ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది.., ఈ ఖో ఖో ప్రపంచ కప్ 2025 జనవరి 13 నుండి జనవరి 19 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం స్టేడియంలో జరగనుంది. అంతర్జాతీయ క్రీడా వేదికపై ఖో ఖో ను ప్రశస్తిని పెంచడానికి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పురుషులు-మహిళలు రెండు విభాగాల్లోనూ పాల్గొనే జట్ల సంఖ్యను పెంచింది.
గత నియమాలకు అనుగుణంగా టోర్నమెంట్‌లో 16 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనే దేశాల నుంచి భారీగా ఆసక్తి పెగడంతో ప్రపంచ కప్‌లో పురుషుల కోసం 21 జట్లకు, మహిళలకు 20 జట్లకు మైదానాన్ని విస్తరించారు.
ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామంలో ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ మరియు ఓషియానియాకు (ఆరు ఖండాలు) చెందిన దేశాలు పాల్గోంటున్నాయి.
ఖో ఖో ప్రపంచ కప్ 2025లో పాల్గొనే దేశాలు:
ఖండం: ఆఫ్రికా
పురుషుల: ఘనా, కెన్యా, దక్షిణాఫ్రికా
మహిళల: కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండా
ఖండం: ఆసియా
పురుషుల: బంగ్లాదేశ్, భూటాన్, భారత్ (ఆతిథ్య), ఇరాన్, మలేషియా, నేపాల్, పాకిస్థాన్, దక్షిణ కొరియా, శ్రీలంక
మహిళలు: బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం (ఆతిథ్య), ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, శ్రీలంక
ఖండం: యూరోప్
పురుషుల: ఇంగ్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, పోలాండ్
మహిళలు: ఇంగ్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, పోలాండ్
ఖండం: ఉత్తర అమెరికా
పురుషుల: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
ఖండం: దక్షిణ అమెరికా
పురుషుల: అర్జెంటీనా, బ్రెజిల్, పెరూ
మహిళలు: పెరూ
ఖండం: ఓషియానియా (ఆస్ట్రేలియా)
పురుషుల: ఆస్ట్రేలియా
మహిళల: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
ఈ ప్రపంచ కప్ సన్నాహాల గురించి భారత ఖో ఖో ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ సుధాన్షు మిట్టల్ మాట్లాడుతూ... "మేము విదేశీ ప్రతినిధులను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. అతిథులకు వారి ఆహార అవసరాలకు అనుగుణంగా భోజనం, ఆహార ప్రణాళికను రూపొందించాము. వారి కోసం పూర్తి లాజిస్టిక్స్, బస, రవాణా సౌకర్యాలను కూడా అందజేస్తున్నాం.
తద్వారా వారు ఇక్కడ ఉండే సమయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా టోర్నమెంట్ ముగిసే వరకు అన్ని దేశాలు ఉండేందుకు మేము ఏర్పాట్లు చేసాము. ఫలితాలతో సంబంధం లేకుండా ఖో ఖో ప్రపంచ కప్ 2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంద’’ని తెలిపారు.
జనవరి 13న ప్రపంచకప్ ప్రారంభోత్సవం జరగనుంది.. ఆ తర్వాత టోర్నమెంట్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. జనవరి 14 నుండి జనవరి 16 మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత క్వార్టర్-ఫైనల్స్ మరియు సెమీ-ఫైనల్స్ వరుసగా జనవరి 17 మరియు 18 జనవరిలో జరుగుతాయి. తొలిసారిగా ఖో ఖో ప్రపంచకప్ ఫైనల్స్ జనవరి 19న జరగనున్నాయి.
భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI)తో తన భాగస్వామ్యాన్ని ధృవీకరించి.. ఈ ఈవెంట్‌కు తిరుగులేని మద్దతుకు ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment