England test
-
మెక్కల్లమ్ పారితోషికం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇంగ్లండ్ నూతన టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కోచ్ సిల్వర్‌వుడ్ స్థానంలో కొత్త కోచ్‌గా వచ్చిన మెక్కల్లమ్ జట్టును గాడిలో పెడతాడేమో చూడాలి. అసలే వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు ఇంగ్లండ్‌ను దెబ్బతీశాయి. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నాయకత్వ పగ్గాలు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అప్పగించింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ కలయికలో సరికొత్తగా కనిపిస్తున్న ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌ను గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. మెక్కల్లమ్ నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా పనిచేయనున్నాడు. అందుకు సంబంధించి నాలుగేళ్ల కాలానికి గానూ మెక్‌కల్లమ్‌కు ఈసీబీ భారీగా చెల్లించనుంది. టెలిగ్రాఫ్.యూకే కథనం ప్రకారం 2 యూరో మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 18.88 కోట్లు) మెక్కల్లమ్తో నాలుగేళ్ల కాలానికి ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక హెడ్‌కోచ్‌కు ఈసీబీ ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి అని వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్లకు ఎంత చెల్లిస్తామనేది గ్రేడ్స్ ప్రకటించే క్రికెట్ బోర్డులు కోచ్‌లకు ఎంత చెల్లిస్తున్నామనేది ఎక్కడా బహిరంగపరచలేదు. అయితే మెక్కల్లమ్పై ఉన్న నమ్మకంతోనే ఈసీబీ అతనికి పెద్ద మొత్తం చెల్లిస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా ఎంపికైన మెక్కల్లమ్ స్పందించాడు. ''ఇంగ్లండ్ క్రికెట్‌కు సేవలందించడానికి ఉవ్విళ్లూరుతున్నా. నాపై నమ్మకంతో బోర్డు నాకు అప్పగించిన బాధ్యతలను పాజిటివ్ ధోరణితో నిలబెట్టుకుంటా. ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టును గాడిలోపెట్టడానికి ప్రయత్నిసా. బెన్ స్టోక్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఒక ఆటగాడిగా అతను నాకు పరిచయం.. ఇకపై ఇద్దరి సమన్వయంతో జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. చదవండి: IPL 2022: క్రికెట్‌కు వీరాభిమాని.. ఇతని స్టైల్ వేరు RCB Play-Off Chances: ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
న్యూజిలాండ్ ‘సూపర్’
రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సిరీస్ 1-1తో డ్రా లీడ్స్ : డ్రాగా ముగియాల్సిన తొలి టెస్టును ఆఖరి రోజు పేలవంగా ఆడి కోల్పోయిన న్యూజిలాండ్... రెండో టెస్టులో అనూహ్యంగా పుంజుకుంది. డ్రా ఖాయమనుకున్న మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి చివరి రోజు పది వికెట్లు తీసి జట్టును గెలిపిం చారు. 455 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటయింది. విలియమ్సన్ (3/15), క్రెయిగ్ (3/73), బౌల్ట్ (2/61) అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో చివరిదైన రెండో టెస్టును కివీస్ 199 పరుగుల తేడాతో గెలుచుకుని సిరీస్‌ను 1-1తో డ్రా చేసింది. ఇంగ్లండ్ లో వారికిది ఐదో టెస్టు విజయం. ఆఖరి రోజు కుక్ సేన వికెట్ నష్టపోకుండా 44 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించగా... లంచ్ సెషన్‌లోపే ఐదు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఎవరూ పోరాడలేకపోవడంతో పరాజయం తప్పలేదు. బట్లర్ (147 బంతుల్లో 73; 13 ఫోర్లు; 1 సిక్స్), కుక్ (171 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఫర్వాలేదనిపించారు. మరోవైపు టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా (30 సంవత్సరాల 159 రోజులు) కుక్ రికార్డులకెక్కాడు. కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
వాట్లింగ్ అజేయ సెంచరీ
లీడ్స్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (137 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (72 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మెకల్లమ్ (98 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్), టేలర్ (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1సిక్స్) రాణించారు. అంతకుముందు 253/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 350 పరుగుల వద్దే ఆలౌటైంది. స్టువర్ట్ బ్రాడ్ 46 పరుగులు చేశాడు. సౌతీ 4, బౌల్ట్, క్రెయిగ్ చెరో 2 వికెట్లు తీశారు. -
ఆడమ్ లిత్ సెంచరీ: ఇంగ్లండ్ 253/5
లీడ్స్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. రెండో రోజు శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఆడమ్ లిత్ (107; 15 ఫోర్లు) సెంచరీతో కెప్టెన్ కుక్ (75; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించినా... చివర్లో కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 88 ఓవర్లలో ఐదు వికెట్లకు 253 పరుగులు చేసింది. 70 పరుగుల వ్యవధిలోనే ఈ ఐదు వికెట్లు నేలకూలాయి. తొలి వికెట్‌కు ఓపెనర్లు 177 పరుగులు జత చేశారు. క్రీజులో బట్లర్ (6 బ్యాటింగ్) బెల్ (12 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గూచ్ (8,900) రికార్డును కుక్ అధిగమించాడు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. -
విలియమ్సన్ సెంచరీ
లార్డ్స్: కేన్ విలియమ్సన్ సెంచరీ (262 బంతుల్లో 132; 15 ఫోర్లు) సహాయంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజి లాండ్ జట్టు 134 పరుగుల ఆధిక్యం సాధించింది. శనివారం మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 523 పరుగులకు ఆలౌటైంది. టేలర్ (62; 7 ఫోర్లు), వాట్లింగ్ (61 నాటౌట్; 11 ఫోర్లు) రాణించారు. బ్రాడ్, వుడ్, మొయిన్ అలీలకు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. కుక్ (32 బ్యాటింగ్), బెల్ (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. -
ఇంగ్లండ్ 354/7
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు లార్డ్స్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ (161 బంతుల్లో 98; 11 ఫోర్లు), బెన్ స్టోక్స్ (94 బంతుల్లో 92; 15 ఫోర్లు; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఏడు వికెట్లకు 354 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ (92 బంతుల్లో 49 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఉన్నాడు. ఆఖరి ఓవర్ చివరి బంతికి బట్లర్ (126 బంతుల్లో 67; 9 ఫోర్లు) అవుట్ అయ్యాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 103 పరుగులు జత చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అనంతరం కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే ఫామ్‌లో ఉన్న రూట్, స్టోక్స్ ఈ పరిస్థితిలో నిలకడగా ఆడి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 161 పరుగులు జోడించారు. ఈ క్రమంలో తృటిలో తమ శతకాలను కోల్పోయారు. హెన్రీకి మూడు, బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
ఒక్క చాన్స్ ప్లీజ్..!
అవకాశం కోసం గంభీర్ ఎదురు చూపులు ధావన్ స్థానంలో తీసుకోవాలనే డిమాండ్ గౌతమ్ గంభీర్... ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మెన్‌లో అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న క్రికెటర్. మూడు టెస్టులు గడిచినా... ఓపెనర్‌గా ధావన్ విఫలమవుతున్నా... ఇప్పటివరకూ గంభీర్‌కు అవకాశం రాలేదు. రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న గంభీర్ తనని తాను నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం మిగిలిన రెండు టెస్టులు. మరి మాంచెస్టర్‌లో అయినా తనకు చాన్స్ దక్కుతుందా..! సాక్షి క్రీడావిభాగం: ఇంగ్లండ్‌లో టెస్టు గెలవాలంటే ఏ జట్టుకైనా ఓపెనర్లు అత్యంత కీలకం. కొత్త బంతితో స్వింగ్‌తో చెలరేగే అండర్సన్‌ను అడ్డుకోవాలంటే బ్యాట్స్‌మెన్‌కు టెక్నిక్‌తో పాటు అనుభవం కూడా అవసరం. ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గంభీర్‌కు అవకాశం ఇచ్చారు. కానీ ఇంగ్లండ్‌లో అడుగుపెట్టి నెలరోజులు దాటిపోయినా అవకాశం కోసం గంభీర్ కళ్లుకాయలు కాస్తున్నాయి. లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌లో లభించిన మంచి పట్టును ధోనిసేన సౌతాంప్టన్ టెస్టుతో పోగొట్టుకుంది. ఈ సిరీస్‌లో భారత ఓపెనర్ల ప్రదర్శనను గమనిస్తే... విజయ్ తన శైలిని పూర్తిగా వదిలేసి క్రీజులో గంటల తరబడి పాతుకుపోవాలనే లక్ష్యంతో ఆడుతున్నాడు. ఓ రకంగా ఇది ఫలితాన్నిచ్చింది. కానీ రెండో ఎండ్‌లో శిఖర్ ధావన్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 122 పరుగులు మాత్రమే చేశాడు. తన షాట్ సెలక్షన్ దారుణంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యపు షాట్స్ ఆడాడు. ఇది జట్టు మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఒకవేళ లార్డ్స్ టెస్టులో గెలిచిన జట్టును మార్చడం ఇష్టంలేక మూడో మ్యాచ్‌కు ధావన్‌ను కొనసాగించారని అనుకుంటే... ఇప్పటికైనా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అనుభవం ఉన్న గంభీర్‌ను తీసుకోకపోతే భారత్ కచ్చితంగా మరో తప్పు చేసినట్లే. కసి మీద ఉన్నాడు నాగ్‌పూర్ (2012)లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత మళ్లీ గంభీర్‌కు జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఫామ్ కోసం శ్రమించి, రంజీలు ఆడాడు. తన పని అయిపోయిందని విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు సెలక్టర్లకు అనుభవజ్ఞుల అవసరం కనిపించింది. దీంతో గంభీర్‌ను పిలిచారు. కానీ ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితం చేశారు. నిజానికి ఓ అవకాశం వస్తే తనని తాను నిరూపించుకోవాలని గౌతీ కసి మీద ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు విఫలమైతే ఇక గంభీర్ అంతర్జాతీయ కెరీర్‌కు దాదాపుగా తెరపడినట్లే. కాబట్టి ఓ అవకాశం ఇస్తే మేలు..! భారత్‌కు ఉన్న ప్రత్యామ్నాయాలు నాలుగో టెస్టుకు ముందు భారత్ కచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇషాంత్, భువనేశ్వర్ గాయాల నుంచి కోలుకోలేదు. మాంచెస్టర్‌లో వికెట్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అశ్విన్‌ను ఆడించకపోవడం కూడా పెద్ద తప్పే. కాబట్టి నాలుగో టెస్టుకు ముందు భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలను ఓసారి పరిశీలిద్దాం. 1ధావన్ స్థానంలో గంభీర్‌ను తీసుకోవడం. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కావాలనుకుంటే రోహిత్‌ను కొనసాగించి, జడేజా స్థానంలో అశ్విన్‌ను తీసుకోవచ్చు. భువనేశ్వర్ స్థానంలో వరుణ్ ఆరోన్‌కు అవకాశం ఇవ్వొచ్చు. 2 ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటే... జడేజా, అశ్విన్‌లను కొనసాగించి... ఇద్దరే పేసర్ల (షమీ, వరుణ్ ఆరోన్)ను ఆడించడం. 3 ఒకవేళ గంభీర్‌ను తీసుకోకుండా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలంటే... పుజారాను ఓపెనర్‌గా పంపి, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ను ఒక్కో స్థానం పైకి జరపడం. దీనివల్ల రోహిత్ తుది జట్టులో ఉంటాడు. అదే సమయంలో అశ్విన్, జడేజాలతో పాటు ముగ్గురు పేసర్లు ఉంటారు.