వాట్లింగ్ అజేయ సెంచరీ | Watling unbeaten century | Sakshi
Sakshi News home page

వాట్లింగ్ అజేయ సెంచరీ

Published Mon, Jun 1 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

Watling unbeaten century

లీడ్స్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (137 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (72 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మెకల్లమ్ (98 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్),  టేలర్ (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1సిక్స్) రాణించారు. అంతకుముందు 253/5 ఓవర్‌నైట్ స్కోరుతో  ఆదివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 350 పరుగుల వద్దే ఆలౌటైంది. స్టువర్ట్ బ్రాడ్ 46 పరుగులు చేశాడు. సౌతీ 4, బౌల్ట్, క్రెయిగ్ చెరో 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement