Brindavan Colony
-
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
బృందావన్ కాలనీలో ‘ప్లస్1’
నల్లగొండ టూటౌన్: జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల బృందావన్ కాల నీలో సినీ సందడి నెలకొం ది. గురువారం బృందావన్ కా లనీలో ప్లస్1 సినిమా చిత్రీకరణ చేపట్టారు. హీరో, హీరోయిన్లు, ఇతర పాత్రధారులపై వివిధ సన్ని వేశాలను చిత్రీకరించారు. పదవ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు హా స్టల్ ఉంటే ఎలా ఉంటుందనే కథాంశంతో చిత్ర ఉంటుందని ప్లస్1 సిని మా దర్శకుడు అలహరి తెలిపారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా రో షన్, ఆర్తి నటిస్తున్నారు. తల్లి పాత్ర లో ప్రముఖ నటి పూర్ణిమ నటిస్తుందని చెప్పారు. చిత్రానికి నిర్మాతగా విశ్వాస్ ఎన్ఆర్ఐ, మేకప్‌మన్‌గా మల్లెమూడి ఈశ్వర్. -
మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య
-
మామ కోరిక తీర్చలేదని కోడలి హత్య
చిక్కడపల్లి/ముషీరాబాద్, న్యూస్‌లైన్: మానవత్వాన్ని మంట గలిపారు... వావివరుసలు, కుటుంబ సంస్కృతిని కాలరాశారు... జనారణ్యంలో నివసించే మానవ మృగాలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతి ఘోరానికి ఒడికట్టారు... భర్త, అత్తమామలు కలిసి జంతువును బలిచ్చినట్లు కోడలి గొంతుకోసి మారణహోమం సృష్టించారు... సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, బంధువుల కథనం ప్రకారం.. బాగ్‌లింగంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిత్తరంజన్ (60) అచ్చయ్యనగర్ బృందావన్‌కాలనీ శాంతి నిలయం అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఇతని కుమారుడు జి.బాలకృష్ణ(45)కు మేడ్చల్‌కు చెందిన రజని (35)తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కూతురు నిరుపమ (6) సంతానం. రజని చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ముగ్గురు అన్నలూ ఆమెను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి, ఘనంగా పెళ్లి జరిపించారు. భర్త కార్వీ సంస్థలో ఉద్యోగి. కొంతకాలంగా అతను తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకొ ని భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీన్ని ఆసరా చేసుకొని కామాంధుడైన మామ చిత్తరంజన్ తన కోరిక తీర్చమని ఏడాదిగా రజనిని వేధిస్తున్నాడు. తిరస్కరించిన ఆమెపై కక్షగట్టాడు. రజని విషయాన్ని భర్తకు చెప్పగా.. తండ్రిని నిలదీయపోగా.. తన తండ్రి కోరిక తీరిస్తే తప్పులేదన్నట్టు మాట్లాడాడు. దీంతో మనోవేదనకు గురైన రజని ఈ విషయాన్ని తల్లి మీరాభాయికి చెప్పి.. ఇక్కడుండలేను, ఇంటికి వచ్చేస్తానని రోదించింది. దీంతో తల్లి ఆదివారం వచ్చి తీసుకెళ్తానని సర్ది చెప్పింది. పథకం ప్రకారం హత్య... కోడలిపై కక్షగట్టిన అత్తమామలు, భర్త రజని హత్యకు పథకం వేశారు. శనివారం తెల్లవారు జా మున 3 గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. గాఢనిద్రలో ఉన్న రజని పొట్టపై మామ కూర్చుని కదలకుండా పట్టుకోగా.. భర్త బాలకృష్ణ కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అత్త కూడా వారికి సహకరించింది. ఘటనా స్థ లంలోనే ఉన్న హతురాలి కూతురు నిరుపమను ఆ తర్వాత చిత్తరంజన్ పెద్ద అల్లుడు సతీశ్ ఆటోలో బంధువుల ఇంటికి తీసుకె ళ్లాడు. మృతదేహం తరలింపును అడ్డుకున్న బంధువులు... మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా హతురాలి బంధువులు అడ్డుకున్నారు. భర్తను చంపి శవాన్ని అప్పగిస్తామని, రజని శవంతో పాటు తీసుకెళ్లండి అని అన్నారు. రజని మృతదేహానికి 24 గంట్లో పోస్టుమార్టం చేయకపోతే సాక్ష్యాధారాల లభించవని పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కొద్ది సేపటికి రజని కుమార్తె నిరుపమను చిత్తరంజన్ అల్లుడు సతీష్ తీసుకొని రాగా బంధువులు అతడ్ని చితకబాదారు. పోలీసులు అడ్డుకొని అతడ్ని అక్కడి నుంచి వేరేచోటికి తరలించారు. కాగా, తండ్రి, తాత, నాన్నమ్మ తన అమ్మను చంపారని నిరుపమ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో నిందితులు.. భర్త, అత్తమామలు, ఆడపడుచులను పోలీ సులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఠాణా ముందు ధర్నా ... నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు, సోదరులు జితేందర్, వెంకటేష్, శ్రీనివాస్ చిక్కపడల్లి పోలీసుస్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించడంతో పాటు ఉద్రిక్తత నెలకొంది. ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. వీరి ఆందోళన నేపథ్యంలో చిక్కడపల్లి ఠాణాలో ఉన్న నిందితులను పోలీసులు ముషీరాబాద్ పో లీసుస్టేషన్‌కు తరలించారు. రజని హత్యతో అచ్చయ్యనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసును పక్కదారి పట్టించేందుకు... కేసును పక్కదారి పట్టించేందుకు నిందితులు ఘటనా స్థలంలో పసుపు,కుంకుమ, గాజుల తో పాటు పూజా సామగ్రిని ఉంచారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. రజని క్షుద్ర పూజలు చేస్తోందని, తాము అడ్డుకోవడానికి ప్రయత్నించగా మెడకు కత్తి తగిలి చనిపోయిందని చెప్పారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఉన్న కత్తిని, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యమ పోరు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో హోరెత్తిపోతోంది. వినూత్న రీతిలో సాగుతోంది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలోని మంత్రి బాలరాజు ఇంటిని శుక్రవారం ముట్టడించారు. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు బ్యాంకులు, కేంద్ర కార్యాలయాలను మూయించారు. నర్సీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గడ్డికోసి.. కోలాటమాడి నిరసన తెలిపారు. అరకులోయలో సాంస్కృతిక గర్జన మిన్నంటింది. పెదబయలులో 500 అడుగుల జాతీయ జెండాతో మత్స్య గెడ్డలో రెండు గంటల పాటు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజోద్యమం మహోద్యమంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల స్తంభన ద్వారా సమైక్య సెగ కేంద్రానికి తాకేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ట్రేడ్ యూనియన్లతో కీలకమైన సమావేశం శనివారం జరగనుంది. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించి శనివారానికి 60 రోజులు పూర్తి కావస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కీలకమైన పరిశ్రమల్లో కూడా కార్యకలాపాలను స్తంభింప చేయాలని ఆలోచన చేస్తున్నారు. నేడు కీలక సమావేశం జిల్లాలో అనేక కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి. పోర్టు, షిప్‌యార్డ్, స్టీల్‌ప్లాంట్, కోరమాండల్, బీహెచ్‌పీవీ, హెచ్‌పీసీఎల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, హిందుస్థాన్ పాలిమర్స్, ఎన్టీపీసీ ఇలా అనేకమున్నాయి. వీటిలో ఒక్క రోజు కార్యకలాపాలు నిలిచిపోతే రూ.వందల కోట్లు నష్టం వాటిల్లితుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఈ పరిశ్రమలను స్తంభింప చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా అన్ని పరిశ్రమల ట్రేడ్ యూనియన్ నాయకులతో పాటు రైల్వే, కస్టమ్స్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంఘ నాయకులతో శనివారం ఉదయం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మేఘాలయ హోటల్లో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సమావేశానికి హాజరవుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సహాయ సహకారాలు అందించాలని యూనియన్ నాయకులను కోరనున్నారు. అలాగే పరిశ్రమల స్తంభనకు గల సాధ్యాసాధ్యాలను చర్చించనున్నారు. యూనియన్ నాయకులు అందుకు అంగీకారం తెలిపితే త్వరలోనే కేంద్ర పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కేంద్ర సంస్థల దిగ్బంధం ఏపీఎన్జీఓ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంస్థలను ఉద్యోగ సంఘాలు దిగ్బంధించాయి. కస్టమ్స్, ఎల్ఐసీ, హెచ్‌పీసీఎల్ పరిపాలన విభాగం, పోస్టాఫీస్ ఇలా అన్ని కార్యాలయాలను ముట్టడించారు. ఉద్యోగులను బయటకు పంపించారు. బ్యాంకుల సేవలను అడ్డుకున్నారు. దీంతో రూ.కోట్లు లావాదేవీలు నిలిచిపోయాయి. వీటితో పాటు తెరిచి ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలను కూడా మూయించారు. శనివారం కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను దిగ్బంధం చేయనున్నారు. -
దోపిడీ జరిగింది ఇలా..
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : నగరంలోని లబ్బీపేట బృందావన్ కాల నీలోని ఓ అపార్ట్మెంటులో నెలరోజుల క్రితం పట్టపగలు జరిగిన హత్యాయత్నం, దోపిడీ కేసు ను పోలీసులు ఛేదించారు. అప్పట్లో తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితురాలి స్నేహితురాలే కీలకపాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రవిప్రకాష్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. బృందావన్ కాలనీ రాజేష్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఉంటున్న వెంకట రామలక్ష్మిని గత నెల 26 వ తేదీ మిట్టమధ్యాహ్నం ఓ యువకుడు కత్తితో పొడిచి, ఆమె మెడలోని ఏడున్నర కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. ఈ ఘటన జరగడానికి ముం దు రామలక్ష్మి స్నేహితురాలు సుధారాణి అపార్ట్మెంట్లోకి ప్రవేశించిందని, ఆమె వెనుకే ఓ యువకుడు కూడా వచ్చినట్లు వాచ్మెన్ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుధారాణిపై అనుమానం వచ్చి నిఘా పెట్టారు. ఆమె కదలికలు, సెల్‌ఫోన్ కాల్స్, ఇతర అంశాలను పరి శీలించి, అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, అసలు విషయం వెల్లడైంది. దోపిడీ జరిగింది ఇలా.. వెంకట రామలక్ష్మి కుటుంబం గతంలో గుడివాడలో ఉండేది. అక్కడ పక్క పోర్షన్లో ఉండే సుధారాణితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహంగా ఉంటున్నా రు. తరువాత వెంకట రామలక్ష్మి కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. సుధారాణి అప్పుడప్పుడూ రామలక్ష్మి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది. సుధారాణికి రాజమండ్రి బాలాజీపేటకు చెందిన చదలవాడ అంబేద్కర్ అనే యువకుడితో రెండేళ్ల క్రితం రైలులో పరి చయం ఏర్పడింది. అంబేద్కర్ ఒకరోజు సుధారాణిని కలిసి తనకు రూ. 2 లక్షలు డబ్బు అవస రం ఉందని, ఆ సొమ్ముతో ముంబై వెళ్లి వ్యా పారం చేస్తానని చెప్పాడు. అంత డబ్బు తన వద్ద లేదని ఆమె చెప్పింది. తన స్నేహితురాలు వెంకట రామలక్ష్మి ధనవంతురాలని, ఆమెను బెదిరించి బంగారం దోచుకుందామని సూచిం చింది. దాంతో వారిద్దరూ కలిసి దోపిడీకి వ్యూహం రచించారు. గతనెల 26న గుడివాడ నుంచి కారులో బెంజి సర్కిల్ వరకూ వచ్చారు. అక్కడి నుంచి చెరో ఆటోలో బృందావన్ కాలనీ లోని అపార్ట్మెంటుకు వచ్చారు. ముందుగా లోపలకు వె ళ్లిన సుధారాణి.. స్నేహితురాలితో కబుర్లు మొదలెట్టింది. కొద్దిసేపటికి అంబేద్కర్ లోనికి చొరబడి దేవుని గదిలో నక్కాడు. అదను చూసుకుని రామలక్ష్మిపై కత్తితో దాడిచేసి మెడ లో గొలుసు లాక్కున్నాడు. బీరువాలో బం గారం దొంగిలించేందుకు యత్నించగా, రామలక్ష్మి అపార్ట్మెంట్ రెండో అంతస్తులో ఉన్నవారికి ఫోన్ చేసేందుకు యత్నించింది. దాంతో అంబేద్కర్ కంగారు పడి, సుధారాణిని కూడా కొట్టినట్లు నటించి, ఆమె మెడలోని రోల్డుగోల్డు వస్తువులను లాక్కున్నాడు. కిందకు వచ్చి, కత్తిని అపార్టుమెంటు పక్కనే పొదల్లో పడేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామలక్ష్మి వద్ద దోచుకున్న గొలుసును అమ్మేందుకు నగరానికి వచ్చిన అంబేద్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంత రం అతడితోపాటు సుధారాణిని అరెస్టు చేశా రు. సెంట్రల్ ఏసీపీ డి.వి.నాగేశ్వరరావు పర్యవేక్షణలో కృష్ణలంక స్టేషన్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు. -
స్నేహితురాలి నమ్మకద్రోహం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : నగరంలోని లబ్బీపేట బృందావన్ కాల నీలోని ఓ అపార్ట్మెంటులో నెలరోజుల క్రితం పట్టపగలు జరిగిన హత్యాయత్నం, దోపిడీ కేసు ను పోలీసులు ఛేదించారు. అప్పట్లో తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితురాలి స్నేహితురాలే కీలకపాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రవిప్రకాష్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. బృందావన్ కాలనీ రాజేష్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఉంటున్న వెంకట రామలక్ష్మిని గత నెల 26 వ తేదీ మిట్టమధ్యాహ్నం ఓ యువకుడు కత్తితో పొడిచి, ఆమె మెడలోని ఏడున్నర కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. ఈ ఘటన జరగడానికి ముం దు రామలక్ష్మి స్నేహితురాలు సుధారాణి అపార్ట్మెంట్లోకి ప్రవేశించిందని, ఆమె వెనుకే ఓ యువకుడు కూడా వచ్చినట్లు వాచ్మెన్ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుధారాణిపై అనుమానం వచ్చి నిఘా పెట్టారు. ఆమె కదలికలు, సెల్‌ఫోన్ కాల్స్, ఇతర అంశాలను పరి శీలించి, అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, అసలు విషయం వెల్లడైంది. దోపిడీ జరిగింది ఇలా.. వెంకట రామలక్ష్మి కుటుంబం గతంలో గుడివాడలో ఉండేది. అక్కడ పక్క పోర్షన్లో ఉండే సుధారాణితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహంగా ఉంటున్నా రు. తరువాత వెంకట రామలక్ష్మి కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. సుధారాణి అప్పుడప్పుడూ రామలక్ష్మి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది. సుధారాణికి రాజమండ్రి బాలాజీపేటకు చెందిన చదలవాడ అంబేద్కర్ అనే యువకుడితో రెండేళ్ల క్రితం రైలులో పరి చయం ఏర్పడింది. అంబేద్కర్ ఒకరోజు సుధారాణిని కలిసి తనకు రూ. 2 లక్షలు డబ్బు అవస రం ఉందని, ఆ సొమ్ముతో ముంబై వెళ్లి వ్యా పారం చేస్తానని చెప్పాడు. అంత డబ్బు తన వద్ద లేదని ఆమె చెప్పింది. తన స్నేహితురాలు వెంకట రామలక్ష్మి ధనవంతురాలని, ఆమెను బెదిరించి బంగారం దోచుకుందామని సూచిం చింది. దాంతో వారిద్దరూ కలిసి దోపిడీకి వ్యూహం రచించారు. గతనెల 26న గుడివాడ నుంచి కారులో బెంజి సర్కిల్ వరకూ వచ్చారు. అక్కడి నుంచి చెరో ఆటోలో బృందావన్ కాలనీ లోని అపార్ట్మెంటుకు వచ్చారు. ముందుగా లోపలకు వె ళ్లిన సుధారాణి.. స్నేహితురాలితో కబుర్లు మొదలెట్టింది. కొద్దిసేపటికి అంబేద్కర్ లోనికి చొరబడి దేవుని గదిలో నక్కాడు. అదను చూసుకుని రామలక్ష్మిపై కత్తితో దాడిచేసి మెడ లో గొలుసు లాక్కున్నాడు. బీరువాలో బం గారం దొంగిలించేందుకు యత్నించగా, రామలక్ష్మి అపార్ట్మెంట్ రెండో అంతస్తులో ఉన్నవారికి ఫోన్ చేసేందుకు యత్నించింది. దాంతో అంబేద్కర్ కంగారు పడి, సుధారాణిని కూడా కొట్టినట్లు నటించి, ఆమె మెడలోని రోల్డుగోల్డు వస్తువులను లాక్కున్నాడు. కిందకు వచ్చి, కత్తిని అపార్టుమెంటు పక్కనే పొదల్లో పడేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామలక్ష్మి వద్ద దోచుకున్న గొలుసును అమ్మేందుకు నగరానికి వచ్చిన అంబేద్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంత రం అతడితోపాటు సుధారాణిని అరెస్టు చేశా రు. సెంట్రల్ ఏసీపీ డి.వి.నాగేశ్వరరావు పర్యవేక్షణలో కృష్ణలంక స్టేషన్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు.