న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
లార్డ్స్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ (161 బంతుల్లో 98; 11 ఫోర్లు), బెన్ స్టోక్స్ (94 బంతుల్లో 92; 15 ఫోర్లు; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఏడు వికెట్లకు 354 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ (92 బంతుల్లో 49 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఉన్నాడు.
ఆఖరి ఓవర్ చివరి బంతికి బట్లర్ (126 బంతుల్లో 67; 9 ఫోర్లు) అవుట్ అయ్యాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 103 పరుగులు జత చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అనంతరం కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే ఫామ్‌లో ఉన్న రూట్, స్టోక్స్ ఈ పరిస్థితిలో నిలకడగా ఆడి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 161 పరుగులు జోడించారు. ఈ క్రమంలో తృటిలో తమ శతకాలను కోల్పోయారు. హెన్రీకి మూడు, బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఇంగ్లండ్ 354/7
Published Fri, May 22 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement