Indian team
-
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్‌లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్‌ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్‌లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
ప్రపంచకప్ : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
-
భారత్‌దే హాకీ సిరీస్
జపాన్‌పై 2-0తో గెలుపు భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 2-1తో నెగ్గింది. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ గోల్‌గా మలిచాడు. 36వ నిమిషంలో ఆకాశ్ దీప్ గోల్‌తో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జపాన్ తరఫున 44వ నిమిషంలో వకరి పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రా కాగా... భారత్ రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి... మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. -
చివర్లో తడబాటు
♦ కివీస్ చేతిలో భారత్ ఓటమి ♦ అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీ ఇఫో : చివర్లో డిఫెండర్ల అలసత్వం కారణంగా భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. సోమవారం అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2తో ఓడింది. తొలి అరగంట ఆటలో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా... 38వ నిమిషంలో కివీస్ కెప్టెన్ సైమన్ చైల్డ్ చేసిన ఫీల్డ్ గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 43వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే చివర్లో తమకు దక్కిన అవకాశాలను భారత జట్టు వృథా చేసుకుంది. దీనికి తోడు భారత్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ 55వ నిమిషంలో ఆండీ హేవార్డ్ గోల్‌తో కివీస్ నెగ్గింది. భారత్ తమ మూడో మ్యాచ్‌లో 8న మలేసియాతో తలపడుతుంది. -
ఇండియన్ క్రికెట్ టీమ్ ను అభినందించిన ప్రణబ్
న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్ లో అయిదు వరుస విజయాలతో రికార్డు సాధించిన భారత క్రికెట్ టీమ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ లో అభినందించారు. ఐసీసీ ప్రపంచకప్ 2015 లో ఐర్జాండ్ పై విజయం సాధించిన ఇండియా అయిదు వరుస విజయాలతో రికార్డు సాధించింది..వెల్ డన్ అంటూ ట్వీట్ చేశారు. మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడా భారత్ ఘన విజయం సాధించి, గ్రూప్ -బి లో ఇండియా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుందంటూ ట్వీట్ చేశారు ప్రెసిడెంట్.