పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్ లీగ్ దశలో హరియాణా స్టీలర్స్ జట్టు అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 47–30 పాయింట్లతో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. హరియాణా తరఫున శివమ్ పటారె అత్యధికంగా 14 పాయింట్లు స్కోరు చేశాడు. మొహమ్మద్ రెజా, వినయ్ 6 పాయింట్ల చొప్పున సాధించగా... రాహుల్ 5 పాయింట్లు సంపాదించాడు.
యు ముంబా తరఫు సతీశ్ కన్నన్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హరియాణా జట్టు 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా 84 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 42–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున హిమాన్షు 13 పాయింట్లు సాధించాడు.
బెంగళూరు బుల్స్ రెయిడర్ సుశీల్ 15 పాయింట్లతో మెరిసినా తన జట్టును గెలిపించుకోవడంలో విఫలమయ్యాడు. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8 గంటల నుంచి); పుణేరి పల్టన్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి.
ఇప్పటికే హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్, జైపూర్ పింక్ పాంథర్స్ ‘ప్లే ఆఫ్స్’ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. చివరిదైన ఆరో బెర్త్ కోసం యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్లు రేసులో ఉన్నాయి. బెంగాల్ వారియర్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో యు ముంబా గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్‌ను దక్కించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment