kivees
-
వాట్లింగ్ అజేయ సెంచరీ
లీడ్స్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (137 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (72 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మెకల్లమ్ (98 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్), టేలర్ (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1సిక్స్) రాణించారు. అంతకుముందు 253/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 350 పరుగుల వద్దే ఆలౌటైంది. స్టువర్ట్ బ్రాడ్ 46 పరుగులు చేశాడు. సౌతీ 4, బౌల్ట్, క్రెయిగ్ చెరో 2 వికెట్లు తీశారు. -
చివర్లో తడబాటు
♦ కివీస్ చేతిలో భారత్ ఓటమి ♦ అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీ ఇఫో : చివర్లో డిఫెండర్ల అలసత్వం కారణంగా భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. సోమవారం అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2తో ఓడింది. తొలి అరగంట ఆటలో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా... 38వ నిమిషంలో కివీస్ కెప్టెన్ సైమన్ చైల్డ్ చేసిన ఫీల్డ్ గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 43వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే చివర్లో తమకు దక్కిన అవకాశాలను భారత జట్టు వృథా చేసుకుంది. దీనికి తోడు భారత్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ 55వ నిమిషంలో ఆండీ హేవార్డ్ గోల్‌తో కివీస్ నెగ్గింది. భారత్ తమ మూడో మ్యాచ్‌లో 8న మలేసియాతో తలపడుతుంది. -
వెస్టిండీస్ 97/3
కింగ్స్టన్: కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో మూడో రోజు లంచ్ సమయానికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న క్రిస్ గేల్ (115 బంతుల్లో 59 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... అతనితో పాటు చందర్‌పాల్ (10 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. కీరన్ పావెల్ (28) ఫర్వాలేదనిపించగా... కిర్క్ ఎడ్వర్డ్స్ (0), డారెన్ బ్రేవో (0) విఫలమయ్యారు. తొలి టెస్టు ఆడుతున్న ఆఫ్‌స్పిన్నర్ మార్క్ క్రెయిగ్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు రెండో రోజు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 508 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జిమ్మీ నీషామ్ (171 బంతుల్లో 107; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం సాధించగా, వాట్లింగ్ (89) ఆ అవకాశం కోల్పోయాడు. విండీస్ బౌలర్లలో బెన్, షిల్లింగ్‌ఫోర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.