Hockey series
-
భారత్ బదులు తీర్చుకునేనా!
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్లో జర్మనీ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం భారత పురుషుల హాకీ జట్టుకు లభించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో నేడు, రేపు జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పదేళ్ల తర్వాత స్థానిక మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండటం విశేషం. చివరిసారి 2014లో వరల్డ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు ధ్యాన్‌చంద్ స్టేడియం వేదికగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్లో భారత జట్టు 2–3తో జర్మనీ చేతిలో ఓడిపోయి ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీ జట్టు రెండో స్థానంలో, భారత జట్టు ఐదో స్థానంలో ఉన్నాయి. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్ సూపర్ ఫామ్‌లో ఉంది. కెపె్టన్, డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ రాణిస్తే భారత జట్టు పైచేయి సాధించే అవకాశముంది. భారత్, జర్మనీ జట్లు ముఖాముఖిగా ఇప్పటి వరకు 107 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 54 మ్యాచ్‌ల్లో జర్మనీ జట్టు గెలుపొందగా... 26 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు విజయం దక్కింది. మరో 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
భారత్‌కు భారీ ఓటమి
పెర్త్: ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల హాకీ సిరీస్‌ను భారత జట్టు పరాజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి టెస్టులో ఆ్రస్టేలియా 5–1 గోల్స్ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఆరంభంనుంచి చివరి వరకు తమ పట్టు నిలబెట్టుకున్న కంగారూలు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆసీస్ సాధించిన ఐదు గోల్స్‌లో నాలుగు ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. ఆస్ట్రేలియా తరఫున బ్రాడ్ టిమ్ (3వ నిమిషం), వికామ్ టామ్ (20వ ని., 38వ ని.), రింటాలా జోయెల్ (37వ ని.), ఒగిల్వి ప్లయిన్ (57వ ని.) గోల్స్ కొట్టారు. భారత్ తరఫున ఏకైక గోల్‌ను గుర్జంత్ సింగ్ (47వ ని.) నమోదు చేశాడు. మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే లాంగ్ పాస్ అందుకున్న బ్రాడ్... భారత ఆటగాడు జర్మన్‌ప్రీత్‌ను దాటి గోల్ పోస్ట్‌ను ఛేదించడంలో సఫలమయ్యాడు. 10వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ దక్కినా అది గోల్‌గా మారలేదు. ఆ తర్వాత ఆసీస్ భారత డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచిన ఆసీస్ మూడో క్వార్టర్లోనూ దూకుడు సాగించింది. అయితే చివరి క్వార్టర్లో కోలుకున్న భారత్ ప్రతిఘటించింది. రెండు నిమిషాలకే రాహిల్ ఇచి్చన పాస్‌ను అందుకున్న గుర్జంత్ దానిని గోల్‌గా మలిచాడు. కొద్ది సేపటికే పెనాల్టీ వచి్చనా భారత్ దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నేడు జరుగుతుంది. -
Ind Vs Aus: భారత జట్టుకు మరో ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
India Vs Australia- Hockey Series: ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 1–4తో కోల్పోయింది. అడిలైడ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 4–5తో ఓడింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (24వ, 60వ ని.లో) రెండు గోల్స్... అమిత్ రోహిదాస్ (34వ ని.లో), సుఖ్జీత్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆస్ట్రేలియా తరఫున విఖామ్ (2వ, 17వ ని.లో) రెండు గోల్స్.. జలెవ్‌స్కీ (30వ ని.లో), అండర్సన్ (40వ ని.లో), వెటన్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కాగా ఈ సిరీస్‌లో భారత్‌కు ఒకే ఒక్క విజయం దక్కింది. మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. తద్వారా ప్రపంచ నంబర్‌వన్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసిన జట్టుగా హర్మన్‌ప్రీత్ బృందం చరిత్ర సృష్టించింది. అయితే తొలి, చివరి రెండు మ్యాచ్‌లలో ఓడి ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది. చదవండి: Ind Vs Ban: రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల కాదు.. బంగ్లా చేతిలో ఓటమికి కారణం వాళ్లే: భారత దిగ్గజం మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ -
ఆరేళ్ల తర్వాత ఆసీస్‌పై భారత్ తొలి విజయం.. చివరి నిమిషంలో..
అడిలైడ్: ప్రపంచ నంబర్‌వన్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై భారత జట్టు ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్... సిరీస్‌లో నిలబడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. చివరకు 4–3 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 1–2కి తగ్గించింది. నాలుగో మ్యాచ్ శనివారం జరుగుతుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (12వ ని.లో), అభిషేక్ (47వ ని.లో), షంషేర్ సింగ్ (57వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్(60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఆకాశ్‌దీప్ చివరి నిమిషంలో.. మ్యాచ్ చివరి నిమిషంలో ఆకాశ్‌దీప్ గోల్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా తరఫున జాక్ వెల్చ్ (25వ ని.లో), ఆరాన్ జలెవ్‌స్కీ (32వ ని.లో), నాథన్ ఎఫరాముస్ (59వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నిర్ణీత సమయంలోపు ఫలితం తేలిన మ్యాచ్‌ల్లో భారత్ చివరిసారి 2016 నవంబర్ 29న ఆస్ట్రేలియాపై 3–2తో గెలిచింది. అనంతరం ఈ రెండు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 10 సార్లు ఆసీస్ నిర్ణీత సమయంలోపు నెగ్గగా... నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిసి వర్గీకరణ పాయింట్ల కోసం పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం నిర్ణయించిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. మరో మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. చదవండి: Lionel Messi: ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా! అయినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ! Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే.. -
దక్షిణ కొరియా హాకీ సిరీస్‌కు రజని
న్యూఢిల్లీ: మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటించే భారత హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు రాణి రాంపాల్ నాయకత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జిన్‌చున్ నగరం వేదికగా జరిగే ఈ సిరీస్‌లో కొరియా జట్టుతో భారత్ మే 20, 22, 24 తేదీల్లో తలపడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత మహిళల జట్టు స్పెయిన్, ఐర్లాండ్, మలేసియాలలో పర్యటించింది. స్పెయిన్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని ఒక దాంట్లో ఓడిపోయింది. మలేసియాతో జరిగిన సిరీస్‌లో భారత్ 4–0తో గెలిచింది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్‌కీపర్లు), రాణి రాంపాల్ (కెప్టెన్), సలీమా, సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, కరిష్మా యాదవ్, గుర్జీత్ కౌర్, సుశీలా చాను, మోనిక, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మిన్జ్, వందన కటారియా, లాల్రెమ్సియామి, జ్యోతి, నవనీత్ కౌర్. -
భారత్ అజేయంగా
కౌలాలంపూర్: మలేసియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్ 1–0తో మలేసియాపై గెలుపొందింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 35వ నిమిషంలో నవ్‌జ్యోత్ కౌర్ సాధించింది. ఈ సిరీస్‌లో భారత్ వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3–0, 5–0, 4–4, 1–0 గోల్స్‌తో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి 4–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆరంభంలో ఇరు జట్లు పోటాపోటీగా తలపడటంతో రెండు క్వార్టర్ల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే మూడో క్వార్టర్లో నవ్‌జ్యోత్ కౌర్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. ఆధిక్యాన్ని దక్కించుకున్న భారత మహిళలు ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంపై కోచ్ జోయెర్డ్ మరీనే మాట్లాడుతూ ‘ భారత్ గోల్ చేసే అవకాశాలు సృష్టించుకున్న తీరు అభినందనీయం. ప్రత్యర్థి గోల్ ఏరియాలోకి చాలా సార్లు దూసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచాం. కానీ పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచలేకపోతున్నాం. దీనిపై దృష్టి సారించాలి’ అని పేర్కొన్నాడు. ఓవరాల్‌గా ఈ టూర్ యువ క్రీడాకారిణులకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’ అన్నారు. -
భారత్‌దే సిరీస్
కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 1–0 తో మలేసియాపై విజయం సాధించింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా లాల్రెమ్సియామి చేసిన గోల్‌తో భారత్‌ను విజయం వరించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు భారత్ ఆడిన మూడు గేముల్లో రెండింటిలో గెలిచి మరోటి డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మలేసియా హోరాహోరీగా పోరాడింది. తొలి నిమిషంలోనే పెనాల్టీకార్నర్‌ను గెలుచుకుంది. అయితే భారత గోల్‌కీపర్ సవిత చాకచక్యంగా వ్యవహరించడంతో మలేసియాకు గోల్ దక్కలేదు. మరోవైపు భారత్ కూడా తమకు అందివచ్చిన ఐదు పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకుంది. దీంతో తొలి మూడు క్వార్టర్స్ గోల్ లేకుండానే ముగిసిపోయాయి. నాలుగో క్వార్టర్లో ఇరుజట్లు గోల్ కోసం దాడులు ఉధృతం చేశాయి. ఆట 55వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ అందించిన పాస్‌ను లాల్రెమ్సియామి అద్భుతంగా డైవ్ చేస్తూ గోల్‌గా మలిచి భారత శిబిరంలో ఆనందం నింపింది. -
ఓటమి తప్పించుకున్న భారత మహిళలు
కౌలాలంపూర్: ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భాగంగా మలేసియాతో జరగుతోన్న మూడో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తొలిసారి తడబాటుకు గురైంది. అనవసర తప్పిదాలతో ఓటమి ముంగిట నిలిచిన భారత్... ఆ తర్వాత గొప్పగా పుంజుకొని మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. సోమవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 4–4తో డ్రా అయింది. భారత్ తరఫున నవ్‌నీత్ (22వ ని., 45వ ని.) రెండు గోల్స్‌తో భారత్‌ను ఆదుకోగా... నవ్‌జ్యోత్ కౌర్ (13వ ని.), లాల్రెమ్సియామి (54వ ని.) చెరో గోల్ సాధించారు. మలేసియా తరఫున నురైనీ రషీద్ 2 గోల్స్ సాధించింది. గుర్దీప్ కిరణ్‌దీప్ (26వ ని.), నురామిరా జుల్కిఫ్లీ (35వ ని.) ఒక్కో గోల్ స్కోర్ చేశారు. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత్... ఈ మ్యాచ్ ఆరంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో నవ్‌జ్యోత్, రెండో క్వార్టర్లో నవ్‌నీత్ గోల్ చేయడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే మరో నాలుగు నిమిషాల్లోనే గుర్దీప్ చేసిన గోల్‌తో మలేసియా 1–2తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ సిరీస్‌లో మలేసియాకు ఇదే తొలి గోల్ కావడం విశేషం. తర్వాత మలేసియా జోరు పెంచగా... భారత రక్షణ పంక్తి అనవసర తప్పిదాలు చేస్తూ ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్లను సమర్పించుకుంది. మూడో క్వార్టర్లో లభించిన మూడు పెనాల్టీ కార్నర్లను నురానీ రషీద్, నుమామిరా గోల్స్‌గా మలచడంతో మలేసియా 4–2తో భారత్‌ను వెనక్కి నెట్టేసింది. అయితే చివరి క్వార్టర్లో నవ్‌నీత్, లాల్రెమ్సియామి అద్భుత గోల్స్‌తో ఆకట్టుకోవడంతో భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. -
న్యూజిలాండ్‌పై భారత్ హ్యాట్రిక్
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 4–0తో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (8వ ని.లో), సురేందర్ కుమార్ (15వ ని.లో), మన్దీప్ సింగ్ (44వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (60వ ని.లో) ఒక్కోగోల్ చేశారు. తొలి క్వార్టర్లో వచ్చిన రెండో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూపిందర్ భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించాడు. ఈ సిరీస్‌లో రూపిందర్‌కు ఇది నాలుగో గోల్ కావడం విశేషం. అనంతరం రూపిందర్ ఇచ్చిన పాస్‌ను ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ సురేందర్ గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మూడో క్వార్టర్లో వెటరన్ ప్లేయర్ సర్దార్ సింగ్ ఇచ్చిన చక్కటి పాస్‌ను మన్దీప్ గోల్‌గా మలిచాడు. మరి కొద్ది క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ఆకాశ్‌దీప్ మరో గోల్‌తో భారత్‌కు విజయాన్నందించాడు. -
భారత్ క్లీన్‌స్వీప్
భోపాల్: బెలారస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఆట ఆరో నిమిషంలో వందన కటారియా చేసిన గోల్ తో భారత్ ఖాతా తెరిచింది. 15వ నిమిషం లో గుర్జిత్ కౌర్ భారత్‌కు రెండో గోల్‌ను అందించింది. బెలారస్ ప్లేయర్ యూలియా 52వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. అయితే 55వ నిమిషంలో భారత కెప్టెన్ రాణి రాంపాల్ గోల్‌తో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత్‌కు రెండో విజయం
భోపాల్: బెలారస్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 2–1తో గెలిచింది. భారత్ తరఫున రాణి రాంపాల్ (9వ నిమిషంలో), లాల్రెమ్సియామి (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... బెలారస్ జట్టుకు స్వియాత్లానా బహుషివిచ్ ఏకైక గోల్ అందించింది. -
భారత్, ఆసీస్ హాకీ సిరీస్ సమం
మెల్బోర్న్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత్ 1-1తో ముగించింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన భారత్... బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 3-4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (6వ ని.లో) ఒక గోల్ చేయగా... రఘునాథ్ (22వ, 25వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు నుంచి టెంట్ మిటన్ (13వ ని.లో), జేక్ వెటన్ (23వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... జెరెమీ హేవార్డ్ (38వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
భారత్‌కు రెండో ఓటమి
మర్లో (ఇంగ్లండ్): బ్రిటన్‌తో జరుగుతున్న హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌ను 0-2తో కోల్పోయిన భారత్... రెండో మ్యాచ్‌లో 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. బ్రిటన్ తరఫున లెగ్, కులెన్ ఒక్కో గోల్ చేయగా... భారత్‌కు దీప్ గ్రేస్ ఎక్కా గోల్‌ను అందించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-2తో వెనుకబడి ఉంది. -
సిరీస్ భారత్ కైవసం
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ 1-1 తో డ్రా ముగియడంతో సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. సర్ధార్ సింగ్ నేతృత్వంలోని భారత్ రెండు, మూడు టెస్టుల్లో గెలవడంతో సిరీస్ ను 2-1 తేడాతో సాధించింది. తొలి టెస్టులో మాత్రమే గెలిచిన న్యూజిలాండ్ ఆపై వరుసగా రెండు మ్యాచ్ లను కోల్పోయింది. నాలుగో టెస్టులో గెలిచి సిరీస్ ను డ్రా చేయాలని భావించిన న్యూజిలాండ్ కు నిరాశే ఎదురైంది. ఆట 11వ నిమిషంలో భారత ఆటగాడు రూపేందర్ పాల్ సింగ్ కు పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అయితే 41 నిమిషంలో ఎడ్వర్డ్స్ ఇచ్చిన పాస్ ను అందుకున్న రోజ్ గోల్ గా మలచడంతో న్యూజిలాండ్ 1-0 తో ముందంజ వేసింది. ఆ తరువాత 43 నిమిషంలో భారత ఆటగాడు సునీల్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. అటు తరువాత న్యూజిలాండ్ ఎటాకింగ్ ను భారత్ అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. దీంతో సిరీస్ భారత్ వశమైంది. -
సర్దార్ సింగ్‌కే పగ్గాలు
కివీస్ పర్యటనకు భారత హాకీ జట్టు ప్రకటన న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరిగే ఆరు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. గోల్ కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 2 నుంచి 11 వరకు జరిగే ఈ పర్యటనలో ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్‌చర్చ్ నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. తొలి రెండు మ్యాచ్‌లను న్యూజిలాండ్ ‘ఎ’తో ఆడనున్న భారత్, తర్వాతి నాలుగు మ్యాచ్‌లను న్యూజిలాండ్ జాతీయ జట్టుతో తలపడుతుంది. స్థానిక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో నిర్వహించిన శిక్షణ శిబిరం అనంతరం ఈ జట్టును ఎంపిక చేశారు. ‘గత రెండు వారాల్లో సమన్వయం, పాస్‌లు ఇచ్చి పుచ్చుకోవడం అంశాలపై సాధన చేశాం. ‘డి’ ఏరియాలోకి వెళితే గోల్ చేసే అవకాశాలను వదులుకోవద్దనే అంశంపై కూడా కసరత్తు చేశాం’ అని హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్, జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ తెలిపారు. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేష్, హర్జోత్ సింగ్ (గోల్ కీపర్లు), బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, వీఆర్ రఘునాథ్, జస్జీత్ సింగ్ కులార్, రూపిందర్ పాల్ సింగ్, గుర్జిందర్ సింగ్ (డిఫెండర్లు), సర్దార్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, ఎస్కే ఉతప్ప, సత్బీర్ సింగ్, దేవిందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్ (మిడ్ ఫీల్డర్లు), ఎస్వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, నికిన్ తిమ్మయ్య (ఫార్వర్డ్స్). -
భారత్‌దే హాకీ సిరీస్
జపాన్‌పై 2-0తో గెలుపు భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 2-1తో నెగ్గింది. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ గోల్‌గా మలిచాడు. 36వ నిమిషంలో ఆకాశ్ దీప్ గోల్‌తో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జపాన్ తరఫున 44వ నిమిషంలో వకరి పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రా కాగా... భారత్ రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి... మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. -
చివరి మ్యాచ్ ‘డ్రా’
చన్‌చన్‌దేవి రెండు గోల్స్ భారత్, ఐర్లాండ్ మహిళల హాకీ సిరీస్ డబ్లిన్: ఎఫ్ఐహెచ్ చాంపియన్స్ చాలెంజ్ టోర్నీ సన్నాహాల్లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌ను టీమిండియా 2-2తో ‘డ్రా’గా ముగించింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ క్రీడాకారిణి చన్‌చన్‌దేవి రెండు గోల్స్ చేసింది. అనా ఒ ఫ్లాంగన్ ఐర్లాండ్‌కు రెండు గోల్స్ అందించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. ఏడో నిమిషంలో ఐర్లాండ్ ప్లేయర్ ఒ ఫ్లాంగన్ గోల్ చేయగా, 31వ నిమిషంలో చన్‌చన్‌దేవి (భారత్) స్కోరును సమం చేసింది. రెండో అర్ధభాగంలో గోల్స్ కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే పెనాల్టీ కార్నర్‌ను చక్కని గోల్‌గా మలిచిన చన్‌చన్‌దేవి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. కానీ 64వ నిమిషంలో ఒ ఫ్లాంగన్ రెండో గోల్ సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 3-1తో, రెండో మ్యాచ్‌లో 2-1తో నెగ్గింది.