మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య | Daughter in law murdered due to uncle's disire not fulfilled | Sakshi
Sakshi News home page

మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య

Published Sun, Sep 29 2013 2:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య - Sakshi

మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య

చిక్కడపల్లి/ముషీరాబాద్, న్యూస్‌లైన్: మానవత్వాన్ని మంట గలిపారు... వావివరుసలు, కుటుంబ సంస్కృతిని కాలరాశారు... జనారణ్యంలో నివసించే మానవ మృగాలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతి ఘోరానికి ఒడికట్టారు... భర్త, అత్తమామలు కలిసి జంతువును బలిచ్చినట్లు కోడలి గొంతుకోసి మారణహోమం సృష్టించారు...
 
సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, బంధువుల కథనం ప్రకారం.. బాగ్‌లింగంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిత్తరంజన్ (60) అచ్చయ్యనగర్ బృందావన్‌కాలనీ శాంతి నిలయం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఇతని కుమారుడు జి.బాలకృష్ణ(45)కు మేడ్చల్‌కు చెందిన రజని (35)తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కూతురు నిరుపమ (6) సంతానం. రజని చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ముగ్గురు అన్నలూ ఆమెను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి, ఘనంగా పెళ్లి జరిపించారు.

భర్త కార్వీ సంస్థలో ఉద్యోగి. కొంతకాలంగా అతను తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకొ ని భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీన్ని ఆసరా  చేసుకొని కామాంధుడైన మామ చిత్తరంజన్ తన కోరిక తీర్చమని ఏడాదిగా రజనిని వేధిస్తున్నాడు. తిరస్కరించిన ఆమెపై కక్షగట్టాడు. రజని విషయాన్ని భర్తకు చెప్పగా..  తండ్రిని నిలదీయపోగా.. తన తండ్రి కోరిక తీరిస్తే తప్పులేదన్నట్టు మాట్లాడాడు. దీంతో మనోవేదనకు గురైన రజని ఈ విషయాన్ని తల్లి మీరాభాయికి చెప్పి.. ఇక్కడుండలేను, ఇంటికి వచ్చేస్తానని రోదించింది. దీంతో తల్లి ఆదివారం వచ్చి తీసుకెళ్తానని సర్ది చెప్పింది.
 
పథకం ప్రకారం హత్య...
కోడలిపై కక్షగట్టిన అత్తమామలు, భర్త రజని హత్యకు పథకం వేశారు. శనివారం తెల్లవారు జా మున 3 గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు.  గాఢనిద్రలో ఉన్న రజని పొట్టపై మామ కూర్చుని కదలకుండా పట్టుకోగా.. భర్త బాలకృష్ణ కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అత్త కూడా వారికి సహకరించింది.  ఘటనా స్థ లంలోనే ఉన్న హతురాలి కూతురు నిరుపమను ఆ తర్వాత చిత్తరంజన్ పెద్ద అల్లుడు సతీశ్ ఆటోలో బంధువుల ఇంటికి తీసుకె ళ్లాడు.
 
మృతదేహం తరలింపును అడ్డుకున్న బంధువులు...

మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా హతురాలి బంధువులు అడ్డుకున్నారు. భర్తను చంపి శవాన్ని అప్పగిస్తామని, రజని శవంతో పాటు తీసుకెళ్లండి అని అన్నారు. రజని మృతదేహానికి 24 గంట్లో పోస్టుమార్టం చేయకపోతే సాక్ష్యాధారాల లభించవని పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కొద్ది సేపటికి రజని కుమార్తె నిరుపమను చిత్తరంజన్ అల్లుడు సతీష్ తీసుకొని రాగా బంధువులు అతడ్ని చితకబాదారు. పోలీసులు అడ్డుకొని అతడ్ని అక్కడి నుంచి వేరేచోటికి తరలించారు. కాగా, తండ్రి, తాత, నాన్నమ్మ తన అమ్మను చంపారని నిరుపమ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
 
పోలీసుల అదుపులో నిందితులు..
భర్త, అత్తమామలు, ఆడపడుచులను పోలీ సులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
ఠాణా ముందు ధర్నా ...
నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు, సోదరులు జితేందర్, వెంకటేష్, శ్రీనివాస్ చిక్కపడల్లి పోలీసుస్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించడంతో పాటు ఉద్రిక్తత నెలకొంది.  ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. వీరి ఆందోళన నేపథ్యంలో చిక్కడపల్లి ఠాణాలో ఉన్న నిందితులను పోలీసులు ముషీరాబాద్ పో లీసుస్టేషన్‌కు తరలించారు. రజని హత్యతో అచ్చయ్యనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
కేసును పక్కదారి పట్టించేందుకు...
కేసును పక్కదారి పట్టించేందుకు నిందితులు ఘటనా స్థలంలో పసుపు,కుంకుమ, గాజుల తో పాటు పూజా సామగ్రిని ఉంచారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. రజని క్షుద్ర పూజలు చేస్తోందని, తాము అడ్డుకోవడానికి ప్రయత్నించగా మెడకు కత్తి తగిలి చనిపోయిందని చెప్పారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఉన్న కత్తిని, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement