
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ నేతృత్వంలో 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్ కీపర్ ఇతిమరపు రజనికి చోటు దక్కింది.
ఈ జట్టుకు ప్రధాన గోల్ కీపర్ సవిత వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఈ ప్రతిష్టాత్మక క్రీడలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా జరిగే హాకీ ఈవెంట్‌లో భారత్... మలేసియా, వేల్స్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో కలిసి పూల్ ‘ఎ’లో ఉంది. ఏప్రిల్ 5న జరిగే తమ తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment