భారత్‌దే హాకీ సిరీస్ | Hockey series to india only | Sakshi
Sakshi News home page

భారత్‌దే హాకీ సిరీస్

Published Fri, May 8 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Hockey series to india only

జపాన్‌పై 2-0తో గెలుపు
భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 2-1తో నెగ్గింది. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ గోల్‌గా మలిచాడు. 36వ నిమిషంలో ఆకాశ్ దీప్ గోల్‌తో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

జపాన్ తరఫున 44వ నిమిషంలో వకరి పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రా కాగా... భారత్ రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి... మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement