Sunil Gavaskar Comments On Rohit Sharma After Classy Knock in Nagpur T20I - Sakshi
Sakshi News home page

IND VS AUS: రోహిత్‌ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్‌ గవాస్కర్‌

Published Sat, Sep 24 2022 3:36 PM | Last Updated on Sat, Sep 24 2022 4:30 PM

Sunil Gavaskar Comments On Rohit Sharma After Classy Knock in Nagpur T20I - Sakshi

నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండడో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత విజయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక పాత్ర పోషించాడు. 20 బంతుల్లో 46 పరుగులుతో అఖరి వరకు నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్‌ శర్మను భారత మాజీ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసించాడు. అయితే రోహిత్‌  షాట్లు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ..  కొన్ని షాట్ల ఎంపికలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో స్టార్‌ స్పోర్ట్స్‌తో గవాస్కర్‌ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఆడిన విధానం అద్భుతమైనది.

అతడు డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించలేదు. అతడు ఈ మ్యాచ్‌లో చాలా షాట్లు కూడా ఆడాడు. రోహిత్‌ ఫ్లిక్‌ షాట్‌లు, పుల్‌ షాట్‌లు అద్భుతంగా ఆడాడు. అయితే అతడు ఆఫ్‌ సైడ్‌ షాట్‌లు ఆడడంలో ఇబ్బంది పడతున్నాడు. ఆ షాట్‌లను ఎంపిక చేసుకోవడంలో రోహిత్‌ సృష్టంగా లేడు. కాబట్టి బంతిని స్టాండ్‌లోకి కాకుండా గాల్లోకి లేపుతున్నాడు. ఆ ఒక్క షాట్‌ విషయంలో అతడు జాగ్రత్తగా ఆడితే చాలు" అని పేర్కొన్నాడు. కాగా సిరీస్‌ డిసైడర్‌ మూడో టీ20 హైదరాబాద్‌ వేదికగా ఆదివారం జరగనుంది.
చదవండి: Rohit Sharma: సిక్సర్ల విషయంలో రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement