భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే గోల్డెన్ డక్ కాగా, పుజారా ఈ సారి కేవలం 3 పరుగులకే పెవియన్ చేరాడు. అయితే దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టు ఎంపిక చేసే ముందే వీరిద్దరి చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా విదేశాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఈ సీనియర్ ఆటగాళ్లకి చోటు దక్కింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోతున్నారు. తొలి టెస్ట్‌లో రహానే 48 పరుగులతో ఫర్వాలేదనిపించిన, తర్వాత తేలిపోయాడు.
ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ వీళ్లిద్దరికి చాలా కీలకం అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే యువ ఆటగాళ్లు రాణిస్తుండంతో, వీళ్లు జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అతడు తెలిపాడు. "పుజారా, రహానే ఇద్దరూ వారి టెస్ట్ కెరీర్‌ను కాపాడుకోవడానికి రెండో ఇన్నింగ్స్ కీలకం. తదపరి ఇన్నింగ్స్‌లో ఏదో ఒక స్కోర్ సాధించి జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే వారు జట్టులో తమ స్ధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీళ్లకు శ్రేయస్ అయ్యర్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: SA vs IND: రాహుల్‌కి వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment