శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా ప్రస్తుతం సెలవులో ఉంది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇక శ్రీలంక పర్యటనకు దూరంగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. బంగ్లాతో సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ భారత పేస్ గుర్రానికి మరి కొన్ని రోజుల పాటు విశ్రాంతిని పొడిగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుమ్రా నేరుగా ఆక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
అర్షదీప్ అరంగేట్రం?
ఇక బుమ్రా గైర్హజరీ నేపథ్యంలో యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు అవకాశమివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైట్‌బాల్ క్రికెట్‌లో తానెంటో నిరూపించుకున్న అర్షదీప్.. ఇప్పుడు టెస్టుల్లో కూడా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాతో టెస్టు సిరీస్‌లో సిరాజ్‌తో కలిసి అర్షదీప్ బంతిని పంచుకునే అవకాశముంది. టీ20 ప్రపంచకప్-2024లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ పంజాబీ క్రికెటర్.. శ్రీలంక పర్యటనలోనూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునివ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ సిరీస్‌తో దాదాపు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు పేసర్లు ఖాలీల్ అహ్మద్, యశ్ దయాల్ పేర్లను కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది
Comments
Please login to add a commentAdd a comment