కింగ్‌స్టన్: కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో మూడో రోజు లంచ్ సమయానికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న క్రిస్ గేల్ (115 బంతుల్లో 59 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... అతనితో పాటు చందర్‌పాల్ (10 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. కీరన్ పావెల్ (28) ఫర్వాలేదనిపించగా... కిర్క్ ఎడ్వర్డ్స్ (0), డారెన్ బ్రేవో (0) విఫలమయ్యారు. తొలి టెస్టు ఆడుతున్న ఆఫ్‌స్పిన్నర్ మార్క్ క్రెయిగ్ 2 వికెట్లు తీశాడు.
అంతకుముందు రెండో రోజు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 508 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జిమ్మీ నీషామ్ (171 బంతుల్లో 107; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం సాధించగా, వాట్లింగ్ (89) ఆ అవకాశం కోల్పోయాడు. విండీస్ బౌలర్లలో బెన్, షిల్లింగ్‌ఫోర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
వెస్టిండీస్ 97/3
Published Wed, Jun 11 2014 1:14 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement