సిరీస్ భారత్ కైవసం | India hold NZ to 1-1 draw, win Test series 2-1 | Sakshi
Sakshi News home page

సిరీస్ భారత్ కైవసం

Published Sun, Oct 11 2015 2:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

సిరీస్ భారత్ కైవసం

సిరీస్ భారత్ కైవసం

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్  కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ 1-1 తో డ్రా ముగియడంతో సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది.  సర్ధార్ సింగ్ నేతృత్వంలోని భారత్ రెండు, మూడు టెస్టుల్లో గెలవడంతో సిరీస్ ను 2-1 తేడాతో సాధించింది. తొలి టెస్టులో మాత్రమే గెలిచిన న్యూజిలాండ్ ఆపై వరుసగా రెండు మ్యాచ్ లను కోల్పోయింది.

నాలుగో టెస్టులో గెలిచి  సిరీస్ ను డ్రా చేయాలని భావించిన న్యూజిలాండ్ కు నిరాశే ఎదురైంది. ఆట 11వ నిమిషంలో  భారత ఆటగాడు రూపేందర్ పాల్ సింగ్ కు పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు.  అయితే 41 నిమిషంలో ఎడ్వర్డ్స్ ఇచ్చిన పాస్ ను అందుకున్న రోజ్ గోల్ గా మలచడంతో  న్యూజిలాండ్ 1-0 తో ముందంజ వేసింది. ఆ తరువాత 43 నిమిషంలో భారత ఆటగాడు సునీల్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు.  అటు తరువాత న్యూజిలాండ్ ఎటాకింగ్ ను భారత్ అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు.  దీంతో సిరీస్ భారత్ వశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement