
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని... హాకీ ఇండియా 33 మందితో కూడిన భారత మహిళల ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. బెంగళూరులో ఆదివారం మొదలయ్యే ఈ శిబిరం డిసెంబర్ 23 వరకు జరుగుతుంది. ప్రాబబుల్స్ జాబితా లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి, భారత జట్టు రెండో గోల్‌కీపర్ ఇతిమరపు రజనికి స్థానం లభించింది. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో టాప్–3లో నిలువడం... ఆసియా క్రీడల్లో స్వర్ణం ద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తమ ముందున్న లక్ష్యాలని కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు.