
లండన్: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకి నిరాకరించిన బ్రిటన్ రక్షణ మంత్రి విలియమ్సన్‌పై ఆయన మంత్రివర్గ సహచరులే తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆ దేశ మీడియా పేర్కొంది. రక్షణ రంగంలో భాగస్వామ్యం, కొనుగోళ్లపై రెండు దేశాల మధ్య జూన్ 20–22 తేదీల్లో లండన్‌లో ద్వైపాక్షిక సమావేశం జరగ్గా.. నిర్మలా సీతారామన్‌తో భేటీకి రక్షణ మంత్రి గవిన్ విలియమ్సన్‌ను భారత అధికారులు అపాయింట్‌మెంట్ అడిగారు. అందుకు విలియమ్సన్ సుముఖత వ్యక్తం చేయలేదని అక్కడి మీడియా ఆదివారం వెల్లడించింది. ఫలితంగా సీతారామన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే ఈ కథనాలను నిర్మలా సీతారామన్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment