అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్ బ్యాటింగ్‌కు వస్తాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. చాలామంది విశ్లేషకులు రోహిత్ మిడిలార్డర్‌లో రావడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. జట్టు అవసరాల దృష్ట్యా ఇదే కరెక్ట్ అని హిట్‌మ్యాన్ కూడా భావిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ రోహిత్ మిడిలార్డర్‌లో రావాలనుకుంటే ఏ స్థానంలో బరిలోకి దిగాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జట్టు సమీకరణల దృష్ట్యా రోహిత్ ఐదు లేదా ఆరో స్థానాల్లో బరిలోకి దిగవచ్చు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో స్థానంలో రిషబ్ పంత్ బరిలో ఉంటారు.
రోహిత్ గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. టెస్ట్ కెరీర్ ఆరంభంలో హిట్‌మ్యాన్ ఇదే స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. రోహిత్‌కు ఓపెనర్‌గా కంటే ఆరో స్థానంలో మంచి రికార్డు ఉంది. ఓపెనర్‌గా రోహిత్ 64 ఇన్నింగ్స్‌ల్లో 44.02 సగటున పరుగులు చేస్తే.. ఆరో స్థానంలో అతని సగటు 54.58గా ఉంది.
కేఎల్ రాహుల్‌ను కదపకపోవడమే మంచిది..!
తొలి టెస్ట్‌లో ఓపెనర్‌గా అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన కేఎల్ రాహుల్‌ను రెండో టెస్ట్‌లోనూ ఓపెనర్‌గా కొనసాగించడం మంచిది. రాహుల్ కోసం రోహిత్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయడం ఉత్తమమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పైగా రోహిత్ టెస్ట్‌ల్లో గత కొంతకాలంగా పెద్దగా ఫామ్‌లో లేడు.
రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు (అంచనా)..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా
Comments
Please login to add a commentAdd a comment