5–1తో ఆ్రస్టేలియా ఘన విజయం
పెర్త్: ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల హాకీ సిరీస్‌ను భారత జట్టు పరాజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి టెస్టులో ఆ్రస్టేలియా 5–1 గోల్స్ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఆరంభంనుంచి చివరి వరకు తమ పట్టు నిలబెట్టుకున్న కంగారూలు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆసీస్ సాధించిన ఐదు గోల్స్‌లో నాలుగు ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం.
ఆస్ట్రేలియా తరఫున బ్రాడ్ టిమ్ (3వ నిమిషం), వికామ్ టామ్ (20వ ని., 38వ ని.), రింటాలా జోయెల్ (37వ ని.), ఒగిల్‌వి ప్లయిన్ (57వ ని.) గోల్స్ కొట్టారు. భారత్ తరఫున ఏకైక గోల్‌ను గుర్జంత్ సింగ్ (47వ ని.) నమోదు చేశాడు. మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే లాంగ్ పాస్ అందుకున్న బ్రాడ్... భారత ఆటగాడు జర్మన్‌ప్రీత్‌ను దాటి గోల్ పోస్ట్‌ను ఛేదించడంలో సఫలమయ్యాడు. 10వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ దక్కినా అది గోల్‌గా మారలేదు.
ఆ తర్వాత ఆసీస్ భారత డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచిన ఆసీస్ మూడో క్వార్టర్‌లోనూ దూకుడు సాగించింది. అయితే చివరి క్వార్టర్‌లో కోలుకున్న భారత్ ప్రతిఘటించింది. రెండు నిమిషాలకే రాహిల్ ఇచి్చన పాస్‌ను అందుకున్న గుర్జంత్ దానిని గోల్‌గా మలిచాడు. కొద్ది సేపటికే పెనాల్టీ వచి్చనా భారత్ దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నేడు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment