విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : నగరంలోని లబ్బీపేట బృందావన్ కాల నీలోని ఓ అపార్ట్‌మెంటులో నెలరోజుల క్రితం పట్టపగలు జరిగిన హత్యాయత్నం, దోపిడీ కేసు ను పోలీసులు ఛేదించారు. అప్పట్లో తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితురాలి స్నేహితురాలే కీలకపాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రవిప్రకాష్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం..
బృందావన్ కాలనీ రాజేష్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఉంటున్న వెంకట రామలక్ష్మిని గత నెల 26 వ తేదీ మిట్టమధ్యాహ్నం ఓ యువకుడు కత్తితో పొడిచి, ఆమె మెడలోని ఏడున్నర కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. ఈ ఘటన జరగడానికి ముం దు రామలక్ష్మి స్నేహితురాలు సుధారాణి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిందని, ఆమె వెనుకే ఓ యువకుడు కూడా వచ్చినట్లు వాచ్‌మెన్ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుధారాణిపై అనుమానం వచ్చి నిఘా పెట్టారు. ఆమె కదలికలు, సెల్‌ఫోన్ కాల్స్, ఇతర అంశాలను పరి శీలించి, అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, అసలు విషయం వెల్లడైంది.
దోపిడీ జరిగింది ఇలా..
వెంకట రామలక్ష్మి కుటుంబం గతంలో గుడివాడలో ఉండేది. అక్కడ పక్క పోర్షన్‌లో ఉండే సుధారాణితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహంగా ఉంటున్నా రు. తరువాత వెంకట రామలక్ష్మి కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. సుధారాణి అప్పుడప్పుడూ రామలక్ష్మి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది. సుధారాణికి రాజమండ్రి బాలాజీపేటకు చెందిన చదలవాడ అంబేద్కర్ అనే యువకుడితో రెండేళ్ల క్రితం రైలులో పరి చయం ఏర్పడింది. అంబేద్కర్ ఒకరోజు సుధారాణిని కలిసి తనకు రూ. 2 లక్షలు డబ్బు అవస రం ఉందని, ఆ సొమ్ముతో ముంబై వెళ్లి వ్యా పారం చేస్తానని చెప్పాడు.
అంత డబ్బు తన వద్ద లేదని ఆమె చెప్పింది. తన స్నేహితురాలు వెంకట రామలక్ష్మి ధనవంతురాలని, ఆమెను బెదిరించి బంగారం దోచుకుందామని సూచిం చింది. దాంతో వారిద్దరూ కలిసి దోపిడీకి వ్యూహం రచించారు. గతనెల 26న గుడివాడ నుంచి కారులో బెంజి సర్కిల్ వరకూ వచ్చారు. అక్కడి నుంచి చెరో ఆటోలో బృందావన్ కాలనీ లోని అపార్ట్‌మెంటుకు వచ్చారు. ముందుగా లోపలకు వె ళ్లిన సుధారాణి.. స్నేహితురాలితో కబుర్లు మొదలెట్టింది. కొద్దిసేపటికి అంబేద్కర్ లోనికి చొరబడి దేవుని గదిలో నక్కాడు. అదను చూసుకుని రామలక్ష్మిపై కత్తితో దాడిచేసి మెడ లో గొలుసు లాక్కున్నాడు.
బీరువాలో బం గారం దొంగిలించేందుకు యత్నించగా, రామలక్ష్మి అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో ఉన్నవారికి ఫోన్ చేసేందుకు యత్నించింది. దాంతో అంబేద్కర్ కంగారు పడి, సుధారాణిని కూడా కొట్టినట్లు నటించి, ఆమె మెడలోని రోల్డుగోల్డు వస్తువులను లాక్కున్నాడు. కిందకు వచ్చి, కత్తిని అపార్టుమెంటు పక్కనే పొదల్లో పడేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామలక్ష్మి వద్ద దోచుకున్న గొలుసును అమ్మేందుకు నగరానికి వచ్చిన అంబేద్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంత రం అతడితోపాటు సుధారాణిని అరెస్టు చేశా రు. సెంట్రల్ ఏసీపీ డి.వి.నాగేశ్వరరావు పర్యవేక్షణలో కృష్ణలంక స్టేషన్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు.
దోపిడీ జరిగింది ఇలా..
Published Sat, Sep 28 2013 1:50 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement