
న్యూఢిల్లీ: మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటించే భారత హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు రాణి రాంపాల్ నాయకత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జిన్‌చున్ నగరం వేదికగా జరిగే ఈ సిరీస్‌లో కొరియా జట్టుతో భారత్ మే 20, 22, 24 తేదీల్లో తలపడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత మహిళల జట్టు స్పెయిన్, ఐర్లాండ్, మలేసియాలలో పర్యటించింది. స్పెయిన్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని ఒక దాంట్లో ఓడిపోయింది. మలేసియాతో జరిగిన సిరీస్‌లో భారత్ 4–0తో గెలిచింది.
భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్‌కీపర్లు), రాణి రాంపాల్ (కెప్టెన్), సలీమా, సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, కరిష్మా యాదవ్, గుర్జీత్ కౌర్, సుశీలా చాను, మోనిక, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మిన్జ్, వందన కటారియా, లాల్‌రెమ్‌సియామి, జ్యోతి, నవనీత్ కౌర్.
Comments
Please login to add a commentAdd a comment