రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం
సిరీస్ 1-1తో డ్రా
లీడ్స్ : డ్రాగా ముగియాల్సిన తొలి టెస్టును ఆఖరి రోజు పేలవంగా ఆడి కోల్పోయిన న్యూజిలాండ్... రెండో టెస్టులో అనూహ్యంగా పుంజుకుంది. డ్రా ఖాయమనుకున్న మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి చివరి రోజు పది వికెట్లు తీసి జట్టును గెలిపిం చారు. 455 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటయింది. విలియమ్సన్ (3/15), క్రెయిగ్ (3/73), బౌల్ట్ (2/61) అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో చివరిదైన రెండో టెస్టును కివీస్ 199 పరుగుల తేడాతో గెలుచుకుని సిరీస్‌ను 1-1తో డ్రా చేసింది.
ఇంగ్లండ్ లో వారికిది ఐదో టెస్టు విజయం. ఆఖరి రోజు కుక్ సేన వికెట్ నష్టపోకుండా 44 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించగా... లంచ్ సెషన్‌లోపే ఐదు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఎవరూ పోరాడలేకపోవడంతో పరాజయం తప్పలేదు. బట్లర్ (147 బంతుల్లో 73; 13 ఫోర్లు; 1 సిక్స్), కుక్ (171 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఫర్వాలేదనిపించారు. మరోవైపు టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా (30 సంవత్సరాల 159 రోజులు) కుక్ రికార్డులకెక్కాడు. కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
న్యూజిలాండ్ ‘సూపర్’
Published Wed, Jun 3 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement