటిస్‌కు బెర్తు ఖాయమవుతుంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా బంగ్లా ఐర్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసేట్లుగానే కనిపిస్తోంది. అలా అయితే ప్రొటిస్ పంట పండినట్లవుతుంది.
నువ్వుంటే బాగుండేది.. మిస్ యూ
ఇదిలా ఉంటే.. ఎయిడెన్ మార్కరమ్ ఇన్నింగ్స్‌పై సన్‌రైజర్స్ ఫ్యా న్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నువ్వుంటే బాగుండేది. ఒక్కడివే 175 పరుగులు సాధించావు. ఇక్కడ అంతా కలిసి కనీసం 150 కూడా కొట్టలేదు.. మిస్ యూ మార్కరమ్! కనీసం నువ్వు వచ్చాకైనా రాత మారుతదేమో’’ అని ఆరెంజ్ ఆర్మీ కామెంట్లు చేస్తోంది.
కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర సీజన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టును మార్కరమ్ విజేతగా నిలిపాడు. సారథిగా ముందుండి నడిచి తొలి సీజన్ చాంపియన్‌గా సన్‌రైజర్స్‌ను నిలబెట్టాడు.
వన్డే వరల్డ్‌కప్-2023కి నేరుగా అర్హత సాధించిన జట్లు:
PC: ICC
చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక..
IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో..
Comments
Please login to add a commentAdd a comment