ఐసీసీ వరల్డ్ కప్ లో అయిదు వరుస విజయాలతో రికార్డు సాధించిన భారత క్రికెట్ టీమ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ లో అభినందించారు.
న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్ లో అయిదు వరుస విజయాలతో రికార్డు సాధించిన భారత క్రికెట్ టీమ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ లో అభినందించారు. ఐసీసీ ప్రపంచకప్ 2015 లో ఐర్జాండ్ పై విజయం సాధించిన ఇండియా అయిదు వరుస విజయాలతో రికార్డు సాధించింది..వెల్ డన్ అంటూ ట్వీట్ చేశారు. మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడా భారత్ ఘన విజయం సాధించి, గ్రూప్ -బి లో ఇండియా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుందంటూ ట్వీట్ చేశారు ప్రెసిడెంట్.