Rajni
-
విహంగ విహారి
త్రి సముద్ర తోయ పీత వాహన... ఇది గౌతమీ పుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదు. దీనర్థం మూడు సముద్రాల నీటిని తాగిన గుర్రాన్ని వాహనంగా కలిగిన వాడు అని. ఇక్కడ కవి భావం గుర్రం సముద్రం నీటిని తాగిందని కాదు. ఈ మూడు సముద్రాల మధ్యన ఉన్న ప్రదేశాన్నంతటినీ జయించిన వాడు అని అర్థం. మరి... ఈ మూడు సముద్రాల మధ్యనున్న భూభాగాన్ని ఆద్యంతం పర్యటించిన టూరిస్టును ఏమనాలి? వీటితోపాటు ఖండాలు దాటి విహరించిన విహారిని ఏమనాలి? విశ్వ విహారి అనవచ్చా? ‘‘మరో రెండు ఖండాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ విశేషణానికి అర్హత లభిస్తుంది. మరో మూడు– నాలుగేళ్లలో అవి కూడా పూర్తి చేస్తాను’’ అంటున్నారు రజని లక్కా. గుంటూరులో పుట్టి, అనంతపూర్‌లో మెట్టి, బళ్లారిలో స్థిరపడిన మన తెలుగింటి మహిళ రజని. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆమె తన పర్యాటక అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘స్విమ్మింగ్ కోచ్‌గా నేను ఏడాదిలో పది నెలలు టైట్ షెడ్యూల్స్‌తో పనిచేస్తాను. వెకేషన్ నన్ను బూస్టప్ చేస్తుంది. అందుకే ఏటా తప్పకుండా నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఏదో ఒక టూర్ చేస్తాను. అన్నవరం నుంచి అమెరికా వరకు, కూర్గ్ నుంచి కెనడా వరకు ప్రతి పర్యటన నుంచి దానికదే ప్రత్యేకమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాను. మన దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, కోటలు, సరస్సులు, సముద్రాలు, జలపాతాలను చాలా వరకు చూసేశాను. కృష్ణుడు పుట్టిన మధుర, రాజ్యమేలిన బేట్ ద్వారక, ప్రాణత్యాగం చేసిన వేరావల్ నా పర్యటనలో భాగాలయ్యాయి. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, తూర్పున పూరీ పట్టణం నుంచి పశ్చిమాన సోమనాథ్ వరకు... దాదాపుగా ప్రతి వంద కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశాననే చెప్పాలి. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక ఖండాల విషయానికి వస్తే ఇప్పటి వరకు నా విహారంలో నాలుగు ఖండాలను చూశాను. ఆఫ్రికా పర్యటన ఒకసారి వాయిదా పడింది. మళ్లీ త్వరలోనే ప్లాన్ చేసుకుంటాను. ఇక భవిష్యత్తులో సౌత్ అమెరికాను చూడాలి. వ్యవస్థ పనిచేస్తుంది ఇన్ని దేశాలను చూసిన తర్వాత మనకు వాళ్లకు ఉన్న ప్రధానమైన తేడా సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్లో కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో మా మనుమరాలి పాస్‌పోర్ట్ కోసం వెళ్తే... మనకిచ్చిన స్లాట్ టైమ్‌కి వెళ్తే ఒక నిమిషంలో పాపను ఫొటో తీసి ‘ఫినిష్డ్’ అని పంపించేశారు. పాస్‌పోర్ట్ ఇంటికి వచ్చింది. అప్పుడు నాకు మన దగ్గర పాస్‌పోర్ట్ కోసం పడాల్సిన ప్రయాస గుర్తుకొచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ కూడా అంతే. మన టైమ్‌కి మనం వెళ్లేసరికి మనకంటే ముందు ఒకరు, మన పరీక్షలు పూర్తయ్యేటప్పటికి ఒకరో ఇద్దరో వచ్చి ఉంటారు. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా హాస్పిటల్లో గంటలకు గంటలు వెయిట్ చేయించే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో మన డాక్యుమెంట్లు కచ్చితంగా ఉంటే ‘ఎస్’ అంటారు, తేడా ఉంటే ‘నో’ అంటారు. అంతే తప్ప లంచంతో పని జరగడం ఉండదు. దొడ్డ విశ్వాసం పాశ్చాత్యదేశాల్లో ఓల్డ్పీపుల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం అంటే... వాళ్లు ఒకరి సహాయం కోసం ఎదురు చూడరు. ఎనభై ఏళ్ల మహిళ కూడా తన కారు తనే డ్రైవ్ చేసుకుని వెళ్తుంటుంది. కారులో సామాను దించుకోవడానికి కూడా ఎవరి కోసమూ చూడరు. హోటల్ వంటి బహిరంగ ప్రదేశాల్లో వాళ్లకు అవసరమైన వస్తువు అందించబోయినా కూడా సహాయం తీసుకోరు. చక్కటి చిరునవ్వుతో స్నేహపూర్వకంగా నవ్వి సున్నితంగా తిరస్కరించి, వాళ్లే చేసుకుంటారు. మన దగ్గర వయసులో ఉన్న వాళ్లు కూడా తమ పనులు తాము చేసుకోకుండా సహాయకుల్ని పెట్టుకోవడాన్ని దర్పంగా భావిస్తారు. అక్కడ పని చేసుకోవడాన్ని గౌరవిస్తారు. మనం నేర్చుకోవాల్సిన విషయం అది. పాశ్చాత్య సమాజంలో మరొక గొప్ప సంగతి కూడా గమనించాను... అక్కడ ఒక మనిషికి ఆ వ్యక్తి హోదాలను బట్టి గౌరవం ఇవ్వడం అనేది ఉండదు. కంపెనీ సీఈఓ అయినా అటెండర్ అయినా, స్వీపర్ అయినా ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం సమానంగా ఉంటుంది. అక్కడ హోదా ప్రదర్శన కూడా కనిపించదు. వర్షం పడుతుంటే మన దగ్గర ఎస్సైకి కానిస్టేబుల్ గొడుగు పట్టుకోవడాన్ని చూస్తుంటాం. అక్కడ ప్రధానమంత్రి అయినా సరే తన గొడుగు తనే పట్టుకుంటాడు. విరిగిన కొండ చరియ ప్రపంచంలో నచ్చిన ప్రదేశాల్లో మొదటిది న్యూజిలాండ్, రెండవది కెనడా, మూడవది స్విట్జర్లాండ్. నా పర్యటన ప్లాన్‌లో గుల్మార్గ్ ఉంది. స్నోఫాల్ చూడటానికి విదేశాలకు వెళ్లడం ఏమిటి? మనదేశంలోనే చూడాలనేది నా పట్టుదల. మానస సరోవర్ యాత్రకు వయసు సహకరిస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాను. పర్యటనల్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగని కాలు బయటపెట్టకుండా ఉండలేం కదా! మనం రోజూ ప్రయాణం చేసే రోడ్డు మీదనే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు. పనులు మానుకుని నాలుగ్గోడలకు పరిమితం కాలేం కదా! కేదార్నాథ్ పర్యటన సమయంలో ఉన్నట్లుండి కొండ చరియ విరిగి పడింది. దారి పొడవునా రెçస్క్యూ సిబ్బంది ఉంటారు. వెంటనే రోడ్డు క్లియర్ చేస్తారు. అయితే కొండ చరియలు మరీ ఎక్కువగా పడినప్పుడు ఒకటి రెండు రోజులు వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఆ సంఘటన తర్వాత నేనేమీ పర్యటనలు ఆపలేదు. ఈ ఏడాది జూలైలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు ముందుగా అమర్నాథ్ యాత్రకు వెళ్లాను. నా జీవిత ధ్యేయం ఒక్కటే... శక్తి ఉన్నంత వరకు పని చేస్తాను, మానసికంగా రిఫ్రెష్ కావడానికి పర్యటనలు చేస్తూ ఉంటాను. మనిషి పక్షిలా విహరించాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆహ్లాదంగా జీవించగలుగుతారు.’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ‘భలే’బీడు గోదావరి పుట్టిన త్రయంబకేశ్వర్, కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్, హిమాలయాల నుంచి మైదానానికి దారి తీసే రొహతాంగ్ పాస్, కేదార్నాథ్, బదరీనాథ్, హరిద్వార్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, అమర్నాథ్... ఇలా ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలన్నీ చూడగలిగాను. ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఆలయాలు అద్భుతంగా ఉంటాయి. శిల్ప సౌందర్యంలో కర్ణాటకలోని హలేబీడు, బేలూరుకి మించినది కాదు కదా సరిపోలేది కూడా మరోటి లేదనిపించింది. పిల్లలను టూర్లకు తీసుకెళ్లే వాళ్లకు నేను చెప్పేదొక్కటే...విదేశీ పర్యటనలకంటే ముందు పిల్లలకు ఇండియాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను చూపించండి. అప్పుడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వాళ్లకు సులువవుతుంది. ఇండియా గొప్పతనం తెలుసుకున్న తర్వాత విదేశాలను చూస్తే పర్యాటకం ద్వారా కలిగే విజ్ఞానంలో పరిపూర్ణత ఉంటుంది. – రజని లక్కా, స్విమ్మింగ్ చాంపియన్ రజని చెప్పిన మరికొన్ని విషయాలు ఇండియా తర్వాతనే... ప్రపంచ పర్యటనకంటే ముందు మనదేశాన్ని దాదాపుగా చుట్టేసి ఉండడంతో విదేశాల్లో నేను చూసిన ప్రతి ప్రదేశాన్నీ ఇండియాలో ఏదో ఒక ప్రదేశంతో బేరీజు వేసుకోవడం అలవాటైంది. ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటెయిన్స్ దగ్గర త్రీ సిస్టర్స్ అనేవి నీటి కోత కారణంగా ఏర్పడిన రాతి శిఖరాలు. అది గొప్ప ప్రకృతి అద్భుతమే, అయితే మా బళ్లారికి అరవై కిలోమీటర్ల దూరాన ఉన్న హంపి దగ్గర మాతంగ కొండలు కూడా అలాగే ఉంటాయి. పైగా ఎన్ని శిఖరాలుంటాయో... లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదు. పర్యాటక సంపదను ప్రమోట్ చేసుకోవడంలో మనం వెనుకబడిపోయాం. ప్రభుత్వం ఓ రెండు దశాబ్దాలుగా ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది కానీ ఇంకా ఇంప్రూవ్ కాలేదు. పాశ్చాత్యులు ఈ విషయంలో చాలా ముందున్నారు. నయాగరా వాటర్ ఫాల్స్‌ని అమెరికా వైపు నుంచి కెనడా వైపు నుంచి కూడా చూశాను. గొప్ప జలపాతమే కానీ మన దగ్గర జోగ్ జలపాతం, హోగెనక్కల్ జలపాతాల సౌందర్యం కూడా నయాగరాకు ఏ మాత్రం తీసిపోదు. జోగ్ ఫాల్స్‌ని ఇండియన్ నయాగరా అంటారు. శ్వేత సౌందర్యం విషయంలో స్విట్జర్లాండ్‌ను చెప్పుకుంటారు. కానీ అది కశ్మీర్‌ను మించినదేమీ కాదని నా అభిప్రాయం. ఇన్ని ప్రదేశాల్లో నన్ను నిరుత్సాహపరిచిన ప్లేస్ జైపూర్. చిన్నçప్పుడు పింక్ సిటీ అని చదివినప్పుడు చాలా గొప్పగా ఊహించుకున్నాను. చూసినప్పుడు ఆ స్థాయి సంతృప్తి కలగలేదు. మన కోహినూర్ టవర్ ఆఫ్ లండన్‌లోని జువెల్ హౌస్‌లో రాజకుటుంబీకులు వాడిన వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. కోహినూర్ వజ్రంతోపాటు భారత్ నుంచి తీసుకువెళ్లిన పెద్ద పెద్ద బంగారు పళ్లాలు, స్పూన్లు, ఇతర పాత్రలు, అనేక వస్తువులను చూసినప్పుడు తీవ్రమైన బాధ మనసుని పిండేసింది. మన దగ్గర ఉండాల్సిన వాటిని తీసుకెళ్లిపోవడమేకాక వాటిని దర్జాగా ప్రదర్శనలో పెట్టుకున్నారని కూడా అనిపించింది. దేశదేశాల వాళ్లు వాటిని అబ్బురంగా చూడడాన్ని గమనించిన తర్వాత అవి అక్కడ ఉండడమే మంచిదనుకున్నాను. అవన్నీ మన దగ్గరే ఉండి ఉంటే వెంకటేశ్వరుడి నగల్లాగ ఒక్కొటొక్కటిగా మాయమై ఉండేవేమో. బ్రిటిష్ వాళ్లు వాటిని చక్కగా పరిరక్షించి, ప్రపంచమంతటికీ చూపిస్తున్నారు. పైగా వాళ్ల మ్యూజియం నిర్వహణ తీరు చాలా బాగుంది. బంగారు కొండ ఎన్ని ఖండాలు చూసినా... ఇండియాలో ఉన్నన్ని ప్రకృతి అద్భుతాలు మరే దేశంలోనూ ఉండవనే నా నమ్మకం. బద్రీనాథ్ పర్యటన అయితే నా జీవితంలో మర్చిపోలేను. సూర్యోదయం సమయంలో కొండ బంగారు రంగులోకి మారుతుంది. ఆ సుందర దృశ్యం కొద్ది సెకన్లు మాత్రమే ఉంటుంది. ఉదయం ఐదు ముప్పావుకి లొకేషన్‌కి వెళ్తే ఆ అద్భుతాన్ని చూడవచ్చు. అయితే దానికి కూడా అదృష్టం ఉండాలంటారు. మనం వెళ్లిన రోజు ఆకాశం మబ్బులు పట్టి ఉంటే ఆ అద్భుతాన్ని చూడలేం. విదేశీయులు ఈ సుందర దృశ్యాన్ని చూడటానికే వస్తారు. పర్యటనల పట్ల విదేశీయులు చూపినంత ఆసక్తి మనవాళ్లు చూపించరు. కెనడాలో మాట్రియల్ సిటీ నుంచి క్యుబెక్ సిటీకి బస్‌లో వెళ్లాను. ఆ బస్‌లో ప్రయాణించిన పదిహేను మందిలో పది దేశాల వాళ్లున్నారు. ఎక్కువగా సోలో ట్రావెలర్సే. పర్యాటకుల క్షేమమే ప్రధానం ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మనకు ఎక్కడ లేని ఉత్కంఠ. మ్యాచ్ పూర్తయిన తర్వాత టపాకాయల మోత చెవుల్ని చిల్లులు చేస్తుంటుంది. వెస్టర్న్ కంట్రీస్‌లో భారతీయులు, పాకిస్తానీయులు ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీవీలో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తారు. కెనడా వెళ్లినప్పుడు టొరంటోలో టాక్సీ ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్ పాకిస్తానీ అని తెలిసినప్పుడు ఒక్క క్షణం భయమేసింది. ఇక్కడ మనం ఏర్పరచుకున్న అభిప్రాయమే నా భయానికి కారణం. కానీ అతడు చాలా స్నేహంగా మాట్లాడాడు. శ్రీనగర్‌లో సరస్వతి ఆలయాన్ని చూడాలనుకున్నప్పుడు ఊహించని పరిస్థితి ఎదురైంది. మా టూరిస్ట్ గ్రూప్‌కి క్యాబ్‌లు పెట్టిన డ్రైవర్లందరూ ఒకే మాటగా ఆ ఆలయానికి వద్దన్నారు. అది నమాజ్ టైమ్ అని, ఆ సమయంలో వెళ్తే రాళ్లు రువ్వుతారని చెప్పారు. తమకు పర్యాటకుల క్షేమమే ప్రధానమని కూడా చెప్పారు. మేము చూడాలని పట్టుపట్టడంతో మూడు గంటల తర్వాత నమాజ్ పూర్తయి వెళ్లిపోతారు అప్పుడు తీసుకెళ్తామని చెప్పి అలాగే చేశారు. ఆ ట్యాక్సీ డ్రైవర్లు కూడా ముస్లింలే. -
దక్షిణ కొరియా హాకీ సిరీస్‌కు రజని
న్యూఢిల్లీ: మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటించే భారత హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు రాణి రాంపాల్ నాయకత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జిన్‌చున్ నగరం వేదికగా జరిగే ఈ సిరీస్‌లో కొరియా జట్టుతో భారత్ మే 20, 22, 24 తేదీల్లో తలపడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత మహిళల జట్టు స్పెయిన్, ఐర్లాండ్, మలేసియాలలో పర్యటించింది. స్పెయిన్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని ఒక దాంట్లో ఓడిపోయింది. మలేసియాతో జరిగిన సిరీస్‌లో భారత్ 4–0తో గెలిచింది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్‌కీపర్లు), రాణి రాంపాల్ (కెప్టెన్), సలీమా, సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, కరిష్మా యాదవ్, గుర్జీత్ కౌర్, సుశీలా చాను, మోనిక, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మిన్జ్, వందన కటారియా, లాల్రెమ్సియామి, జ్యోతి, నవనీత్ కౌర్. -
‘కామన్వెల్త్’కు రజని
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ నేతృత్వంలో 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్ కీపర్ ఇతిమరపు రజనికి చోటు దక్కింది. ఈ జట్టుకు ప్రధాన గోల్ కీపర్ సవిత వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఈ ప్రతిష్టాత్మక క్రీడలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా జరిగే హాకీ ఈవెంట్లో భారత్... మలేసియా, వేల్స్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో కలిసి పూల్ ‘ఎ’లో ఉంది. ఏప్రిల్ 5న జరిగే తమ తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో భారత్ తలపడుతుంది. -
తమిళనాట రజనీ మేనియా !
-
జాతీయ హాకీ శిబిరానికి రజని
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని... హాకీ ఇండియా 33 మందితో కూడిన భారత మహిళల ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. బెంగళూరులో ఆదివారం మొదలయ్యే ఈ శిబిరం డిసెంబర్ 23 వరకు జరుగుతుంది. ప్రాబబుల్స్ జాబితా లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి, భారత జట్టు రెండో గోల్‌కీపర్ ఇతిమరపు రజనికి స్థానం లభించింది. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో టాప్–3లో నిలువడం... ఆసియా క్రీడల్లో స్వర్ణం ద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తమ ముందున్న లక్ష్యాలని కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. -
రెండేళ్లుగానే నేను 'రజని'ని!
సాధారణ కుటుంబం, ఏమాత్రం సౌకర్యాలు లేని గ్రామం నుంచి వచ్చిన నేపథ్యం... అయితే పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగిన ఆ అమ్మాయి భారత హాకీ జట్టు స్థాయికి ఎదిగింది. ప్రపంచకప్, ఒలింపిక్స్ సహా ప్రఖ్యాత టోర్నీలలో భాగమైంది. ఎనిమిదేళ్ల క్రితమే భారత జట్టులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని ఇటీవల మరోసారి తన సత్తాను ప్రదర్శించింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్ గెలిచిన జట్టులో గోల్‌కీపర్‌గా కీలక పాత్ర పోషిం చింది. భారత జట్టులో సభ్యురాలే అయినా... చాలా కాలంగా తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయిన రజని, ఇప్పుడు హాకీకి లభిస్తున్న ఆదరణతో పాటు తనకు కూడా లభిస్తున్న ప్రోత్సాహం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. సాక్షి, హైదరాబాద్:ఇతిమరపు రజని తొలిసారి భారత జట్టు తరఫున 2009లో ఆడింది. మధ్యలో గాయంతో కొంత కాలం మినహా రెగ్యులర్ సభ్యురాలిగా ఉన్న ఆమె 67 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. జపాన్‌లో ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా విజయంలో భాగస్వామిగా ఉన్న రజని, ప్రస్తుత జాతీయ జట్టులో దక్షిణ భారతానికి చెందిన ఏకైక క్రీడాకారిణి కావడం విశేషం. ‘నా కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. 13 ఏళ్ల తర్వాత ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిని కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి అజేయంగా నిలవగలిగాం. గత రెండేళ్లుగా మహిళల హాకీ మంచి విజయాలతో అందరి దృష్టిలో పడింది. 2015కు ముందు నాకు ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్ ఉన్నా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే నన్ను గుర్తు పట్టేవాళ్లు. ఇప్పుడు ‘హాకీ రజని’ అని పెద్ద సంఖ్యలో అభిమానిస్తుంటే గర్వంగా అనిపిస్తోంది’ అని రజని వ్యాఖ్యానించింది. చిత్తూరు జిల్లా నుంచి... తిరుపతి సమీపంలో యెర్రవారిపాలెం మండలంలోని యెనుమలవారి పల్లి రజని స్వస్థలం. తండ్రి కార్పెంటర్ వృత్తిలో ఉన్నారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో హాకీపై పెరిగిన ఆసక్తి ఆమెను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. టీమ్ గేమ్‌తో పాటు అమ్మాయి కావడం వల్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా కుటుంబ సభ్యుల అండదండలు రజనిని ముందుకు వెళ్లేలా చేశాయి. స్కూల్ గేమ్స్‌లో ప్రదర్శన తర్వాత 2005లో తిరుపతిలోని ‘శాప్’ హాకీ అకాడమీలో చేరడం రజని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత దూసుకుపోయిన ఈ అమ్మాయి 2008లో తొలిసారి భారత జూనియర్ జట్టు క్యాంప్‌లోకి ఎంపికైంది. గోల్‌కీపర్‌గా ఈ దశలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నిలకడగా రాణించడంతో ఏడాది తిరిగే సరికి సీనియర్ టీమ్‌లో భాగం కావడం విశేషం. ‘గోల్ కీపర్‌గా అనుభవం పెరిగిన కొద్దీ నేను మరింత రాటుదేలాను. దాంతో పాటు కీపింగ్‌ను బాగా ఆస్వాదించాను. మైదానంలో నేను కీపర్‌గా ఐదు నిమిషాలు నిలబడిన సమయంలో ఒక్క గోల్ ఆపగలిగినా కూడా జట్టు విజయానికి నేను ఉపయోగపడినట్లే. అదే పట్టుదల ప్రతీ మ్యాచ్‌లో కనబరుస్తాను’ అని రజని తన గురించి చెప్పింది. బెస్ట్ గోల్‌కీపర్‌గా... అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన ఏడాదికే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టులో రజనికి అవకాశం లభించింది. అయితే ఈ టోర్నీలో జట్టు సమష్టి వైఫల్యం కారణంగా పెద్దగా గుర్తింపు లభించలేదు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా జట్టులో భాగంగా ఉన్నా ఫలితం మాత్రం రాలేదు. అయితే 2013 మాత్రం ఆమె కెరీర్లో కీలకంగా నిలిచింది. ముందుగా ఆసియా కప్‌లో కాంస్యం సాధించిన జట్టులో భాగంగా ఉన్న రజని... కొద్ది రోజులకే జపాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. భారత్ రజత పతకం గెలవడంతో కీలక పాత్ర పోషించి ‘బెస్ట్ గోల్ కీపర్’ అవార్డును సొంతం చేసుకుంది. అయితే తర్వాతి ఏడాదే గాయంతో ఆమె జట్టుకు దూరమైంది. ‘గాయంతో ఆటకు దూరమై కోలుకుంటున్న సమయంలో తీవ్ర వేదన అనుభవించాను. అయితే అంతే పట్టుదలగా పోరాడి ఏడాదిలోపే మళ్లీ స్థానం సాధించాను. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జట్టులో ఉండటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది’ అని రజని నాటి రోజులు గుర్తు చేసుకుంది. అదే లక్ష్యంతో... భారత జట్టులాగే రజని కెరీర్ కూడా ఆరంభంలో ఒడిదుడుకులకు లోనైంది. అయితే 2015లో ఎఫ్ఐహెచ్ వరల్డ్ లీగ్ రౌండ్ మొదలు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజయం, రియో ఒలింపిక్స్, ఆ తర్వాత వరల్డ్ లీగ్, తాజాగా ఆసియా కప్ టైటిల్... ఇలా జట్టు ప్రదర్శన ఆకట్టుకునేలా సాగుతోంది. వీటన్నింటిలో రజని భాగంగా ఉంది. తాజాగా ఆసియా కప్ విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది కూడా. ‘వచ్చే సంవత్సరం ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీలో బాగా ఆడటమే జట్టు లక్ష్యం. కొత్త కోచ్ హరీంద్ర సింగ్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నారు. ఇక 2018లోనే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నాం. అయితే నా కెరీర్‌కు సంబంధించి అంతిమ లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్స్. అక్కడ పతకం గెలవగలిగితే కెరీర్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది’ అని రజని పేర్కొంది. 26 ఏళ్ల రజని ప్రస్తుతం సెంట్రల్ రైల్వే (ముంబై)లో జూనియర్ టికెట్ కలెక్టర్ (టీసీ)గా పని చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలోనే ఆమెకు ఈ ఉద్యోగం దక్కింది. గత ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు నగదు ప్రోత్సాహకం అందించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాన్ని కూడా ఆమె ఆశిస్తోంది. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి భారత జట్టు తరఫున సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు ఇతరత్రా కూడా సహకారం అందించాలని కూడా రజని కోరుకుంటోంది. హాకీని ఎంచుకున్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. పురుషుల హాకీకే అంతంత మాత్రం గుర్తింపు లభిస్తున్నప్పుడు మహిళల హాకీ గురించి చెప్పేదేముంది. కానీ ఆటపై ఆసక్తి, సన్నిహితుల సహకారంతో గట్టిగా నిలబడ్డాను. మా ఊరు వెళ్లాలంటే ఇప్పటికీ కనీసం మూడు కిలోమీటర్ల నడక తప్పదు. కొన్నాళ్లుగా లభించిన గుర్తింపు వల్ల నేను టూర్ నుంచి వచ్చాక ఏదైనా వాహనం అందుబాటులో ఉంటోంది. అంతకుముందు నా కిట్ బ్యాగ్, లగేజీ చూసి కనీసం బస్సు కూడా ఆపకుండా వెళ్లిపోయేవాళ్లు. అలాంటప్పుడు ఎంత బాధ పడ్డానో! భారత జట్టులో సభ్యురాలే అయినా టోర్నీలు జరిగే సమయంలో రోజువారీ అలవెన్స్ మినహా మ్యాచ్ ఫీజులాంటివేమీ మాకు లేవు. కానీ హాకీపై పిచ్చిప్రేమతో ముందుకు వెళ్లాను. భారత జట్టు సభ్యురాలిగా ఉండటమే అన్నింటికంటే గర్వపడే విషయం. –‘సాక్షి’తో ఇతిమరపు రజని -
హెచ్‌డబ్ల్యూఎల్ టోర్నీకి రజని
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే మహిళల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. రాణి రాంపాల్ కెప్టెన్‌గా, సుశీలా చాను వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రధాన గోల్‌కీపర్‌గా హరియాణా అమ్మాయి సవిత పూనియా ఎంపికైంది. జూలై 8 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. టాప్–6లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది లండన్‌లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. -
ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి నాలుగు రోజులుగా మౌనపోరాటం చేస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పి.రజని (25), అదే గ్రామానికి చెందిన చౌటుపల్లి సురేష్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇక పెళ్లి చేసుకుందామని రజని కోరింది. అందుకు సురేష్ ససేమిరా అన్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలన్న ఏకైక డిమాండ్‌తో రజని ఈ నెల 27న సురేష్ ఇంటి ముందు బైఠాయించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న మౌనపోరాటం సోమవారం నాలుగోరోజుకు చేరింది. రజని మౌన దీక్షతో సురేష్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం పెట్టి బంధువుల ఇంటికి చెక్కేశారు. -
బిడ్డలను చంపి రిలాక్సయ్యాను
పిల్లలకు తండ్రి గండం తప్పింది.. ఇప్పుడెంతో హ్యాపీగా ఉన్నాను.. హుస్సేన్‌సాగర్ నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకున్నా.. నాకే పాపం ఉండదు సాక్ష్యాలు అడిగితే ఇవ్వలేను: పోలీసు విచారణలో వెల్లడించిన రజని ఆమె మానసిక స్థితి సరిగా లేదు: రజని భర్త వినయ్ హైదరాబాద్: ‘‘నా ఇద్దరు బిడ్డలను నేనే చంపేశా.. కన్న కూతుళ్లను పాశవికంగా హత్య చేశావు.. ఏం అనిపించలేదా అని మీరంతా ప్రశ్నిస్తున్నారు. నిజానికి నా కూతుళ్లను కడతేర్చాక చాలా రిలాక్స్‌గా, హ్యాపీగా ఉన్నాను. రెండు నెలలుగా నా భర్త నుంచి నా బిడ్డలకు హాని ఉందని చాలా కుమిలిపోయా.. మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇకపై ఉండదు. ఇద్దరు కూతుళ్లను చంపేశాక నేరుగా ట్యాంక్‌బండ్‌కు వెళ్లా.. తలపై హుస్సేన్‌సాగర్ నీళ్లు చల్లుకుని ఒంటిని శుద్ధి చేసుకున్నా.. ఇక నాకే పాపం ఉండదు. అందుకే ట్యాంక్‌బండ్ నుంచి నేరుగా ఇంటికి వచ్చా..’’ కన్న కూతుళ్లు అశ్విక(7), తివిష్క(3)లను కర్కశంగా గాజు పెంకుతో గొంతుకోసి చంపిన తల్లి రజని(41) పోలీసుల విచారణలో చెప్పిన విషయమిది. బుధవారం రాత్రే రజనిని అదుపులోకి తీసుకున్న తుకారాంగేట్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు బిడ్డలను కడతేర్చి పోలీసుల ఎదుట ప్రత్యక్షమైన రజని.. కంటతడి పెట్టకపోగా నిర్భీతిగా పోలీ సు విచారణలో చెప్పిన సమాధానాలు అధికారులనే నివ్వెరపరిచాయి. విచారణలో పోలీసు లు అడిగిన ప్రశ్నలకు రజని ఇచ్చిన సమాధానాలు ఆమె మాటల్లోనే.. తండ్రిని చూస్తే భయపడేది.. రెండు నెలలుగా నా పెద్ద కూతురు అశ్విక తండ్రి వినయ్ దగ్గరికి వెళ్లడం లేదు. ఆయన లేనప్పుడు ఇంట్లో బాగానే ఉంటున్న అమ్మా యి.. ఆయన్ను చూడగానే భయపడి పోతోం ది. మా అమ్మాయి తండ్రి లైంగిక వేధింపులకుగురై భయపడిపోతోందని నా అంతరాత్మ చె ప్పింది. నా మనసు ఎప్పుడూ తప్పు చెప్పదు. ఆత్మసాక్షిగా అది నిజమేనని అనుకున్న మీదట నా మనసు నిలకడగా లేదు. నేను ప్రాణంగా చూసుకునే అమ్మాయిలు ఏదో ఒకరోజు తండ్రి చేతిలో అత్యాచారానికి బలైపోతారని దృఢంగా నమ్మాను. నా పిల్లలను రక్షించుకోవడానికి మా ర్గం అన్వేషించా. వారిని చంపేయడమే కరెక్ట్ అనిపించింది. అందుకే నిన్న(బుధవారం) రాత్రి ఇద్దరినీ చంపేశాను. ఇప్పుడు చాలా రిలాక్స్‌గా, హ్యాపీగా ఉన్నాను. ఇకపై నాకు ఎటువంటి చింతా ఉండదు. నా ఇద్దరు పాపలకు తండ్రి నుంచి లైంగిక వేధింపుల భయం ఉండదు. అలాగని నా కళ్లతో ఎప్పుడూ భర్త పిల్లల్ని లైంగికవేధింపులకు గురిచేయడం చూ డలేదు. సాక్ష్యాలు తెమ్మంటే నా దగ్గర లేవు. భర్త వాదన మరోలా.. ఇద్దరు కూతుళ్లను కోల్పోయి కుప్పకూలిపోయిన రజని భర్త వినయ్ పోలీసులకు ఇచ్చిన వివరణ మరోలా ఉంది. కన్న కూతుళ్లపై.. అందులోనూ ముక్కుపచ్చలారని పసివారిపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రజని చెప్పడం పూర్తిగా అవాస్తవమని వినయ్ చెప్పాడు. ఈ మధ్య తన భార్య మానసిక స్థితి సరిగ్గా లేదని, తనలో తానే ఏదో ఊహించుకుని అవే వాస్తవాలుగా భావించి తనతో గొడవ పడేదన్నాడు. హత్య జరిగిన రోజు ఉదయం భార్యాపిల్లలతో గుడికి వెళ్లివచ్చామని, ఇంటికి వచ్చాక రజని తనతో లైంగిక వేధింపుల ప్రస్తావన తెచ్చి గొడవ పడిందని వెల్లడించాడు. తన మానసిక స్థితి సరిగా లేదని తెలిసి తానేమీ మాట్లాడకుండానే ఆఫీసుకు వెళ్లిపోయానని, తిరిగి వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందని పోలీసుల ముందు భోరున విలపించాడు. లైంగిక వేధింపులపై ఆధారాల్లేవు: గాంధీ వైద్యులు అశ్విక, తివిష్కలను ఊపిరాడకుండా చేసి, గొంతు కోసి హత్య చేసినట్టుగా గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ధ్రువీకరించారు. తల్లి చేతిలో హత్యకు గురైన ఇరువురు బాలికల మృతదేహాలకు గురువారం గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ బాలికల ఒంటిపై లైంగిక వేధింపులకు గురైన ఆనవాళ్లు లేవని నిర్ధారించారు. దీంతో మానసిక స్థితి సరిగా లేని కారణంగానే రజని తన కూతుళ్లను హత్యచేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
లక్ష్మమ్మలో ఆ పాట నాకు బాగా ఇష్టం!
సి. కృష్ణవేణి, సీనియర్ నటి, గాయని, నిర్మాత బాలాంత్రపు రజనీకాంతరావు గారు అటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ పరిజ్ఞానం ఉన్న అరుదైన ప్రతిభావంతులు. చక్కటి స్వరకర్తే కాక, మంచి కవి, గాయకుడు కూడా! నేను సినిమాల్లో నటిస్తూ, మీర్జాపురం రాజా వారు శోభనాచల పతాకంపై సినిమాలు తీస్తూ ఉన్న సమయంలోనే ఆయన సినిమాల్లో గీత రచన, సంగీతం ప్రారంభించారు. అప్పటికే ఆయన ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారనుకుంటా. అందుకే, టైటిల్స్‌లో వేరే పేరు వేసేవారు. రజని రాసి, వరుస కట్టగా ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట అందరికీ తెలిసిందే. ఇక ఎల్వీ ప్రసాద్, భానుమతి నటించిన ‘గృహప్రవేశం’ చిత్రానికైతే పాటలు, సంగీతం పూర్తిగా ఆయనవే. నా చిత్రాల్లో రజనీ గారి సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవలసిన చిత్రాలు ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’. లక్ష్మమ్మ’ చిత్ర నిర్మాణం ఒక పెద్ద కథ. రజనీకాంతరావు, రచయిత-దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ చాలా సన్నిహితులు. గోపీచంద్ గారు ‘లక్ష్మమ్మ’ స్క్రిప్టు మాత్రమే కాకుండా, పాటలు-వాటి వరుసలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని, మద్రాసులో మా బంగళాకు వచ్చారు. స్క్రిప్టు, పాటలు వినిపించారు. పాటలు, వరుసలు - రజనీకాంతరావు గారివి. ఆ లక్ష్మమ్మ పాత్రకు నేను బాగుంటాననీ, నన్ను చేయమనీ గోపీచంద్ అడిగారు. అలాగే అనుకున్నాం. తరువాత చాలా కథ జరిగి, పలువురి చేతులు మారినా, చివరకు ప్రాజెక్ట్ నా దగ్గరకే వచ్చింది. చిత్ర నిర్మాణమూ మేమే చేపట్టాం. తీరా అదే సమయంలో జనబాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉన్న నిజజీవిత కథ అయిన లక్ష్మమ్మ కథతోనే, అక్కినేని, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా నిర్మించ తలపెట్టారు. మా ‘లక్ష్మమ్మ’, వాళ్ళ ‘లక్ష్మమ్మ కథ’ ఒకే రోజు షూటింగ్ మొదలై, అనేక సంచలనాల మధ్య ఒకే రోజు విడుదలయ్యాయి. మాది హిట్టయ్యింది. ‘లక్ష్మమ్మ’ పాటలు రజనీ రాసి, వరసలు కట్టినా, వాటిని సినిమాకు తగ్గట్లుగా రికార్డింగ్ చేసింది ఘంటసాల. అందుకే, టైటిల్స్‌లో సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరే ఉంటుంది. రజనీ గారి సాహిత్యం ఎంత సులభంగా, సహజంగా ఉంటుందంటే... ‘లక్ష్మమ్మ’లో పాటలన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా, లక్ష్మమ్మ పాత్ర అత్తవారింటికి పల్లకీలో వెళ్ళే సందర్భంలో వచ్చే ‘చిన్ననాటి స్వప్నసీమ... కన్న ఊరు విడువలేము...’ పాట నాకు మరీ మరీ ఇష్టం. ఆయన వరుసల్లో నా పాటలన్నీ నేనే పాడుకున్నా. అలాగే, ఆ తరువాత విజయలక్ష్మీ బ్యానర్‌పై మేమే నిర్మించిన ‘పేరంటాలు’కు కూడా గోపీచంద్ దర్శకుడు. రజనీ పాటలు రాశారు. అందులోనూ పాటలు పాడాను. ఇప్పుడు ఆ సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే, కాలం వెనక్కి వెళ్ళినట్లుంది. -
మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య
-
మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య
చిక్కడపల్లి/ముషీరాబాద్, న్యూస్‌లైన్: మానవత్వాన్ని మంట గలిపారు... వావివరుసలు, కుటుంబ సంస్కృతిని కాలరాశారు... జనారణ్యంలో నివసించే మానవ మృగాలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతి ఘోరానికి ఒడికట్టారు... భర్త, అత్తమామలు కలిసి జంతువును బలిచ్చినట్లు కోడలి గొంతుకోసి మారణహోమం సృష్టించారు... సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, బంధువుల కథనం ప్రకారం.. బాగ్‌లింగంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిత్తరంజన్ (60) అచ్చయ్యనగర్ బృందావన్‌కాలనీ శాంతి నిలయం అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఇతని కుమారుడు జి.బాలకృష్ణ(45)కు మేడ్చల్‌కు చెందిన రజని (35)తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కూతురు నిరుపమ (6) సంతానం. రజని చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ముగ్గురు అన్నలూ ఆమెను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి, ఘనంగా పెళ్లి జరిపించారు. భర్త కార్వీ సంస్థలో ఉద్యోగి. కొంతకాలంగా అతను తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకొ ని భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీన్ని ఆసరా చేసుకొని కామాంధుడైన మామ చిత్తరంజన్ తన కోరిక తీర్చమని ఏడాదిగా రజనిని వేధిస్తున్నాడు. తిరస్కరించిన ఆమెపై కక్షగట్టాడు. రజని విషయాన్ని భర్తకు చెప్పగా.. తండ్రిని నిలదీయపోగా.. తన తండ్రి కోరిక తీరిస్తే తప్పులేదన్నట్టు మాట్లాడాడు. దీంతో మనోవేదనకు గురైన రజని ఈ విషయాన్ని తల్లి మీరాభాయికి చెప్పి.. ఇక్కడుండలేను, ఇంటికి వచ్చేస్తానని రోదించింది. దీంతో తల్లి ఆదివారం వచ్చి తీసుకెళ్తానని సర్ది చెప్పింది. పథకం ప్రకారం హత్య... కోడలిపై కక్షగట్టిన అత్తమామలు, భర్త రజని హత్యకు పథకం వేశారు. శనివారం తెల్లవారు జా మున 3 గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. గాఢనిద్రలో ఉన్న రజని పొట్టపై మామ కూర్చుని కదలకుండా పట్టుకోగా.. భర్త బాలకృష్ణ కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అత్త కూడా వారికి సహకరించింది. ఘటనా స్థ లంలోనే ఉన్న హతురాలి కూతురు నిరుపమను ఆ తర్వాత చిత్తరంజన్ పెద్ద అల్లుడు సతీశ్ ఆటోలో బంధువుల ఇంటికి తీసుకె ళ్లాడు. మృతదేహం తరలింపును అడ్డుకున్న బంధువులు... మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా హతురాలి బంధువులు అడ్డుకున్నారు. భర్తను చంపి శవాన్ని అప్పగిస్తామని, రజని శవంతో పాటు తీసుకెళ్లండి అని అన్నారు. రజని మృతదేహానికి 24 గంట్లో పోస్టుమార్టం చేయకపోతే సాక్ష్యాధారాల లభించవని పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కొద్ది సేపటికి రజని కుమార్తె నిరుపమను చిత్తరంజన్ అల్లుడు సతీష్ తీసుకొని రాగా బంధువులు అతడ్ని చితకబాదారు. పోలీసులు అడ్డుకొని అతడ్ని అక్కడి నుంచి వేరేచోటికి తరలించారు. కాగా, తండ్రి, తాత, నాన్నమ్మ తన అమ్మను చంపారని నిరుపమ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో నిందితులు.. భర్త, అత్తమామలు, ఆడపడుచులను పోలీ సులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఠాణా ముందు ధర్నా ... నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు, సోదరులు జితేందర్, వెంకటేష్, శ్రీనివాస్ చిక్కపడల్లి పోలీసుస్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించడంతో పాటు ఉద్రిక్తత నెలకొంది. ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. వీరి ఆందోళన నేపథ్యంలో చిక్కడపల్లి ఠాణాలో ఉన్న నిందితులను పోలీసులు ముషీరాబాద్ పో లీసుస్టేషన్‌కు తరలించారు. రజని హత్యతో అచ్చయ్యనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసును పక్కదారి పట్టించేందుకు... కేసును పక్కదారి పట్టించేందుకు నిందితులు ఘటనా స్థలంలో పసుపు,కుంకుమ, గాజుల తో పాటు పూజా సామగ్రిని ఉంచారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. రజని క్షుద్ర పూజలు చేస్తోందని, తాము అడ్డుకోవడానికి ప్రయత్నించగా మెడకు కత్తి తగిలి చనిపోయిందని చెప్పారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఉన్న కత్తిని, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.