♦ కివీస్ చేతిలో భారత్ ఓటమి
♦ అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీ
ఇఫో : చివర్లో డిఫెండర్ల అలసత్వం కారణంగా భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. సోమవారం అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2తో ఓడింది. తొలి అరగంట ఆటలో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా... 38వ నిమిషంలో కివీస్ కెప్టెన్ సైమన్ చైల్డ్ చేసిన ఫీల్డ్ గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 43వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే చివర్లో తమకు దక్కిన అవకాశాలను భారత జట్టు వృథా చేసుకుంది. దీనికి తోడు భారత్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ 55వ నిమిషంలో ఆండీ హేవార్డ్ గోల్‌తో కివీస్ నెగ్గింది. భారత్ తమ మూడో మ్యాచ్‌లో 8న మలేసియాతో తలపడుతుంది.
చివర్లో తడబాటు
Published Tue, Apr 7 2015 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM
Advertisement
Advertisement