
PC: Hockey India
India Vs Australia- Hockey Series: ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 1–4తో కోల్పోయింది. అడిలైడ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 4–5తో ఓడింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (24వ, 60వ ని.లో) రెండు గోల్స్... అమిత్ రోహిదాస్ (34వ ని.లో), సుఖ్‌జీత్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
ఆస్ట్రేలియా తరఫున విఖామ్ (2వ, 17వ ని.లో) రెండు గోల్స్.. జలెవ్‌స్కీ (30వ ని.లో), అండర్సన్ (40వ ని.లో), వెటన్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కాగా ఈ సిరీస్‌లో భారత్‌కు ఒకే ఒక్క విజయం దక్కింది. మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది.
తద్వారా ప్రపంచ నంబర్‌వన్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసిన జట్టుగా హర్మన్‌ప్రీత్ బృందం చరిత్ర సృష్టించింది. అయితే తొలి, చివరి రెండు మ్యాచ్‌లలో ఓడి ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది.
చదవండి: Ind Vs Ban: రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల కాదు.. బంగ్లా చేతిలో ఓటమికి కారణం వాళ్లే: భారత దిగ్గజం
మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ