ముంబై: వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం దాదాపు అన్ని దేశాలు తమ జట్లును ప్రకటించే పనిలో ఉన్నాయి. బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో తన జట్టును ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ని తన టీంలో ఎంపిక చేయలేదు.
ఇక తన జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు ఓపెనర్లుగా ఆవకాశం ఇచ్చాడు. అదే విధంగా.. తన జట్టులో ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను గవాస్కర్ ఎంపిక చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానాన్ని దక్కించుకోగా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు మిడిలార్డర్‌లో స్దానం దక్కింది.
గవాస్కర్ జట్టులో ఇద్దరు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే... సన్నీ తన జట్టులో 5 పేసర్లను ఎంపిక చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ షమీలకు అవకాశం ఇచ్చాడు. తన జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను గావస్కర్ ఎంచుకున్నాడు.
చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక.
Comments
Please login to add a commentAdd a comment